
సాక్షి, ఢిల్లీ: కోవిడ్ మార్గదర్శకాల గడువును జనవరి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ కేసులు తగ్గుతున్నా.. కొత్త స్ట్రెయిన్ దృష్ట్యా గడువు పొడిగించింది. కంటైన్‌మెంట్ జోన్లలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. కాగా, భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కేసుల సంఖ్యలో రోజురోజు స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ వ్యాధి అదుపులో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణంకాలు తెలుపుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య కోటి రెండు లక్షలకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment