technology help
-
మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయో ఇలా తెలుసుకోండి.. లేకుంటే ప్రమాదమే!
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో ఎంత తెలిసినవారైనా తప్పకుండా మోసపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొంతమంది మనం వాడి పడేసిన సిమ్ కార్డులను ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం. నిజానికి సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చే ఆఫర్లకు ఆకర్షితులై ఒక్కొక్కరు నాలుగైదు సిమ్ కార్డులు కొనేసి.. వినియోగించిన తరువాత పడేస్తున్నారు. ఇలాంటి నంబర్లను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల విజయవాడకు సంబంధించిన ఒకే వ్యక్తి కార్డుతో 658 సిమ్ కార్డులు యాక్టివేట్ అయినట్లు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. టెలికామ్ అధికారులు వీటిని మొత్తం బ్లాక్ చేసినట్లు సమాచారం. టెలికామ్ శాఖ కొత్త నిబంధనల ప్రకారం, ఒక ఆధార్ కార్డుపై గరిష్టంగా 9 సిమ్ కార్డులు మాత్రమే కలిగి ఉండాలని ఆదేశించించినట్లు సమాచారం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ సిమ్ కార్డులు తీసుకోవాల్సి వస్తే.. రీ వెరిఫికేషన్ చేసుకోవాలని తెలుస్తోంది. మొత్తం మీద సిమ్ కార్డుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఏం ఐడియా గురూ! డ్రైవర్ క్రియేటివిటీకి ఫిదా అవుతున్న ప్యాసింజర్లు.. టెలికామ్ సంస్థ ఒక ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయని తెలుసుకోవడానికి ఓ కొత్త వెబ్సైట్ తీసుకువచ్చింది. దీంతో ఆధార్ నెంబర్ మీద ఎన్ని సిమ్ కార్డులున్నాయనే విషయం మాత్రమే కాకుండా.. మొబైల్ ఎవరైనా దొంగలించిన లేదా పోగొట్టుకున్న సమయంలో అయినా నెంబర్ బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఇలా తెలుసుకోండి.. మొదట సంచార్ సతి అధికారిక వెబ్సైట్ (www.sancharsaathi.gov.in) ఓపెన్ చేయాలి. అందులో మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీ మొబైల్ నెంబర్ కనెక్షన్ తెలుసుకోండి(TAFCOP) మీద క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అయిన తరువాత మీ 10 అంకెల మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తరువాత, వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే.. యూజర్ మీద ఎన్ని మొబైల్ నంబర్స్ ఉన్నాయో కనిపిస్తుంది. అందులో మీది కానీ నెంబర్ బ్లాక్ చేసుకునే ఆప్షన్ కూడా అక్కడే ఉంటుంది. -
టెక్ హెల్ప్..
జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడని సూత్రాలు రెండున్నాయి. ఒకటి.. డబ్బు పోగొట్టుకోవద్దు. రెండు... మొదటి సూత్రాన్ని ఎప్పుడూ మరిచిపోవద్దు.- వారెన్ బఫెట్ టెక్ హెల్ప్.. బడ్జెట్ అదుపులో ఉండాలంటే ఖర్చులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవాల్సిందే. ఆర్థిక లక్ష్యాల సాధనలో ఇదే కీలకం. ఇందుకోసం పర్సనల్ ఫైనాన్స్ ప్రణాళికలకు కాస్త టెక్నాలజీని కూడా తోడు చేయండి. అందుబాటులో ఉన్న సాఫ్ట్వేర్లు, స్మార్ట్ఫోన్ యాప్స్ మీ కోసం.. Expensify తరచు ప్రయాణాలు చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది. దీంతో ఖర్చులు, క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లు, బ్యాంక్ ఖాతాల లావాదేవీలు అన్నిటినీ ట్రాక్ చేసుకోవచ్చు. అంతే కాదు, దీన్లో బిల్ట్ ఇన్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ టెక్నాలజీ కూడా ఉంది. దీంతో రసీదులను స్కాన్ చేసుకుని వివరాలను రికార్డు చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన కోసం కావాలంటే ఖర్చుల వివరాలతో కూడిన రిపోర్టు కూడా ఇది తయారు చేసిపెడుతుంది. TOSHL Finance వారంవారీ, నెలవారీ బడ్జెట్లను దీన్లో సెట్ చేసి ఉంచుకోవచ్చు. ఖర్చులను ట్రాక్ చేసుకుంటూ, బడ్జెట్ను అదుపులో ఉంచుకోవచ్చు. దీన్లోని బిల్స్ ఆర్గనైజర్లో ప్రతి నెలా కట్టాల్సిన బిల్లులు వగైరా వాటి గురించి ఫీడ్ చేసి ఉంచితే... గడువుకు కాస్త ముందుగా అలర్ట్ చేస్తుంది. విదేశాల్లో ప్రయాణించేటప్పుడు కూడా దేశీ కరెన్సీలో ఖర్చులపై కన్నేసి ఉంచేందుకు కరెన్సీ కన్వర్టర్ ఫీచర్ ఉంది. మొత్తం ఆర్థిక లావాదేవీలు గ్రాఫ్ రూపంలో కూడా చూపిస్తుంది. Daily Expence Manager పేరుకి తగినట్లే రోజువారీ ఖర్చులు, ఆదాయాలను ట్రాక్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. చాలా సింపుల్ యాప్. కేటగిరీ ప్రకారం ఖర్చులు చూసుకోవచ్చు. కట్టాల్సిన బిల్లులు మొదలైన వాటి గురించి ముందుగా రిమైండర్లు పెట్టుకోవచ్చు. Expence Tracker ఆదాయాలు, వ్యయాలపై కన్నేసి ఉంచడానికి ఉపయోగపడే మరో యాప్ ఇది. ఇందులో ముందుగానే కొన్ని కేటగిరీలు (ఫుడ్, ఎంటర్టైన్మెంట్, వైద్యం మొదలైనవి) పొందుపరిచి ఉంటాయి. కావాలంటే మరికొన్ని జోడిం చుకోవచ్చు. ఆదాయం ఎంత? ఖర్చెంత? మిగిలిందెంత? అనేది చిటికెలో తెలుసుకోవచ్చు.