కరోనా నేపథ్యంలో బ్రేక్ పడిన సినిమా షూటింగులకు పంజాబ్ ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తామని ప్రకటించింది. బుధవారం జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలువురు నటులతో మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్ కారణంగా మూగబోయిన వెండితెరకు సరికొత్త రంగులు తీర్చే పనిలో దర్శకులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ప్రారంభించిన సినిమా షూటింగులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
(హీరోయిన్లపై కామెంట్స్ : సునిశిత్ అరెస్ట్ )
గత నెలలోనే షూటింగ్‌కి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. కేంద్రం లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చినా మొదటినుంచి సినిమారంగానికి మాత్రం ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. దీంతో లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి షూటింగులు నిలిచిపోయి చాలా మంది ఆర్థికంగా చితికిపోయారు. పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారికి కాస్త ఊరట లభించనట్లైంది. అయితే షూటింగుల్లో మాస్కులు, శానిటైజేషన్, థర్మల్ స్ర్కీనింగ్ వంటి నియమాలను కశ్చితంగా పాటించాల్సిందేనని ప్రకటించింది. (ఆ వార్తలో నిజం లేదు: అమితాబ్ బచ్చన్)
Comments
Please login to add a commentAdd a comment