నందన్ నిలేకని పరిచయం అక్కర్లేని పేరు. ‘ఆధార్ కార్డ్’ పేరుతో ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ ఐడీ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చిన సృష్టికర్త, ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతూ..ఎన్‌ఆర్ నారాయణ మూర్తితో కలిసి ఇన్ఫోసిస్‌ను స్థాపించిన సహా వ్యవస్థాపకుడు..ఆ సంస్థ ఛైర్మన్ కూడా. ఇలా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖుల్లో ఒకరైన నందన్ నిలేకనితో సెల్ఫీ దిగాలని ప్రపంచ దేశాలకు చెందిన ఆయన అభిమానులు కోరుతున్నారు.
ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ బ్లాక్‌రాక్ గ్లోబుల్ క్లయింట్ బిజినెస్ హెడ్ మార్క్ వైడెమాన్ (Mark Wiedman) నందన్ నిలేకని గొప్పతనం గురించి లింక్డిన్ అకౌంట్‌లో షేర్ చేశారు.
ఆ పోస్ట్‌లో నిలేకనికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. తన సంస్థ(బ్లాక్‌రాక్) ఉద్యోగులకు ఆయనంటే మహా ఇష్టం. నేను ఈ సంవత్సరం ముంబైలో నందన్ నీలేకనిని కలిసిన తర్వాత, దేశాభివృద్దిలో ఆయన సేవలు గురించి తెలుసుకునేందుకు నిర్మాణ సంస్థ హడ్సన్ యార్డ్స్ (Hudson Yards) కార్యాలయానికి ఆహ్వానించినట్లు వైడ్‌మాన్ తన పోస్ట్‌లో తెలిపారు.
అంతేకాదు నిలేకని సహకారాన్ని ప్రస్తావిస్తూ.. వైడ్‌మాన్ ఒక ప్రశ్నతో ప్రారంభించారు. ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు గుర్తింపు కార్డు లేకుండా జీవిస్తున్నారని ఊహించగలరా’ అని ప్రశ్నించారు. నిలేకని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్' (UPI) సృస్టికర్త. అతను గత 14 సంవత్సరాలుగా వందల మిలియన్ల మందికి ప్రత్యేకమైన గుర్తింపు కార్డ్‌లను అందించడంలో భారత్ రూపు రేఖల్ని మార్చేశారు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. నందన్ సృష్టించిన కొత్త సాంకేతికత భారతీయులకు వారి రోజువారీ జీవితంలో ఎలా సహాయపడుతుందో కూడా పేర్కొన్నారు. .
ప్రపంచ వ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ జరగాలనేది ఆయన లక్ష్యం. ఇందుకోసం భారత్‌తో సహకరించేందుకు 50 దేశాలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఇక కార్యక్రమం ముగిసిన అనంతరం తన సంస్థ ఉద్యోగులు నందన్‌తో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారని వెల్లడించారు.
చదవండి👉 ఆధార్ కార్డ్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త! ఇంటి వద్ద నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా
Comments
Please login to add a commentAdd a comment