Telangana Government Gruha Lakshmi Scheme Guidelines - Sakshi
Sakshi News home page

Gruha Lakshmi Scheme: ఇల్లు కట్టుకుంటే రూ.3 లక్షలు.. గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలు ఇవే..

Published Wed, Jun 21 2023 8:33 PM | Last Updated on Wed, Jun 21 2023 8:57 PM

Telangana Government Gruha Lakshmi Scheme Guidelines - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు రూ.3 లక్షల ఆర్ధిక సాయం ప్రభుత్వం అందించనుంది. గృహలక్ష్మీ పథకం మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల ఇండ్లు, మొత్తం 4 లక్షల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇండ్లు చొప్పున మొత్తం 4లక్షల ఇండ్లు నిర్మాణానికి 7,350 కోట్లు ఖర్చు చేయనుంది.

మహిళా పేరు మీదనే ఇల్లు మంజూరవుతుంది. లబ్దిదారులు తమకు ఇష్టమైన డిజైన్ ఎంపికకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. పథకం ద్వారా లబ్ది పొందిన ఇంటిపై ప్రభుత్వం ఆమోదించబడిన గృహలక్ష్మి లోగో ఉంటుంది.  సంబంధిత కుటుంబం ఆహార భద్రత  కార్డును కలిగి ఉండాలి. ప్రజలు, ప్రజా ప్రతినిధుల ద్వారా  దరఖాస్తులు జిల్లా కలెక్టర్లు స్వీకరించనున్నారు. లబ్ధి దారుల ఎంపికలో స్క్రూటినీ చేసి, లబ్ధి దారులను కలెక్టర్లు ఎంపిక చేయనున్నారు.

గృహలక్ష్మి పథకం కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌తో పాటు, మొబైల్ యాప్‌ను ప్రభుత్వం సిద్దం చేయనుంది. మూడు దశల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం నగదు పంపిణీ చేయనుంది. మొదటి దశలో బేస్మెంట్ లెవెల్ స్టేజ్ రూఫ్ తోపాటు పనులు పూర్తయిన తర్వాత మొత్తం అమౌంట్ అందజేయనుంది. తొలుతగా లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వనుంది.
చదవండి: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్‌ నవ్య ఎపిసోడ్‌లో కీలక ట్విస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement