సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ మధ్య పలు అంశాలపై అంతరం నెలకొన్నప్పటికీ మంగళవారం వారిద్దరూ మాట్లాడుకుంటూ కనిపించడం సర్వత్రా ఆసక్తి రేపింది. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ విమానాశ్రయంలో తమిళిసై, సీఎం కేసీఆర్ మాట్లాడుకుంటూ కనిపించారు.
రాష్ట్రపతి ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ విమానం రాక కోసం ఎయిర్‌పోర్టులో వేచి ఉన్న సమయంలో తమిళిసై, కేసీఆర్ ఏదో అంశాన్ని చర్చిస్తున్నట్లు కనిపించింది. రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి సీఎం కంటే ముందే గవర్నర్ విమనాశ్రయానికి రావడం, ఆమె కూర్చున్న పక్కనే ఉన్న సోఫాలో సీఎం కూడా కూర్చొని మాట్లాడుకోవడం గమనార్హం.
కేంద్ర సాంస్కృతిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, క్షత్రియ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు ఉత్సవాలను మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. తెలుగులో ‘అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు’ అంటూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
చదవండి: Kishan Reddy: అందుకే కిషన్‌రెడ్డికి బీజేపీ బాధ్యతలు, ఈటలకు కీలక పదవి
President Droupadi Murmu arrived at Hakimpet Air Force Station in Hyderabad, warmly welcomed by @TelanganaCMO KCR, Governor @DrTamilisaiGuv, Union minister @kishanreddybjp and others.#Hyderabad #DroupadiMurmu #KCR pic.twitter.com/V7VRFeIU1Y
— Surya Reddy (@jsuryareddy) July 4, 2023
Comments
Please login to add a commentAdd a comment