మహిళలు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అత్యంత ముఖ్యంగా. అందులోనూ వ్యాయామం చేయని మహిళలు తినే ఆహారం విషయంలో పట్ల శ్రద్ద వహించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెబుతోంది. అలాంటి మహిళలు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదే ఐసీఎంఆర్ కొన్ని మార్గదర్శకాలు కూడా అందించింది. అవేంటో చూద్దామా..!
వ్యాయామం చేయని మహిళలు తినే ఫుడ్‌పై శ్రద్ధ పెట్టడం కీలకం. అతిగా తినకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. తక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లతో ఉండే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ నూనెతో కాల్చినవి, ఆవిరిపై ఉడికించినవి తీసుకోవాలిన చెబుతున్నారు.
అలాగే వాటి తోపాటు లీన్ ప్రోటీనఖ కూడా అవసరం. స్కిన్‌లెస్ చికెన్, చేపలు, అప్పడప్పుడూ రెడ్ మీట్ వంటివి తీసుకోవాలని సూచించారు. అదనప్పు కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులు,లేకుండా చేసుకోవాలి.
కూల్ డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి. హెర్బల్ టీలు వంటివి తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు చక్కెర పానీయాలకు దూరంగా ఉండటమే బెటర్
బరువు అదుపులో ఉంచుకునే యత్నం చేయాలి. ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా తృణధాన్యాలు, కాలానుగుణంగా పండ్లకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అనారోగ్యకరమైన చిరుతిండ్లకు దూరంగా ఉండటం మంచిది.
భోజనాని కంటే వివిధ రకాల పచ్చి కూరగాయలు తినడానికి యత్నం చేయాలి. మిల్లెట్స్ , బ్రౌన్‌రైస్‌కి ప్రాధాన్యత ఇవ్వాలి.
బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా బీన్స్, కాయధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన గింజలను(బాదం పప్పులు, జీడిపప్పులు)కు ప్రాధాన్యత ఇవ్వాలి.
ఏదైనా గానీ తీసుకునే ఆహారాన్ని మనస్పూర్తిగా ఆస్వాదిస్తూ తినాలి, సమతుల్యతకు ప్రాముఖ్యత ఇవ్వడం వంటివి చేస్తే.. మీ చేతుల్లోనే ఆరోగ్యం పదిలంగా ఐసీఎంఆర్ చెబుతోంది. వ్యాయామం చేయని మహిళలు ఈ విషయాలు గుర్తించుకుని మంచి డైట్ పాటిస్తే చాలని చెబుతోంది.
(చదవండి: తొలి పోస్టల్ సర్వీస్ నుంచి .. సరికొత్త ట్యూన్ వరకు ఎన్నో ఘటనలకు సాక్షి 'మే 31'!)
Comments
Please login to add a commentAdd a comment