సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సర్విస్ రెగ్యులరైజేషన్ కసరత్తులో భాగంగా వారి పనితీరు మదింపునకు జిల్లా స్థాయి పనితీరు మూల్యాంకన కమిటీ (డిస్ట్రిక్ట్ లెవల్ పెర్‌ఫార్మన్స్ ఎవాల్యూయేషన్ కమిటీ)లను రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటు చేసింది. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఎస్పీ లేదా ఎస్పీ నామినీగా డీఎస్పీ కంటే తక్కువ ర్యాంక్ కాని అధికారి, జిల్లా అటవీ అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
వివిధ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఈ కమిటీ జేపీఎస్‌ల పనితీరును మదింపు చేస్తుంది. ఈ మేర కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా శనివారం ఆదేశాలు జారీ చేశారు. నాలుగేళ్ల సర్విస్ పూర్తి చేసుకున్న జేపీఎస్‌లను రెగ్యులరైజ్ చేసే క్రమంలో ఈ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ మేరకు పలు మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మొత్తం 100 పాయింట్లతో మదింపు
♦ జిల్లా కమిటీకి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు.
♦ కమిటీ గ్రామ పంచాయతీలను సందర్శించి, ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్ల ఆధారంగా 4 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన జేపీఎస్‌ల పనితీరు అంచనా వేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తుంది.
♦ ఈ డేటాను, మదింపునకు సంబంధించిన స్కాన్డ్ కాపీలను పంచాయతీరాజ్ కమిషనర్ (పీఆర్) ఓ మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారు.
♦ జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు కమిటీలిచ్చే నివేదికలను పరిశీలించి జేపీఎస్‌ల సర్విసు రెగ్యులరైజైన్ ప్రతిపాదనలను పీఆర్ కమిషనర్‌కు సమర్పిస్తారు.
♦ ఈ నివేదికలపై పీఆర్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు.
♦ రోడ్లు, మురుగు కాల్వల శుభ్రత, దోమల నివారణ, వైకుంఠధామాల నిర్వహణ, నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, ప్రకృతి వనాలు, ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ..తదితర అంశాలకు వేర్వేరుగా పాయింట్లు ఇవ్వడం ద్వారా, మొత్తం వంద పాయింట్లుగా మదింపు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment