పారిస్ : చిడో తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. హిందు మహాసముద్రంలో ఏర్పడిన చిడో తుపాను తీవ్రతతో మయోట్ ద్వీపంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులైనట్లు ఫ్రాన్స్ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తుపాను కారణంగా గంటకు దాదాపు 220 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు ద్వీపాన్ని అతలా కుతలం చేశాయి. ఫలితంగా తాత్కాలిక గృహాలు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ గాలుల ప్రభావం వల్ల ప్రాణ,ఆస్తినష్టం భారీ ఎత్తున జరిగిందని అన్నారు.
గత 90 ఏళ్లలో మయోట్‌ను తాకిన అత్యంత భయంకరమైన తుపాను ఇదేనని అధికారులు చెప్పారు. ఫ్రాన్స్ ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఆదివారం ఉదయం చిడో తుఫాన్ ప్రారంభంలో 11మంది మరణించగా, 250 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు ధృవీకరించింది. అయితే మరణాలు, గాయపడ్డ వారి సంఖ్య సోమవారం ఉదయం నాటికి గణనీయంగా పెరిగినట్లు అంచనా వేసింది.
🚨 Intense Tropical #CycloneChido hit Cabo Delgado, Nampula & Niassa early Sunday with winds over 200km/h & heavy rains, impacting an estimated 1.7M people in 🇲🇿
IOM, govt & partners are on the ground, assessing needs & coordinating early response, with PSEA measures reinforced. pic.twitter.com/KUd1N5Zbkb— IOM Mozambique (@IOM_Mozambique) December 15, 2024
శనివారం తుఫాను కారణంగా మయోట్ ద్వీపం పూర్తిగా దెబ్బ తిన్నదని, జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎంతనేది అంచనా వేయడం కష్టంగా ఉందన్నారు. ఫ్రాన్స్ రెస్క్యూ టీమ్‌లు.. మెడిసిన్, ఆహారంతో పాటు ఇతర నిత్యవసర వస్తువుల్ని ద్వీపానికి తరలించినట్లు మయోట్ ద్వీప ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment