Health Ministry Issues Guidelines For Monkeypox | Monkeypox Virus Symptoms And Treatment In Telugu - Sakshi
Sakshi News home page

భారత్‌లో మంకీపాక్స్‌.. కేంద్రం అలర్ట్‌.. ఈ లక్షణాలుంటే జాగ్రత్తపడాల్సిందే!

Published Fri, Jul 15 2022 3:23 PM | Last Updated on Fri, Jul 15 2022 3:44 PM

Monkeypox India: Health Ministry Issues Guidelines Symptoms Details - Sakshi

న్యూఢిల్లీ: చాపకింద నీరులా ప్రపంచం మొత్తం మంకీపాక్స్‌ వ్యాపిస్తోంది. తాజాగా భారత్‌లోనూ తొలి కేసు కేరళలో వెలుగు చూసింది. వైరస్‌ సోకిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేపట్టింది అక్కడి వైద్యశాఖ. ఈ క్రమంలో మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. 

అంతర్జాతీయ ప్రయాణికులు.. జ్వరం, జబ్బులున్న వాళ్లతో సన్నిహితంగా ఉండొద్దని మార్గదర్శకాల్లో పేర్కొంది కేంద్రం. అలాగే.. ఎలుకలు, ఉడుతలు, వన్యప్రాణులు, ఇతర జీవులకు దూరంగా ఉండాలని పేర్కొంది. అడవి జంతువుల మాంసం విషయంలో, ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తా ఉండాలి. అలాగే.. ఆఫ్రికా నుంచి దిగుమతి అయిన వణ్యప్రాణి సంబంధిత ప్రొడక్టులు.. లోషన్లు, క్రీమ్‌లు, పౌడర్లకు దూరంగా ఉండాలని పేర్కొంది.

ఇన్‌ఫెక్షన్‌ సోకిన వాళ్లు వాడినవి, ఇన్‌ఫెక్షన్‌ సోకిన జంతువులకు దూరంగా ఉండడం తప్పనిసరి.  జ్వరం, దద్దర్లు లాంటి మంకీపాక్స్‌ సంబంధిత లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలి.  ఐసోలేషన్‌కి వెళ్లిపోవాలి. 

మంకీపాక్స్‌ అంటే.. 
స్మాల్‌ పాక్స్‌ (మశూచి) తరహా ఇన్‌ఫెక్షన్‌ ఇది. మశూచితో పోల్చి చూస్తే తక్కువ తీవ్రత ఉంటుంది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి మంకీపాక్స్‌ ఇన్‌ఫెక్షన్‌ తొలుత వెలుగులోకి వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్‌ అని పేరు పెట్టారు. 1970ల్లో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్‌ వైరస్‌ జాడ కనిపించింది. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం మంకీపాక్స్‌ అనేది జంతువుల ద్వారా సంక్రమించే మంకీపాక్స్‌ వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌. జంతువుల ద్వారా మనుషులకు సోకుతుంది. మనునషుల నుంచి మనుషులకు కూడా సోకుతుంది. ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాలైన మధ్య, పశ్చిమ  ఆఫ్రికాలో మంకీపాక్స్‌ కేసులు వెలుగు చూసేవి. బయటి దేశాల్లో బయటపడడం చాలా అరుదైన అంశం. అలాంటిది ఇప్పుడు భారత్‌ సహా చాల దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. 

లక్షణాలివే..
జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ, గ్లాండ్స్‌లో వాపు వంటివి మొదట కనిపిస్తాయి. అయిదు రోజులకి మశూచి వ్యాధి మాదిరిగా శరీరమంతా బొబ్బలు వస్తాయి. ఇవి తగ్గడానికి కనీసం నాలుగు వారాలు పడుతుంది.  

ఎలా వ్యాపిస్తుంది?:
మంకీపాక్స్‌ అనేది క్లోజ్‌ కాంటాక్ట్‌ ద్వారా సోకుతుంది. దగ్గరగా ఉన్నా.. కలిసి ఉన్నా.. శారీరక సంబంధం కలిగా ఉన్నా.. సోకుతుంది. అలాగే ఇన్‌ఫెక్షన్‌ సోకిన జంతువులకు దగ్గరగా ఉన్నా కూడా సోకుతుంది.  తుంపర్ల ద్వారా, మంకీపాక్స్‌ బాధితులకు అతి సమీపంగా మెలిగినా వ్యాపిస్తుంది. రోగుల దుస్తులు ముట్టుకున్నా, వారితో కలిసి బెడ్‌పై పడుకున్నా, శారీరకంగా కలిసినా కూడా వ్యాపిస్తుంది.


  
చికిత్స ఎలా.. 
ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీవైరల్‌ డ్రగ్స్‌ వాడతారు. స్మాల్‌ పాక్స్‌ వ్యాక్సిన్‌ కూడా పని చేస్తుంది. మందులు వాడితే.. నాలుగైదు వారాల్లో దానంతట అదే తగ్గిపోతుంది. లేదంటే మరో మూడు వారాలు ఎక్కువ పట్టొచ్చు. ప్రతీ పది మందిలో ఒకరు మంకీపాక్స్‌తో చనిపోయే అవకాశాలు ఉన్నాయి. మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించిన వ్యక్తికి వీలైనంత దూరంగా ఉండడమే.. ఈ వైరస్‌ను అడ్డుకునే మార్గం.  

చదవండి: మంకీపాక్స్‌ సామాజిక వ్యాప్తి చెందొచ్చు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement