
సాక్షి, హైదారాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేసింది. ఇందులో భాగంగా వారి ఉద్యోగ భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కె.చంద్రశేఖర్ రావు గురువారం సంతకం చేశారు. విధి నిర్వహణలో ఆర్టీసీ ఉద్యోగులు అనేక సందర్భాల్లో అనవసర వేధింపులకు గురవుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ సర్కర్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఉద్యోగులు గతంలో చాలా సందర్భాల్లో సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీఎం కేసీఆర్ స్పందించి.. ఆర్టీసీ ఉద్యోగులు వేధింపులకు గురి కాకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు అధికారుల కమిటీ మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment