టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో ఎంత తెలిసినవారైనా తప్పకుండా మోసపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొంతమంది మనం వాడి పడేసిన సిమ్ కార్డులను ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం.
నిజానికి సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చే ఆఫర్లకు ఆకర్షితులై ఒక్కొక్కరు నాలుగైదు సిమ్ కార్డులు కొనేసి.. వినియోగించిన తరువాత పడేస్తున్నారు. ఇలాంటి నంబర్లను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల విజయవాడకు సంబంధించిన ఒకే వ్యక్తి కార్డుతో 658 సిమ్ కార్డులు యాక్టివేట్ అయినట్లు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. టెలికామ్ అధికారులు వీటిని మొత్తం బ్లాక్ చేసినట్లు సమాచారం.
టెలికామ్ శాఖ కొత్త నిబంధనల ప్రకారం, ఒక ఆధార్ కార్డుపై గరిష్టంగా 9 సిమ్ కార్డులు మాత్రమే కలిగి ఉండాలని ఆదేశించించినట్లు సమాచారం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ సిమ్ కార్డులు తీసుకోవాల్సి వస్తే.. రీ వెరిఫికేషన్ చేసుకోవాలని తెలుస్తోంది. మొత్తం మీద సిమ్ కార్డుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఏం ఐడియా గురూ! డ్రైవర్ క్రియేటివిటీకి ఫిదా అవుతున్న ప్యాసింజర్లు..
టెలికామ్ సంస్థ ఒక ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయని తెలుసుకోవడానికి ఓ కొత్త వెబ్‌సైట్ తీసుకువచ్చింది. దీంతో ఆధార్ నెంబర్ మీద ఎన్ని సిమ్ కార్డులున్నాయనే విషయం మాత్రమే కాకుండా.. మొబైల్ ఎవరైనా దొంగలించిన లేదా పోగొట్టుకున్న సమయంలో అయినా నెంబర్ బ్లాక్ చేసే అవకాశం ఉంది.
ఇలా తెలుసుకోండి..
- మొదట సంచార్ సతి అధికారిక వెబ్‌సైట్ (www.sancharsaathi.gov.in) ఓపెన్ చేయాలి.
- అందులో మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీ మొబైల్ నెంబర్ కనెక్షన్ తెలుసుకోండి(TAFCOP) మీద క్లిక్ చేయాలి.
- కొత్త పేజీ ఓపెన్ అయిన తరువాత మీ 10 అంకెల మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తరువాత, వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే.. యూజర్ మీద ఎన్ని మొబైల్ నంబర్స్ ఉన్నాయో కనిపిస్తుంది.
- అందులో మీది కానీ నెంబర్ బ్లాక్ చేసుకునే ఆప్షన్ కూడా అక్కడే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment