UPDATES
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగింపు.. ఇవాళే(ఆదివారం) ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోద ముద్ర పొందడంతో అసెంబ్లీ సమావేశాల పొడిగింపు నిర్ణయం ఉపసంహరణ. తొలుత రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని నిర్ణయించారు. కానీ ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదం పొందడంతో పొడిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. దాంతో తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న సభ్యులకు హృదయ పూర్వక అభినందనలు అంటూ స్పీకర్ పేర్కొన్నారు.
అసెంబ్లీలో తెలంగాణ ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదం
అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం
►1969 తెలంగాణ ఉద్యమంపై కాంగ్రెస్ కర్కశంగా వ్యవహరించింది
►భట్టి విక్రమార్క తన పాదయాత్రను రమ్మంగా వర్ణించారు
►మరో పర్యాయం పాదయాత్ర చేయాలని కోరుతున్నా
►పాదయాత్రలో ప్రజలు సమస్యలు చెప్పుకుంటారు
►అది సహజమైన పరిణామం
►తెలంగాణను ముంచిందే కాంగ్రెస్
తెలంగాణ ప్రజల మనసుల్ని తీవ్రంగా గాయపరిచింది కాంగ్రెసే
►బీజేపీ కూడా తెలంగాణను కించపరిచింది
► తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగింపు
►సీఎల్పీకి మంత్రి ప్రశాంత్ రెడ్డి
►నిన్న అసెంబ్లీలో అవమానం జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసంతృప్తి
►కేటీర్ వ్యాఖ్యలపై స్పీకర్‌కు ఫిర్యాదు
►స్పీకర్ ముందు నిరసన తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
►కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
► స్పీకర్‌తో ముగిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ
► సభను తప్పుదోవ పట్టించేలా అధికార పక్ష వ్యవహరిస్తోందని ఆరోపణ
► కేటీఆర్ సభలో అబద్దాలు మాట్లాడారు: సీఎల్పీ నేత భట్టి
► కట్టడి చేయాల్సిన స్పీకర్ కూడా పట్టించుకోవడం లేదు
►దీనిపై స్పీకర్ ముందు నిరసన చేస్తున్నాం.
►కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలి.
అసెంబ్లీలో ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కు నివాళులు
►తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అసెంబ్లీలోని హాల్‌లో ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఆర్టీసీ బిల్లుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందన
► ఆర్టీసీ బిల్లుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కుటుంబం కన్నుపడిందని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులపై ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలోని గవర్నర్ అయినా బిల్లు పాస్ చేయాలంటే లీగల్ ఒపీనియన్ తీసుకుంటారని తెలిపారు.
► బిల్లుకు ఆమోదం తెలుపాలి అంటే ఒకటి రెండు రోజుల సమయం పడుతుందని, అవసరమైతే అసెంబ్లీని రెండు రోజులు పొడిగించి ఆర్టీసీ బిల్లును ఆమోదించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ బిల్లు కోసం ప్రత్యేకంగా సెషన్ పెట్టాలని, దీనిని అడ్డం పెట్టుకొని బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని విమర్శించారు.
►తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాను ఉండకపోవచ్చని అన్నారు. తనను అసెంబ్లీలో ఉండొద్దని కొంతమంది కోరుకుంటున్నారని ఆరోపించారు. నా చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని, సభకు ఎవరు వస్తారో.. రారో తెలియదని అన్నారు.
►సభ నిర్వహాణ పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి సీతక్క వెళ్లిపోయారు.
►వరంగల్‌లో వరద నష్టంపై సమీక్ష చేశామని సభలో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలోనే రోడ్ల మరమ్మత్తులు పూర్తి చేస్తామని తెలిపారు. ధరణిలో చిన్న చిన్న సమస్యలున్నాయని వెంటనే వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో అన్ని నగరాల్లో డ్రగ్స్ సమస్య ఉందని, దీని నియంత్రణ కోసం పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.
►అసెంబ్లీలో జీరో అవర్ టైంలో ప్రజా సమస్యలు లేవనెత్తారు ఎమ్మెల్యేలు. ధూల్‌పేట సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. తాత్కాలిక ఉద్యోగుల సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు.
►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజైన ఆదివారం ప్రారంభమయ్యాయి.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రెండో శాసనసభ ఆఖరి విడత సమావేశాలు చివరి అంకానికి చేరుకున్నాయి. మూడు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు నేటితో (ఆదివారం తెరపడనుంది. బీఏసీ సమావేశంలో నిర్ణయించిన మేరకు ఆదివారం ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా ‘తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం’పై చర్చ జరుగుతుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చే అవకాశముంది. మరోవైపు ‘ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు’శాసనసభలో పెట్టే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆదివారం ఉదయంలోగా ఈ బిల్లుకు గవర్నర్ అనుమతి తెలిపితే సభ ముందుకు ఈ బిల్లు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.
ఐదు బిల్లులకు సభ ఆమోదం...
మూడో రోజు సమావేశాల్లో ప్రశ్నోత్తరాల అనంతరం ‘పల్లె ప్రగతి– పట్టణ ప్రగతి’పై జరిగిన లఘు చర్చకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. అనంతరం ఐదు బిల్లులను సంబంధిత శాఖల మంత్రులు ప్రతిపాదించారు. తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ బిల్లు–2023, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు–2023ను ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించగా ఫ్యాక్టరీల (తెలంగాణ సవరణ) బిల్లు– 2023ను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల కమిషన్ (సవరణ) బిల్లు–2023ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రతిపాదించారు.
తెలంగాణ పంచాయతీరాజ్ రెండో సవరణ బిల్లు 2023ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ప్రవేశపెట్టిన ఈ బిల్లులను సభ ఆమోదించినట్లు శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత సభను ఆదివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు. అంతకుముందు నిరుద్యోగ భృతి, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment