పై-లీన్ ఎఫెక్ట్‌తో పలు రైళ్ల రద్దు
Published Sun, Oct 13 2013 1:38 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన పై-లీన్ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మీదుగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్‌లను, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. శనివారం 18048 వాస్కోడిగామా- హౌరా ఎక్స్‌ప్రెస్, విశాఖ - భువనేశ్వర్ ఇంటర్‌సిటీతో పాటూ పలు ఎక్స్‌ప్రెస్‌లు రద్దయినట్లు అధికారులు తెలిపారు. 17016 సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను విజయనగరం రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు తిరిగి విజయనగరం నుంచి సికిం ద్రాబాద్ వెళ్లిపోతుంది. రైల్వే విచారణ కేంద్రాల వద్ద హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటుచేశారు. ప్రయాణికులు 08922 - 224240, 225510 నంబర్ల ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చని చెప్పారు. రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులకు రీఫండ్ ఇచ్చేందు కు రైల్వే శాఖ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది.
Advertisement
Advertisement