
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ‘యాస్’ తుపాను కారణంగా విజయవాడ మీదుగా నడిచే 21 ప్రత్యేక రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. 23న మైసూర్–హౌరా (08118), 24న యశ్వంత్‌పూర్–భువనేశ్వర్ (02846), చెన్నై సెంట్రల్–పూరీ (02860),ఎర్నాకులం–హౌరా (02878), గౌహతి–యశ్వంత్‌పూర్ (06578) రైళ్లు రద్దయ్యాయి.
25న హౌరా–వాస్కోడిగామా (08047/08048), హౌరా–యశ్వంత్‌పూర్ (06598), అగర్తలా–బెంగళూరు (02516/02516)రైళ్లు, 26న గౌహతి–సికింద్రాబాద్ (07029),విల్లుపురం–పురులియా (06170), యశ్వంత్‌పూర్–ముజఫర్‌పూర్ (05227) రైళ్లు రద్దయినట్లు పేర్కొన్నారు. 28న న్యూటిన్‌సూకియా–బెంగళూరు (02250), 29న యశ్వంత్‌పూర్–బాగల్‌పూర్ (02253), యశ్వంత్‌పూర్–కామాఖ్య (02551) రైళ్లను రద్దు చేసినట్లు చెప్పారు. హౌరా–హైదరాబాద్ ప్రత్యేక రైలు (08645/08646) ఈ నెల 24 నుంచి 27 వరకు, ఈ నెల 26, 27న బయలుదేరాల్సిన విల్లుపురం–కాగజ్‌నగర్ (06178/06177), 27, 28న బయలుదేరాల్సిన బెంగళూరు–గౌహతి (02509)లను రద్దు చేసినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment