న్యూఢిల్లీ: ఇతర దేశాలతో రూపాయిలో వాణిజ్య లావాదేవీలను నిర్వహించేటప్పుడు ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల పరిష్కారం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) త్వరలో బ్యాంకులకు మార్గదర్శకాలను జారీ చేయనుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
రూపాయి ట్రేడింగ్ మెకానిజం విషయానికొస్తే, కొన్ని అంశాలకు సంబంధించి మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, అయితే వీటిలో చాలా వరకూ పరిష్కారమయ్యాయని తెలిపారు. పరిష్కారం కాని అంశాల్లో ఎలక్ట్రానిక్ బ్యాంక్ రియలైజేషన్ సర్టిఫికేట్ (ఈ–బీఆర్‌ఈ) ఒకటని తెలిపారు. ఈ సమస్య పరిష్కా రంపై ఆర్‌బీఐ ప్రస్తుతం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు.
కాగా, యూరో లేదా దిర్హామ్ లేదా యువాన్ లేదా డాలర్‌లో చెల్లింపు చేయడానికి ఎటువంటి అడ్డంకి లేదని కూడా అధికారి ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఇతర భాగస్వామ్య దేశాలతో రూపాయి వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment