ఆధార్ ద్వారా ఓ వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరికి సందేశాలు పంపుతున్నారు వంటి సమాచారం తెలుసుకోవడంతోపాటు ఇంట్లో ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నారనే విషయం కూడా పసిగట్టి ఆ ఇంటిని దోచుకోవడానికి అవకాశం ఉంది. ఇదే ఓ మహిళ అయితే, ఆమె వెంటపడే వ్యక్తి ఆమె ఆధార్ సాయంతో ఆమె ఇంటికి చేరుకునే వీలు కూడా ఉంది. ఇలాంటి ముప్పు ఉందనే విషయం శర్మ వంటి పెద్ద హోదాలో ఉన్న వ్యక్తికి తెలియకపోవచ్చు. ట్రాయ్ చైర్మన్ తన ఆధార్ నంబర్ చెప్పి సవాలు విసరగానే అనేకమంది తమ నంబర్లు ఆన్‌లైన్‌లో వెల్లడిస్తూ తమ గోప్యత గుట్టు విప్పవచ్చని చాలెంజ్ చేశారు. అలా చేస్తే వారు ఇబ్బందుల్లో చిక్కుకోవడానికి ఆహ్వానం పలికినట్లే.
ఆధార్ నంబర్ వెల్లడిస్తే ఏ వ్యక్తి సమాచారమైనా ఎంత వరకు తవ్వి తీయ వచ్చో ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ వ్యవహారంలో తేలిపోయింది. టెక్నాలజీ డెవలపర్ కింగ్‌స్లీ జాన్ ప్రశ్నకు స్పందనగా శర్మ శనివారం ట్విట్టర్‌లో తన ఆధార్ సంఖ్య లోకానికి వెల్లడిస్తూ, ఈ నంబర్ ద్వారా తనకు ఎలాంటి హాని చేయగలరో నిరూపిం చాలని సవాలు విసిరారు. వెంటనే ఆధార్ నంబ రుతో కొందరు ఆయన మొబైల్ ఫోన్ నంబర్లు, జీమెయిల్, యాహూ అడ్రస్‌లు, ఇంటి చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలు బయటకు లాగి వెల్ల డించడం సంచలనానికి కారణమైంది. అలాగే పలు బ్యాంకుల్లోని ఆయన ఖాతాల నంబర్లు కూడా తెలిసి పోయాయి. బ్యాంక్ ఖాతాకు ఆయన ఆధార్‌ను అను సంధానం చేయలేదని ఓ సెక్యూరిటీ పరిశోధకుడు చెప్పగా, అది నిజం కాదని శర్మ జవాబిచ్చారు. ఆయన మొబైల్ నంబరు ఉపయోగించి ఆయన వాట్సాప్ ప్రొఫైల్ ఫొటో (నిజానికి ఈ ఫొటో ఆయన కూతురుది కావచ్చు)ను కూడా వెల్లడిం చారు. అంతేగాక, శర్మ ఐఫోన్ వాడుతున్నారని గుర్తిం చారు. ఇది చాలా ముఖ్య పరిణామం. ఆధార్ నంబర్‌తో బహిరంగంగా జరిగిన ఈ ప్రయోగం ప్రాధాన్యం మనకు అర్థం చేసుకోవడానికి ఆయన ఎంతటి కీలక వ్యక్తో తెలుసుకోవాలి. ఆధార్ నంబర్లు జారీ చేసే సంస్థ యూఐడీఏఐ స్థాపక సీఈఓగా శర్మ పనిచేశారు. ప్రస్తుతం ట్రాయ్ చైర్మన్ హోదాలో ఆయనకు ఈ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉంది. ఆధార్ నంబర్‌కు ఉన్న భద్రత, వ్యక్తిగత గోప నీయత అంశాలను కూడా ఆయన తరచూ అధ్య యనం చేయడమేగాక, ఆధార్ నంబర్ ఇతరులకు తెలిస్తే ప్రమాదం లేదంటూ భరోసా ఇచ్చేవారు. ఈ కారణాల వల్ల త్వరలో ఏర్పాటు చేసే భారత డేటా ప్రొటెక్షన్ అథారిటీ తొలి అధిపతిగా శర్మ నియమి తులౌతారని కూడా అనుకుంటున్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పెద్ద మనిషి ఆధార్ నంబర్ వెల్ల డించగానే ఎథికల్ హ్యాకర్లు పైన చెప్పినవే కాకుండా అనేక ఇతర వివరాలు తవ్వితీయడం చిన్న విషయ మేమీ కాదు.
ఆధార్ నంబర్ వెల్లడిస్తే ఎంతవరకు హాని జరుగుతుంది?
శర్మకు టెక్నాలజీ అవగాహన ఉంది కాబట్టి తన అకౌంట్లను ఎలా భద్రంగా కాపాడుకోవాలో తెలుసనే అనుకోవాలి. పెద్ద పదవిలో ఉన్న కారణంగా తన కేదైనా సమస్య వస్తే చట్టాలు అమలు చేసే సంస్థలు, బ్యాంకులు, మొబైల్ ఆపరేటర్లతో ఆయన సునాయా సంగా మాట్లాడగలరు. ఆయన ఆధార్ సంఖ్యను ఉపయోగించి తనకు హాని చేస్తే దేశంలో వార్తాపత్రి కలన్నీ ఆ విషయానికి ప్రాధాన్యం ఇచ్చి ప్రచురి స్తాయి. టెక్నాలజీ ఉపయోగించి ఆయన చేసే లావా దేవీలకు మరింత భద్రత లభిస్తుంది. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో హాని అంటే ఆయన ఏ అర్థంలో ఈ పదం వాడారో తెలియదు. తన ఖాతాల నుంచి తన అనుమతి లేకుండా డబ్బు బయటకు లాగడమే ఆయన దృష్టిలో హానికి అర్థం కావచ్చు. ఆయన ఆధార్ నంబర్ ఉపయోగించి అంతకన్నా ఎక్కువ హాని ఆయనకు చేశారు హ్యాకర్లు. మరో ముఖ్య విషయం ఏమంటే, ఆధార్ ద్వారా ఓ వ్యక్తి ఎవరితో మాట్లాడేది, సందేశాలు పంపుతున్నది వంటి సమాచారం తెలుసుకుని ఇంట్లో ఆ వ్యక్తి ఒంట రిగా ఉన్నాడనే విషయం తెలుసుకుని ఆ ఇంటిని దోచుకోవడానికి అవకాశం ఉంది. ఇదే ఓ మహిళ అయితే, ఆమె వెంట పడే వ్యక్తి ఆమె ఆధార్ సాయంతో ఆమె ఇంటికి చేరుకునే వీలు కూడా ఉంది. మన నగరాల్లో నివసించే, ప్రయాణించే స్త్రీల భద్రతకు ఇలాంటి ముప్పు ఉందనే విషయం శర్మ వంటి పెద్ద హోదాలో ఉన్న వ్యక్తికి తెలియకపోవచ్చు. ఆధార్ నంబర్ సంపాదించి ఓ మహిళ ఈమెయిల్ తెరిచి, వ్యక్తిగత సంభాషణల వివరాలను ఆగంత కులు సంపాదించే ప్రమాదం ఉంది. అదే వ్యాపారం విషయానికి వస్తే, నంబర్ తెలుసుకుని కంపెనీల ఈమెయిల్ ఖాతా ద్వారా వ్యాపార రహస్యాలు బయ టకు తీయడానికి ఆస్కారం ఉందంటున్నారు.
వ్యక్తిగత సమాచారం బయటకు లాగడానికి తొలి అస్త్రంగా ఆధార్?
ఆధార్ సంఖ్యను వెల్లడిస్తే ఆ వ్యక్తి సమాచారం మొత్తం బయటపెట్టడానికి ఇది అత్యంత ఉపయోగక రమైన పనిముట్టుగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఆర్‌ఎస్ శర్మ వ్యవహారం ఈ విషయం నిరూపించిందని చెబుతున్నారు. వాస్తవా నికి ఓ వ్యక్తి జీవిత విశేషాలు, వ్యక్తిగత వివరాలు సేకరించడానికి ఆధార్ నంబర్ అవసరం లేదు. ఎందుకంటే, శర్మ వంటి ప్రముఖ వ్యక్తి వివరాలను ఆయన పూర్వ, ప్రస్తుత పదవులకు సంబంధించి అందుబాటులో ఉండే సమాచారం నుంచి తెలుసు కోవచ్చు. అంటే, ఏ వ్యక్తి వివరాలనైనా సేకరించి ప్రొఫైల్ రూపొందించడానికి ఆధార్ అవసరం లేద నేది వీరి వాదన. కానీ, ఈ వాదనలో పస లేదని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. తమ వ్యక్తిగత కీలక సమాచారం బయటికి వెల్లడి కాకుండా ఉండేం దుకు ఈ సాంకేతికపరిజ్ఞానం వినియోగించే వ్యక్తులు అన్నిటికీ ఒకే ఈమెయిల్ అడ్రస్ వాడరు. విభిన్న కార్యకలాపాలకు భిన్న ఈమెయిల్ అడ్రస్‌లు వారు ఉపయోగిస్తుంటారు. అయినా, ఆధార్, మొబైల్ నంబర్ల ద్వారా వారి వ్యక్తిగత సమాచారం తెలుసుకో వడం ప్రస్తుతం సాధ్యమయ్యే పనేనని నిపుణులు అంటున్నారు. అందుకే ఇలాంటి సమాచారం బయ టకు లీకవకుండా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది.
ఆన్‌లైన్‌లో అంతా అందుబాటులోకి వస్తుంటే డేటా భద్రత మిథ్యేనా?
వ్యక్తులకు సంబంధించిన ఎంతో సమాచారం ఆన్ లైన్‌లో(ఇంటర్నెట్) దొరుకుతున్నప్పుడు వ్యక్తిగత వివరాల గోపనీయత మిథ్య అని కొందరు అభి ప్రాయపడుతున్నారు. వివిధ అవసరాలకు విభిన్న సంఖ్యలు, పాస్‌వర్డ్స్ వాడుతూ వ్యక్తిగత వివరాలు భద్రంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా, మన ఆరోగ్యానికి సంబంధించిన మెడి కల్ రిపోర్టులు, ఆరోగ్య పరీక్షల నివేదికలు ఇతరు లకు తెలియకుండా ఉంచుకుంటాం. ఇలాంటి వివరా లను తేలికగా బయటకు తీసి వెల్లడించడం అంత తేలిక కాదు. తరచూ ఓ వ్యక్తికి సంబంధించిన ఆధార్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ వంటి అనేక వివరాలను ఒకేసారి ఉపయోగించి ఇలాంటి సమాచారం తవ్వితీయడానికి వీలుందని చెబుతు న్నారు. శర్మ వ్యవహారంలో ఆయనకు హ్యాకర్లు ప్రస్తు తానికి హాని చేయగలమని నిరూపించలేదుగానీ భవిష్యత్తులో అది జరగదనే గ్యారంటీ ఏమీ లేదు. వారు శర్మకు సంబంధించి వెల్లడించిన సమాచారం శాశ్వతమైనది. అయితే, ఇప్పటికి బయటపెట్టిన ఆయన సమాచారంతో ఎప్పుడు ఆయనకు కీడు చేయగలరో ఇంకా స్పష్టం కాలేదు. ఒక వేళ మనం కోరుకుంటున్నట్టు ఆయనకు ఎలాంటి హాని జరగక పోతే, ఈ ప్రత్యేక సందర్భంలోనే ఇది కుదరలేదని చెప్పడం అంత సులువు కాదు. మనకు తెలియ కుండా వ్యక్తిగత వివరాలు ఇతరులు మన అకౌంట్ల నుంచి సంపాదిస్తే దాని వల్ల మనకు కీడు జరిగిందని నిరూపించడం సాధ్యం కాదు.
కీడు చేసినా చర్యలుండవని చెప్పినా....
తన ఆధార్ నంబర్‌తో తనకు హాని చేసినట్టు నిరూ పించినవారిపై చర్యలేమీ తీసుకోనని ఆర్‌ఎస్ శర్మ హామీ ఇచ్చినాగానీ టెక్నాలజీ డెవలపర్ కింగ్‌స్లీ జాన్ దాని పర్యవసానాలపై న్యాయ సలహా తీసుకు న్నారు. ఎందుకంటే, శర్మ ఉన్నత పదవిలో ఉండడం, జాన్ బాధ్యతగల నిపుణుడు కావడం వల్ల ఈ ప్రయో గం ఫలితంగా సమస్యలు ఉత్పన్నం కాలేదు. అలా గాక, ఎవరికైనా శర్మ ఆధార్ నంబరు తెలిసి ఉంటే హ్యాకింగ్ చేసి గుట్టుచప్పుడు కాకుండా వారు సమా చారం బయటకు లాగేవారు. ఆధార్ అందరికీ తెలి యడంతో ఇప్పుడు కూడా శర్మ అకౌంట్లపై హ్యాకర్ల దాడులకు అవకాశం లేకపోలేదు. ఇలా ఆధార్ నంబర్ బహిరంగంగా వెల్లడించడం ప్రమాద కరమే గాక, అత్యంత బాధ్యతారహితమైన చర్యగా పరిగ ణించవచ్చు. ఇది చట్టబద్ధమైనది కూడా కాదని చెప్ప వచ్చు. ట్రాయ్ చైర్మన్ తన ఆధార్ నంబర్ చెప్పి సవాలు విసరగానే అనేకమంది తమ నంబర్లు ఆన్ లైన్‌లో వెల్లడిస్తూ తమ గోపనీయ వివరాల గుట్టు విప్పవచ్చని చాలెంజ్ చేశారు. నిజానికి అలా చేయడం వారు ఇబ్బందుల్లో చిక్కుకోవడానికి ఆహ్వా నం పలకడమే అవుతుంది. ఉన్నత పదవిలో ఉన్న కారణంగా శర్మ వ్యక్తిగత సమాచారానికి అనేక రకాల ‘భద్రతా ఏర్పాట్లు’ ఉన్నాగాని ఆయన చేసిన పని సబబు కాదనిపిస్తోంది. అయితే, ఆయన చర్య వల్ల ఇతరులు తెలివి తక్కువగా తమ కీలక సమాచారాన్ని ఇతరులకు అందేలా ఆధార్ నంబర్లు వెల్లడిస్తున్నారు.
ఆధార్ నంబర్ కీలకమైన వ్యక్తిగత వివరంగా జస్టిస్ శ్రీకృష్ట కమిటీ పరిగణించింది. ఆధార్ నంబర్లు ప్రచురించడం చట్టవ్యతిరేకమని కూడా ఆధార్ చట్టం చెబుతోంది. ట్రాయ్ చైర్మన్ శర్మ తన ఆధార్ వెల్లడిం చడం ద్వారా చట్టవ్యతిరేక చర్యకు పాల్పడినట్టు పరి గణించే అవకాశం ఉంది. శర్మ మార్గంలో ఇతరులు పయనిస్తే, ఆయన చర్య చట్ట వ్యతిరేక కార్యకలాపా లను ప్రోత్సహించినట్టవు తుంది. ఈ వ్యవహారం మొత్తం పరిశీలిస్తే ట్రాయ్ చైర్మన్ మరింత బాధ్యతా యుతంగా వ్యవహరించాల్సిందనిపిస్తోంది. తన చర్యల పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆయన గుర్తించి అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తే బాగుం డేది. ఇతరులు తమ ఆధార్ నంబర్లు ప్రచురించడానికి శర్మ ప్రత్యక్షంగా బాధ్యులు కాకున్నా వారిలో ఎవరికి నష్టం జరిగినా ఆయన వల్లే ఇది జరిగిందనే చెడ్డపేరు వస్తుంది. తన ఆధార్ నంబర్‌ను ఆయుధంగా వాడు కుని ఆయన వ్యక్తిగత సమాచారం ఇంతగా వెల్లడించి నాగానీ, తన కేమీ జరగనట్టు దీనినంతా కొట్టిపారేస్తూ తనకు హాని జరిగినట్టు నిరూపించాలని శర్మ ఇంకా సవాల్ చేస్తున్నారు. కీలక వ్యక్తిగత వివరాలు బయ టకు వెల్లడి కావడాన్ని సాధారణ విషయంగా ఆయన చిత్రిస్తున్నారు. ఇది ఆయన చేయాల్సిన పని కాదు. ఆయన దూకుడు, సాహసం ప్రమాదకరమైనవి.
నిఖిల్ పహ్వా
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, డిజిటల్ హక్కుల కార్యకర్త
Published Wed, Aug 1 2018 12:39 AM | Last Updated on Wed, Aug 1 2018 12:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment