కర్ర పట్టుకుని పరిగెత్తించి కొట్టిన కలెక్టర్‌.. కారణం తెలిస్తే షాక్‌! | Follow COVID Rules At All Places Of Worship, Says Gajapati District Collector | Sakshi
Sakshi News home page

కర్ర పట్టుకుని పరిగెత్తించి కొట్టిన కలెక్టర్‌.. కారణం తెలిస్తే షాక్‌!

Published Sun, Apr 18 2021 4:25 PM | Last Updated on Mon, Apr 19 2021 8:56 AM

Follow COVID Rules At All Places Of Worship, Says Gajapati District Collector - Sakshi

సాక్షి, పర్లాకిమిడి: రోజురోజుకు గజపతి జిల్లా కేంద్రం పర్లాకిమిడిలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్థానిక మహేంద్రతనయ వంతెన వద్ద ఆంధ్రా–ఒడిశా సరిహద్దును మూసివేశారు. స్వయంగా కలెక్టర్‌ అనుపమ కుమార్‌ సాహా, సబ్‌కలెక్టర్‌ సంగ్రాం కేసరి పండాలు శనివారం చేత కర్రలు పట్టుకుని కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిని, పాతపట్నం (ఆంధ్రప్రదేశ్‌) నుంచి జిల్లాలోకి వచ్చేవారిని తరిమికొట్టారు.

విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు సరిహద్దులో పాతపట్నం డిపోవద్ద నిలిపివేయడంతో  అనేకమంది ఒడిశాకు రావాలనుకున్న వారు కాలినడకన వచ్చి ఒడిశా అధికారులకు తమ కాగితాలను చూపించి పర్లాకిమిడి పట్టణానికి రావాల్సి వచ్చింది. మహిళలు లగేజీ మోయలేక, ఆటోలు లేక ఇబ్బందులు పడ్డారు. నాకాపాయింట్ల వద్ద విడిచిపెట్టకపోవడంతో ఉపాధి కూలీలు స్వస్థలాలకు రాలేక అవస్థలు పడ్డారు. జిల్లాలో రాత్రి కర్ఫ్యూ విధించారు. జిల్లాకు వచ్చే ఆంధ్రా సరిహద్దుల నాకాపాయింట్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement