Panchayat Secretaries
-
గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు డీడీవో అధికారాలు
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ 1–4 కేటగిరీల పంచాయతీ కార్యదర్శుల తరహాలోనే గ్రామ పంచాయతీల బిల్లుల తయారీ తదితర అన్ని రకాల డీడీవో అధికారాలను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం పనిచేస్తున్న చోట ఆయా గ్రామ పంచాయతీ బాధ్యతల్లోనూ కీలకం కానున్నారు. ఈ ప్రతిపాదనల ఫైలుకు సీఎం జగన్ ఆమోదించారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుకు ముందుకు ఏపీలోని గ్రామ పంచాయతీల్లో గ్రేడ్ 1, 2, 3, 4 కేటగిరీ పంచాయతీ కార్యదర్శులు మాత్రమే పనిచేస్తుండేవారు. అప్పట్లో కొన్ని చోట్ల..మూడు నాలుగు పంచాయతీలకు కలిపి ఒకే పంచాయతీ కార్యదర్శి విధులు నిర్వహించేవారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు సమయంలో ప్రతి 2,000 జనాభాకు ఒక గ్రామ సచివాలయాలం చొప్పున ఏర్పాటు చేసి, గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం నియమించింది. వీరికి మిగిలిన 4 కేటగిరి పంచాయతీ కార్యదర్శుల తరహా జాబ్‌చార్ట్ నిర్థారణ జరిగినప్పటికీ..అప్పట్లో సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు కాలేదన్న కారణాలతో వీరికి డీడీవో అధికారాలను పూర్తిస్థాయిలో అప్పగించ లేదు. సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో గ్రేడ్ –5 పంచాయతీ కార్యదర్శులకు డీడీవో అధికారాలను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ పూర్తి విధివిధానాలతో త్వరలో ఉత్తర్వులు వెలువరించనుంది. 1. చాలా కాలంగా కోరుతున్న సమస్య గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు వారి జాబ్ చార్ట్ ప్రకారం చిన్న పంచాయతీల బాధ్యతలు అప్పగించాలని చాలా కాలంగా కోరుతున్నాం. మా విజ్ఞప్తిని మన్నించి వారికి న్యాయం చేసిన సీఎం జగన్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్‌కు కృతజ్ఞతలు. – కాకర్ల వెంకట రామిరెడ్డి, గౌరవాధ్యక్షుడు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం 2. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు డీడీవో బాధ్యతలు అప్పగించడం ద్వారా గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు న్యాయం చేసిన సీఎం జగన్‌కి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – బత్తుల అంకమ్మరావు, విప్పర్తి నిఖిల్ కష్ణ, డాక్టర్ బీఆర్ కిషోర్ (గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం) 3. ధన్యవాదాలు సీఎం సార్.. ఒకేసారి 1.34 లక్షల కొత్త సచివాలయాల ఉద్యోగాల నియమాకం చేపట్టడంతో పాటు.. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రతి సమస్యపై అత్యంత సానుకూలంగా స్పందిస్తున్న సీఎం జగన్‌కు ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాం. – ఎండీ జానిపాషా, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ -
జీవో ఆర్టీ ప్రామాణికమా లేక మెమోనా?
సాక్షి, హైదరాబాద్: సర్విసుల రెగ్యులరైజేషన్ ప్రక్రియపై జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్లో (జేపీఎస్) ఆందోళన వ్యక్తమౌతోంది. ఉద్యోగాలు క్రమబద్ధీకరించేందుకు ఐదేళ్ల కిందట అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన జీవో ఆర్టీ ప్రామాణికమా? లేక తాజాగా పీఆర్ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన మెమో ప్రామాణికమా? అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. జేపీఎస్‌ల పనితీరును మదింపు చేసి మూల్యాంకనం చేసేందుకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా తాజాగా జిల్లాస్థాయిలో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), జిల్లా ఎస్పీ, జిల్లా అటవీ అధికారులతో ఒక కమిటీని నియమిస్తూ మెమోను జారీచేశారు. వివిధ అంశాల ప్రాతిపదికన... ఆయా విధుల నిర్వహణకు అనుగుణంగా వందమార్కులు కేటాయించి, నాలుగేళ్ల సర్విసు పూర్తి చేసుకున్న జేపీఎస్‌ల పనితీరు మదింపు ఆధారంగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఉంటుందని స్పష్టంచేశారు. జీవో ఆర్టీలో ఏముంది? జిల్లా ఎంపిక కమిటీల ద్వారా జేపీఎస్‌ల డైరెక్ట్ రిక్రూట్మెంట్కు సంబంధించి 2018 ఆగస్టు 30న అప్పటి పీఆర్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్ జీవో ఆర్టీ నెంబర్ 617ను జారీచేశారు. ప్రభుత్వం జేపీఎస్‌ల పోస్టులను మంజూరు చేసినందున, మూడేళ్ల సర్విసు పూర్తిచేసుకున్నాక సంతృప్తికరమైన పనితీరు కనబరిచిన జేపీఎస్‌లను గ్రేడ్–4 పంచాయతీ సెక్రటరీలుగా రెగ్యులరైజ్ చేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. అయితే వీరి క్రమబద్ధికరణను పరిగణనలోకి తీసుకునేందుకు జేపీఎస్‌ల మూడేళ్ల సర్విసు కాలాన్ని నాలుగేళ్లకు పెంచుతూ గతేడాది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత మార్చినెలతో వారి నాలుగేళ్ల సర్విసు కూడా పూర్తయ్యింది. క్రమబద్ధికరణ ప్రక్రియ మాత్రం మొదలుకాలేదు. దీంతో జేపీఎస్‌లు నిరవధిక సమ్మెకు దిగి 16 రోజుల తర్వాత విర మించుకున్నారు. జేపీఎస్‌లు విధుల్లో చేరేందుకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నపుడే అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పలేదని, మెరుగైన పనితీరు ఆధారంగా నిపుణుల కమిటీ నివేదిక మేరకు జరుగుతుందని పంచాయతీరాజ్ శాఖ స్పష్టంచేసింది. కొన్నిరోజుల తరువాత జేపీఎస్‌ల సర్విసులను క్రమబద్ధిక రించే చర్యలు చేపడతామని అధికారులు ప్రకటించారు. సీఎస్ దృష్టికి... ఈ నేపథ్యంలో తాజాగా పీఆర్ ముఖ్యకార్యదర్శి జారీచేసిన మెమో నేపథ్యంలో జేపీఎస్‌ల విధులు, బాధ్యతల పట్ల ఏమాత్రం సంబంధం లేని జిల్లా ఎస్పీలు, జిల్లా అటవీ అధికారులతో మూల్యాంకనం చేయించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. వివిధ విభాగాల పీఆర్ ఉద్యోగులు, సంఘాలు సైతం ఈ పరిణామంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితుల గురించి త్వరలోనే సీఎస్ దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉద్యోగ సంఘాలున్నాయి. -
జేపీఎస్‌ల పనితీరు మదింపునకు కమిటీలు
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సర్విస్ రెగ్యులరైజేషన్ కసరత్తులో భాగంగా వారి పనితీరు మదింపునకు జిల్లా స్థాయి పనితీరు మూల్యాంకన కమిటీ (డిస్ట్రిక్ట్ లెవల్ పెర్ఫార్మన్స్ ఎవాల్యూయేషన్ కమిటీ)లను రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటు చేసింది. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఎస్పీ లేదా ఎస్పీ నామినీగా డీఎస్పీ కంటే తక్కువ ర్యాంక్ కాని అధికారి, జిల్లా అటవీ అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఈ కమిటీ జేపీఎస్‌ల పనితీరును మదింపు చేస్తుంది. ఈ మేర కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా శనివారం ఆదేశాలు జారీ చేశారు. నాలుగేళ్ల సర్విస్ పూర్తి చేసుకున్న జేపీఎస్‌లను రెగ్యులరైజ్ చేసే క్రమంలో ఈ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ మేరకు పలు మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం 100 పాయింట్లతో మదింపు ♦ జిల్లా కమిటీకి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. ♦ కమిటీ గ్రామ పంచాయతీలను సందర్శించి, ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్ల ఆధారంగా 4 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన జేపీఎస్‌ల పనితీరు అంచనా వేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తుంది. ♦ ఈ డేటాను, మదింపునకు సంబంధించిన స్కాన్డ్ కాపీలను పంచాయతీరాజ్ కమిషనర్ (పీఆర్) ఓ మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారు. ♦ జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు కమిటీలిచ్చే నివేదికలను పరిశీలించి జేపీఎస్‌ల సర్విసు రెగ్యులరైజైన్ ప్రతిపాదనలను పీఆర్ కమిషనర్‌కు సమర్పిస్తారు. ♦ ఈ నివేదికలపై పీఆర్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ♦ రోడ్లు, మురుగు కాల్వల శుభ్రత, దోమల నివారణ, వైకుంఠధామాల నిర్వహణ, నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, ప్రకృతి వనాలు, ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ..తదితర అంశాలకు వేర్వేరుగా పాయింట్లు ఇవ్వడం ద్వారా, మొత్తం వంద పాయింట్లుగా మదింపు చేస్తారు. -
సోని ఆత్మహత్య కలకలం.. ఊరుకో తాత.. నీ కుమార్తెను ఇక నేనే..
ఖానాపురం/ నర్సంపేట రూరల్: జిల్లాలోని ఖానా పురం మండలం రంగాపురం పంచాయతీ కార్యదర్శి బైరి(రంగు) సోని (31) ఆత్మహత్య జిల్లాలో కలకలం రేపింది. ఇటీవల జేపీఎస్‌లు చేపట్టిన సమ్మెలో ఆమె చురుగ్గా పాల్గొంది. తిరిగి ఈనెల 6న మళ్లీ విధుల్లో చేరింది. ఈ క్రమంలోనే శుక్రవారం రంగాపురం విధుల్లోకి వెళ్లిన సోని గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుందని జేపీఎస్‌లు, కుటుంబ సభ్యులు అంటుండగా, భర్త ప్రసాద్ వేధింపులతోనే చనిపోయిందని పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. రంగాపురంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సోని నర్సంపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందగా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు త్వరగా పిటిషన్‌ను తీసుకోవడంతోపాటు, పోస్టుమార్టం చేయించాలనుకోవడంపై ఆగ్రహిస్తూ పోస్టుమార్టం ఎదుట జూ నియర్ పంచాయతీ కార్యదర్శులు నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పోలీసులే దగ్గరుండి పిటిషన్ రాయించడాన్ని తప్పుబట్టారు. తల్లిదండ్రులను మభ్యపెట్టి పిటిషన్ రాయిస్తున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత మృతురాలి తండ్రి శ్రీనివాస్‌తో పోలీసులు పిటిషన్ తీసుకున్నారు. పిటిషన్లో భర్త వేధింపుల కారణం అని రాసినట్లు తెలుసుకుని జేపీఎస్‌లు ఆగ్రహించారు. ఈ క్రమంలో మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేయించి పోలీసులు ఇంటికి తరలించే ప్రయత్నం చేస్తుండడంతో జేపీఎస్‌లు అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం విధుల నుంచి తొలగిస్తుందనే సోని ఆత్మహత్య చేసుకుందని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని జేపీఎస్‌లు అడ్డుకున్న సందర్భంలో సోని తల్లిదండ్రులు మంజులశ్రీనివాస్ కూడా జేపీఎస్‌లతో కలిశారు. దీంతో పోస్టుమార్టం ఎదుట ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఈక్రమంలో డీసీపీ కరుణాకర్, ఏసీపీ సంపత్‌రావు, డీపీఓ కల్పన, ఆర్డీఓ శ్రీనివాసులు, సీఐలు సూర్యప్రకాశ్, హతిరాం, రాజు లు సోని తల్లిదండ్రులతో పాటు జేపీఎస్‌లకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ నిరసన కొనసాగించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జేపీఎస్ సోని మృతి చెందిందని, ఉన్నతాధికారులు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వేధింపులకు గురిచేయడంతోనే ఒక్కొక్కరుగా ఇబ్బందులు పడుతున్నారని టీపీఎస్ఎఫ్ హనుమకొండ అధ్యక్షుడు సురేష్, వికాస్, కృష్ణంరాజు, రాజు, మధు, వినోద్, అజయ్, అరవింద్ లు ఆరోపించారు కాంగ్రెస్, బీజేపీ సంఘీభావం.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోస్టుమార్టం వద్దకు చేరుకుని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ జేపీఎస్‌లకు సంఘీభావం తెలిపారు. మృతదేహాన్ని వెళ్లనీయకుండా అడ్డుపడ్డారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ తల్లిదండ్రులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఫోన్లో మాట్లాడించారు. తల్లిదండ్రులతో కలిసి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే పరామర్శ.. సోని మృతి విషయాన్ని తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని, మృతదేహం వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. విధుల్లో చేరకుంటే తొలగింపే.. వరంగల్ జిల్లా వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 223మంది విధులు నిర్వహిస్తున్నారు. 28నుంచి సమ్మెలోకి వెళ్లారు. ఈనెల 9న విధుల్లో చేరకుంటే టర్మినేట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కొంత మంది విధుల్లో చేరగా మరికొంత మంది సమ్మెలోనే కొనసాగారు. జేపీఎస్ సోని మృతితో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాలోని జేపీఎస్లందరూ శనివారం 11.30గంటలలోపు విధుల్లో చేరాలని వరంగల్ జిల్లా డీపీఓ కల్పన ఆదేశించినట్లు తెలిసింది. శనివారం లోపు విధుల్లో చేరకుంటే తొలగిస్తామని తెలపడంతో జేపీఎస్‌లు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. వీరిస్థానంలో గ్రామంలో జేపీఎస్ ఉద్యోగానికి పరీక్ష రాసిన వారిని విధుల్లోకి తీసుకోవాలని అధికారులకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించినట్లు తెలుస్తుంది. ఒకవేళ పరీక్ష రాసిన వారు లేకపోతే ఆదివారం లోపు ఆయా గ్రామాల్లో గ్రామసభలు పెట్టి పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేయాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. తాతా ఊరుకో.. నేనే నీ కుమార్తెను.. మార్చురీ గది వద్ద సోని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ క్రమంలో మృతురాలి తండ్రి శ్రీనివాస్ తన మనుమరాలు శ్లోకను పట్టుకుని బోరున విలపించాడు. తెలిసీ తెలియని పసి వయస్సులో ఉన్న శ్లోక ‘ఊరుకో తాత.. నీ కుమార్తెను ఇక నేనే.. నేను ఉన్న కదా ఏడవకు తాతా’అంటూ ఓదార్చిన సంఘటన చూపరులను కంటతడి పెట్టించింది. జేపీఎస్‌ల అరెస్ట్.. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కావాలనే డిమాండ్‌తో మృతదేహాన్ని రాత్రి పది గంటల వరకు అడ్డుకున్నారు. అధికారులు సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వినలేదు. ఈ క్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు తల్లిదండ్రులను పిలిచి కలెక్టర్ ప్రావీణ్యతో మాట్లాడించారు. తల్లికి అటెండర్ ఉద్యోగంతోపాటు కుమార్తెకు పీజీ వరకు ఉచిత విద్యకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని, ప్రభుత్వంనుంచి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. లిఖిత పూర్వకంగా హామీలు రాసిస్తేనే విరమిస్తామని జేపీఎస్‌లు పట్టుబట్టారు. దీంతో మూడు రోజుల తర్వాత కలెక్టర్ వద్దకు వచ్చి లిఖితపూర్వకంగా డిమాండ్లను రాసిస్తే పరిష్కరిస్తామని అధికారులు తెలిపినప్పటికీ వినలేదు. దీంతో పోలీసులు వారిని ప్రత్యేక బలగాలతో అరెస్టు చేయించి స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని అక్కడినుంచి పంపించారు. ఇదిలా ఉండగా.. సోని మృతదేహాన్ని తరలించే అంబులెన్స్ మొరాయించగా.. పోలీసులే దగ్గరుండి మరమ్మతుచేసి పంపించడం కొసమెరుపు. కాగా, భర్త ప్రసాద్ వేధింపులతోనే సోని ఆత్మహత్య చేసుకుందని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
పాపం సోనీ.. సమ్మె వీడి విధుల్లో చేరి పురుగుల మందు తాగి..
సాక్షి, వరంగల్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె ఉధృత రూపం దాల్చేలా కనిపిస్తోంది. తాజాగా.. జిల్లాకు చెందిన ఓ మహిళా జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఒకవైపు సమ్మె.. మరోవైపు ప్రభుత్వం ఎక్కడ ఉద్యోగం తీసేస్తుందో అనే బెంగతో అఘాయిత్యానికి పాల్పడింది. ఈ ఘటనతో జేపీఎస్‌లు ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు . జిల్లాలోని ఖానాపూర్ మండలం కొత్తూరు రంగాపురం గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శి బైరి సోనీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. సోని రెండు రోజుల కిందటే.. సమ్మె నుంచి బయటికి వచ్చి విధులకు హాజరైంది. ఈ నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిందామె. దీంతో నర్సంపేట ఆసుపత్రికి తరలించగా.. మార్గం మధ్యలోనే ఆమె కన్నుమూసింది. సోనీ వివాహిత. ఎనిమిదేళ్ల పాప కూడా ఉంది. మొత్తం పదకొండు రోజులపాటు సమ్మెలో పాల్గొన్న ఆమె.. హఠాత్తుగా విధుల్లో చేరింది. ఉద్యోగ భద్రత లేదని ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు కుటుంబ సభ్యులు. సొంత ఊరు నర్సపేటలో తన తల్లి ఇంటి వద్దే సొంతంగా సోని ఓ ఇల్లు కట్టుకుంది. అయితే ప్రభుత్వ హెచ్చరికతో ఉద్యోగం పోతే.. ఇంటి కోసం చేసిన హౌసింగ్ లోన్ ఈఎంఐ కి ఇబ్బంది ఏర్పడుతుందని ఆమె సమ్మెను వీడి వీధులకు హాజరైనట్లు సహచరులు చెబుతున్నారు. సోనీ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మరొకరు బలికాకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే జేపీఎస్ లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చెప్పుడు మాటలు వినొద్దు: తెలంగాణ సర్కార్ హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపు ఇచ్చింది. ‘‘మీ సమస్యలు పరిష్కరిస్తాం. ప్రభుత్వం మీ పట్ల సానుకూలత తో ఉంది. గ్రామ పంచాయతీలకు అవార్డులు రావటంలో కార్యదర్శుల కృషి ఎంతో ఉంది. కొంత మంది రెచ్చగొట్టడం వల్లే జేపీఎస్ లు సమ్మె చేస్తున్నారు. సమ్మె అనేది చివరి ఆస్త్రం.. కానీ తొందరపడి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు వెళ్ళారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులైనప్పటికీ రాష్ట్రపతి దగ్గర అవార్డులు తీసుకునే అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఏర్పాటు చేసిన పోస్టులే ఈ పంచాయతీ కార్యదర్శులు. అలాంటిది ప్రభుత్వంపై ఉద్యోగులు నమ్మకంతో ఉండాలి అని ఒక ప్రకటనలో జేపీఎస్‌లకు పిలుపు ఇచ్చింది. మరోవైపు జూనియర్ పంచాయతీ సెక్రటరీల సమ్మెపై అడిషనల్ కలెక్టర్లు డిస్టిక్ పంచాయతీరాజ్ ఆఫీసర్లతో సీఎస్ శాంతి కుమారి తెలంగాణ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరకపోవడంపై ప్రధానంగా ఈ సమావేశం జరగనుంది. -
సమ్మెలో జీపీఎస్‌లు.. ప్రభుత్వం ఆఫర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. తమను రెగ్యులర్ చేయాలంటూ జేపీఎస్‌లు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జీపీఎస్‌లు ఇప్పటికైనా విధుల్లో చేరాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం మరోసారి ఆఫర్ ఇచ్చింది. వారి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపింది. ఈ క్రమంలో వారిని వెంటనే విధుల్లో చేరాలని సూచించింది. జీపీఎస్‌ల పట్ల ప్రభుత్వం సానుకూలతతో ఉన్నట్టు స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీలకు అవార్డులు రావటంలో కార్యదర్శుల కృషి ఉంది. కొంత మంది తమ స్వలాభం కోసం వారిని రెచ్చగొట్టడం వల్ల జీపీఎస్‌లు సమ్మె చేస్తున్నారు. సమ్మె అనేది చివరి అస్త్రం. కానీ.. ముందు దశలోనే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు వెళ్ళారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులైనప్పటికీ రాష్ట్రపతి దగ్గర అవార్డులు తీసుకునే అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఏర్పాటు చేసిన పోస్టు.. పంచాయతీ కార్యదర్శులు. అలాంటిది ప్రభుత్వం పై ఉద్యోగులు నమ్మకంతో ఉండాలి అని సూచించింది. ఇక, అంతకుముందు కూడా జీపీఎస్‌లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా తెలిపారు. ఇది కూడా చదవండి: నా ప్రాణానికి ముప్పు.. మోదీ, అమిత్‌షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖలు -
తెలంగాణలో సమ్మె బాట పట్టిన పంచాయతీ సెక్రెటరీలు
-
300 మందికి పైగా ఔట్సోర్సింగ్ జేపీఎస్‌లకు ఉద్వాసన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 300 మందికి పైగా జూనియర్ పంచాయతీ సెక్రటరీలు (జేపీఎస్) ఉద్వాసనకు గురయ్యారు. ఇటీవల వివిధ జిల్లాల్లో జీవో 317 ద్వారా బదిలీ చేసిన, మెటర్నిటీ లీవ్, లాంగ్ స్టాండింగ్ లీవ్ నుంచి వచ్చిన రెగ్యులర్ పంచాయతీ సెక్రటరీలకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ఔట్ సోర్సింగ్ సెక్రటరీలను ఆయా జిల్లాల్లోని డీపీవో (జిల్లా పంచాయతీ అధికారి)లు అకస్మాత్తుగా తప్పించారు. టీఎస్పీఆర్ఈ పోటీ పరీక్ష ద్వారా ర్యాంకు సాధించినా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో జేపీఎస్‌లుగా నియమితులవడంతో ఈ పరిస్థితి తప్పలేదు. ఖాళీలను నింపేందుకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో.. 2021 ఏప్రిల్ 12న జేపీఎస్‌లుగా 9,355 మందికి పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. వీరిలో 1,200 మంది ఆయా పోస్టింగ్‌లకు అసలు రిపోర్ట్ చేయలేదు. విధుల్లో చేరిన 8,200 మందిలో గత మూడేళ్లలో వెయ్యి మందికి పైగా వివిధ కారణాలతో రాజీనామా చేయడమో లేదా బాధ్యతలను మధ్యలోనే వదిలేయడమో చేశారు. అయితే ప్రతి పంచాయతీకి ఓ సెక్రటరీని నియమించాలనే లక్ష్యంతో.. భర్తీ కానీ జేపీఎస్ పోస్టుల్లో ఆయా జిల్లాలు, మండలాల వారీగా గతంలో పోటీ పరీక్షలో ఉత్తీర్ణులైన తర్వాతి ర్యాంకుల వారీగా ఔట్ సోర్సింగ్ పద్ధతుల్లో నియామకాలు చేపట్టారు. వీరికి పీఎఫ్, ఈఎస్ఐ మినహాయించి ఒక్కో జిల్లాలో ఒక్కోలా రూ. 10 వేల నుంచి రూ. 13 వేల దాకా జీతం ఇస్తున్నారు. ఇవి కూడా ఏ నెలకు ఆ నెల అందట్లేదని విమర్శలున్నాయి. పరీక్ష రాసి ఎంపికైనా తిప్పలే! జాతీయ స్థాయిలో యూపీఎస్సీ తరహాలో డిగ్రీ కనీస అర్హతగా నెగెటివ్ మార్కింగ్ (మైనస్ మార్కులు) పద్ధతితో పోటీ పరీక్ష రాసి ఎంపికైనా తమకు కష్టాలు తప్పట్లేదని ఔట్ సోర్సింగ్ జేపీఎస్‌లు అంటున్నారు. ప్రస్తుతం ఖాళీగా చూపుతున్న 800 పంచాయతీ సెక్రటరీ పోస్టులను తాజాగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీకి నోటిఫై చేశారు. దీంతో కొత్త రిక్రూట్మెంట్ జరిగాక తమకూ ఉద్వాసన తప్పదేమోనని మిగతా జేపీఎస్‌లకు భయం పట్టుకుంది. -
జూనియర్ కార్యదర్శులను క్రమబద్ధీకరించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రొబేషన్ కాలాన్ని పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను వెంటనే క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్‌ను బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. పే స్కేల్ అమలుతోపాటు కచ్చితమైన పని గంటల నిర్ణయం, కనీస సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం ఈ మేరకు సీఎంకు సంజయ్ ఒక బహిరంగ లేఖ రాస్తూ పంచాయతీ కార్యదర్శులపై నిత్యం అధికార పార్టీ గూండాల దాడులు జరగడం బాధాకరమన్నారు. పంచాయతీ కార్యదర్శులపై ఉన్నతాధికారుల వేధింపులు నిత్యకృత్యంగా మారడం దారుణమన్నారు. వారిలో మనోధైర్యం నింపి ఉద్యోగ భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకమైనదన్నారు. -
‘జీతం మాత్రం చక్కగా తీసుకుంటారు.. చేతకాకపోతే వెళ్లిపోండి’ జేసీ ఫైర్
సాక్షి, అనంతపురం: ‘జీతం మాత్రం చక్కగా తీసుకుంటున్నారు...బాధ్యత మాత్రం విస్మరిస్తున్నా రు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన అదేశాలు అమలు చేయాల్సిన బాధ్యత లేదా..? పనిచేయడం చేతకాకపోతే ఇళ్లకు వెళ్లిపోండి.’ అని జాయింట్ కలెక్టర్ అట్టాడ సిరి చెన్నేకొత్తపల్లి, వెంకటాంపల్లి పంచాయతీ కార్యదర్శులు అరుణ్ పాండే, యల్లప్పలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మండలంలోని వెంకటాంపల్లి, చెన్నేకొత్తపల్లి, ఓబుళంపల్లి గ్రామాల్లోని సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వెంకటాంపల్లి, చెన్నేకొత్తపల్లి గ్రామాల్లోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సందర్శించారు. అవి మరీ అధ్వానంగా ఉండటంతో సంబంధిత పంచాయతీ కార్యదర్శుల కు మెమోలు జారీ చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. అనంతరం వెంకటాంపల్లి ప్రాథమిక పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. భోజనం సరిగా లేకపోవడంతో వెంటనే ఏజెన్సీ మార్చాలని ఎంఈఓ మల్లికార్జునకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచులు జయరామిరెడ్డి, చెన్నారెడ్డి పాల్గొన్నారు. అనంతరం జేసీ సిరి కనగానపల్లి మండలంలోని మామిళ్లపల్లిలో పర్యటించి జలకళ పథకం ద్వారా రైతుల పొలాల్లో వేసిన బోరుబావులను పరిశీలించారు. చదవండి: అందరికీ సంక్షేమ ఫలాలు.. ప్రొద్దుటూరు బహిరంగ సభలో సీఎం జగన్ అధికారులు అందజేసిన నివేదికలోని కొలతల ప్రకారం బోరుబావి ఉందా? లేదా ? తెలుసుకునేందుకు పరమేశ్వరరెడ్డి పొలంలోని బోరుబావి లోతును కొలిపించారు. అనంతరం అధికారులు, రైతులతో జేసీ మాట్లాడుతూ ‘వైఎస్సార్ జలకళ’ పథకం మెట్ట ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బోర్లు తవ్వడం, విద్యుత్ సరఫరా పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జేసీ వెంట ఏపీడీ పుల్లారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఉపాధిహామీ సిబ్బంది, రైతులు ఉన్నారు. చదవండి: ఎమ్మెల్యే మద్దాల గిరి కుమారుని వివాహానికి హాజరైన సీఎం జగన్ -
జేపీఎస్‌ల పారితోషికం, ఒప్పందం కాలం పెంపు..
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు (జేపీఎస్) సంబంధించి తీపి, చేదు కలగలిపిన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుతం జేపీఎస్‌లకు నెలకు ఇస్తున్న రూ.15 వేల కన్సాలిడేట్ పారితోషికాన్ని రూ. 28,719కు పెంచింది. అలాగే, గతంలో ప్రొబేషనరీ పీరియడ్‌లా పరిగణించే మూడేళ్ల ఒప్పంద కాలాన్ని నాలుగేళ్లకు పొడిగిస్తూ మరో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలు ఈ నెల 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు (ఎఫ్ఏసీ) ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2018 ఆగస్టు 31న 9,355 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలో ఎంపికైన జేపీఎస్‌లకు మూడేళ్ల ఒప్పంద కాలం ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇప్పుడు దీన్ని నాలుగేళ్లకు పొడిగించారు. మూకుమ్మడి రాజీనామాలకైనా సిద్ధం: జేపీఎస్ సంఘం జేపీఎస్‌ల పారితోషికం, ఒప్పంద కాలాన్ని పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో ను వెంటనే వెనక్కు తీసుకోవాలని జేపీఎస్‌ల సంఘం అధ్యక్షుడు వెంకట్ నిమ్మల గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సైదారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సైతం సిద్ధమ ని చెప్పారు. మంగళవారం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. కాగా, జేపీఎస్‌లకు వేతనం పెంపును స్వాగతించిన తెలంగాణ పంచాయతీ కార్యద ర్శుల సంఘం.. అగ్రిమెంట్ పీరియడ్‌ను నాలుగేళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిం చింది. ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పడం సబబు కాదని సంఘం నేతలు పి.మధుసూదన్ రెడ్డి, ఎ.రమేష్ చెప్పారు. దీనిపై పోరాటం చేస్తామన్నారు. -
పంచాయతీ కార్యదర్శికి సెలవిచ్చే అధికారం సర్పంచ్‌కే
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సెలవు మంజూరు చేసే అధికారం సర్పంచ్‌లదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులిచ్చింది. గ్రేడ్ 1నుంచి 5వరకు పంచాయతీ కార్యదర్శులకు క్యాజువల్ సెలవులను సర్పంచ్ మంజూరు చేస్తారు. సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్లకు క్యాజువల్ సెలవును సంబంధిత సచివాలయ వీఆర్వో ద్వారా మండల అధికారి మంజూరు చేస్తారు. పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు ప్రత్యేక సెలవులను, మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులను ఎంపీడీవోలిస్తారు. చదవండి: ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని -
అప్పుడే అర్థమైంది.. అసలు పరీక్ష ప్రారంభమైందని!
సాక్షి, ఘట్కేసర్ : వారంతా అర్ధాకలితో నిరుద్యోగ బాధను దిగమింగుకున్నారు. రాత్రింబవళ్లూ శ్రమించి చదువుకున్నారు. పేదరికం విలువ తెలుసుకొని పోటీ పరీక్షలకు సమయత్తమై విజేతలుగా నిలిచి పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగం సాధించారు. కటిక పేదరికాన్ని అనుభవించి ఉద్యోగం రావడంతో ఉప్పొంగిపోయారు. ఇన్నాళ్లు కష్టపడి చదివించిన తల్లితండ్రుల జీవితాల్లో వెలుగులు నింపుదామని అనుకున్నారు. ఏడాది పాటు ఉత్సాహంగా విధులు నిర్వహించారు. ఆ తర్వాతే తెలుసుకున్నారు జీవితంలో అసలు పరీక్ష ప్రారంభమైందని. పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగమిచ్చినా.. సర్కారు శిక్షణ ఇవ్వకుండానే ఉద్యోగ బాధ్యతలు అప్పగించడంతో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. పని భారం పెరగడం, ప్రజా ప్రతినిధులు, అధికారుల ఒత్తిడిని భరించలేకపోయారు. అప్పటి వరకు పేదరికాన్ని చవిచూసిన ఆ ఉద్యోగులు కుటుంబానికి అన్నం పెట్టే ఉద్యోగానికే రాజీనామ చేశారు. 2019 సంవత్సరంలో జిల్లాలో 20 మంది జూనియర్ కార్యదర్శలుగా ఉద్యోగంలో చేరగా 9 మంది రాజీనామా చేశారు. చదవండి: కూకట్‌పల్లిలో బయటపడ్డ ఫేక్ డాక్టర్ మోసం! కనుబొమ్మలు తీసివేసి.. కోట్లలో మోసాలు ఒత్తిడి భరించలేక... నియామక సమయంలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో శిక్షణ లేకుండానే ఉద్యోగంలో చేరారు. అనంతరం పల్లెప్రగతి కార్యక్రమం వారికి దిమ్మదిరిగేలా చేసింది. ఇంటి అనుమతులు, పన్నుల వసూళ్లతో పాటు ఉపాధి హామీ పనులు, హరితహారం, పల్లె ప్రగతి, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు షెడ్ల పనులు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కార్పొరేట్ స్కూల్లో చదవడంతో గ్రామ కంఠం భూమి అంటేనే వారికి తెలియదు. అలాంటిది సర్పంచ్, ఉప సర్పంచులకు మధ్యన పొసగక పోవడం, ఓడిన, గెలిచిన వారు రెండు వర్గాలుగా చీలి అభివృద్ధి పనులు ఆపడం, కొత్తగా వచ్చిన జూనియర్ కార్యదర్శులకు మేజర్ పంచాయతీలు అప్పగించడం, డీపీఓ ఆఫీస్ నుంచి ఉదయం 8 గంటలకే వీడియో కాల్ రావడం తల నొప్పిగా మారింది. ఉదయం ఇంటి నుంచి బయలు దేరిన వాళ్లు తిరిగి ఇంటికి ఎప్పుడు చేరుతారో తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ప్రజాప్రతినిధుల ఒత్తిడి పెరగడం, నిధులు లేకున్నా పనులు చేయాలని మెడమీద కత్తిపెట్టడం, లేదంటే షోకాజ్ నోటీసులివ్వడం వారిని మరింత కుంగదీసింది. ఎగ్జిక్యూటివ్ పదవి కార్యదర్శి ఉద్యోగం వదిలి చిన్న స్థాయి ఉద్యోగంలో చేరిపోయారు. ప్రభుత్వం ఇలాంటి అంశాలపై దృష్టిసారించి ప్రస్తుతం అమలు చేస్తున్న అవుట్ సోర్సింగ్ విధానాన్ని రదు చేసి నోటిఫికేషన్ ద్వారా జూనియర్ కార్యదర్శుల నియామకాలను నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. సవాలక్ష ఆంక్షలతో ఎలా... ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలు విధిస్తూ నిరుద్యోగులను మోసం చేస్తోంది. జూనియర్ కార్యదర్శులుగా అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి నోటిఫికేషన్ ద్వారా నియామకాలను చేపట్టాలి. – బద్దం మిత్రారెడ్డి, నిరుద్యోగి, ఘనాపూర్ -
తొలివేతనం అందేదెన్నడో..!
సాక్షి, ఎల్లారెడ్డి (కామారెడ్డి): ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని సంబురపడుతున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులకు విధుల్లో చేరి మూడు నెలలు కావస్తున్నప్పటికీ ఇంత వరకు మొదటి నెల జీతం రాలేదు. మూడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం వారికి వేతనాలు విడుదల చేయడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో.. కామారెడ్డి జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో పాత గ్రామ పంచాయతీ కార్యదర్శులు 84 మంది విధులను నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో 436 గ్రామ పంచాయతీ కార్యదర్శులకు గాను 396 మంది ఎంపిక కాగా, వీరిలో 353 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు విధులలో చేరారు. వీరికి గత ఏప్రిల్ నెల 11న నియామకపు ఉత్తర్వులు ఇవ్వడంతో వారు ఏప్రిల్ 12న విధులలో చేరారు. ఈనెల 12తో వీరు విధుల్లో చేరి మూడు నెలలు పూర్తి కానుంది. మొదటి నెల వేతనం ఎప్పుడు వస్తుందో అది తీసుకుని తల్లితండ్రులకు మంచి బహుమతిని ఇవ్వాలనుకుంటున్న వారికి నిరాశ ఎదురవుతోందని నూతనంగా విధుల్లో చేరిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు. వేతనాలు రాక అవస్థలు విధుల్లో చేరి మూడు నెలలు కావస్తున్నప్పటికీ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు వేతనాలు అందని కారణంగా అప్పులు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్నేహితుల వద్ద అప్పులు తీసుకుని గడపాల్సిన పరిస్థితి ఎదురవుతోందని వాపోతున్నారు. ప్రతి రోజు విధులకు 10 నుంచి 20 కిలో మీటర్ల వరకు గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వెళ్లాలంటే పెట్రోల్‌తో పాటు ఇతర ఖర్చులకు డబ్బులు ఇబ్బందిగా మారిందని అంటున్నారు. ప్రభుత్వం ఇకనైనా తమ వేతనాలను వెంటనే విడుదల చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు. వారం రోజుల్లో అందిస్తాం నూతనంగా విధులలో చేరిన గ్రామ పంచాయతీ కార్యదర్శుల వేతనాలను వారం రోజుల్లో అందిస్తాం. వీరికి సంబంధించిన అకౌంట్ల వివరాలను ట్రెజరీ కార్యాలయానికి పంపుతున్నాం. వేతనాలు త్వరగా అందేలా చూస్తాం. – చిన్నారెడ్డి, ఎంపీడీవో, ఎల్లారెడ్డి స్నేహితుల దగ్గర అప్పులు చేస్తున్నా.. విధుల్లో చేరి మరో వారం రోజులు గడిస్తే మూడు నెలలు కావస్తుంది. కానీ ఇంత వరకు మొదటి నెల జీతం రాలేదు. దీంతో డబ్బుల కోసం స్నేహితుల వద్ద అప్పులు చేయాల్సి వస్తుంది. – చరణ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి వేతనాలు వెంటనే ఇవ్వాలి ప్రభుత్వం తమకు సంబంధించిన వేతనాలను వెంటనే అందించాలి. డబ్బులు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాం. రోజువారి ఖర్చులకు కూడా డబ్బులు లేక తిప్పలు పడాల్సి వస్తోంది. – సిద్ధు, గ్రామ పంచాయతీ కార్యదర్శి -
పంచాయతీకి చేరిన పెళ్లి..!
సాక్షి, వైరా: గ్రామాల్లోనే పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే నూతన విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌తో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు త్వరితగతిన అందే అవకాశం ఉంటుంది. గ్రామ కార్యదర్శులకు వివాహం రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని ఇస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. నేటి నుంచే అమల్లోకి.. కాగా ఈ విధానం నేటి నుంచి అమలులోకి రానుంది. పంచాయతీ కార్యదర్శులతో పాటు మండలంలోని ఈఓపీఆర్డీలు ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నారు. పెళ్లి రిజిష్ట్రేషన్‌కు నామమాత్రపు రుసుము చెల్లించాలి. రెండు నెలల గడువు దాటితే రూ.100 చెల్లించి గ్రామ పంచాయతీల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆపై గడువుదాటితే రిజిష్ట్రేషన్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా ఆర్థికసాయం పొందేందుకు ఈ రిజిస్ట్రేషన్ తప్పని సరి. పంచాయతీల్లో నమోదు చేసుకోవాలి గ్రామాల్లో జరుగుతున్న వివాహాలను ఇక నుంచి తప్పని సరిగా గ్రామ పంచాయతీలో నమోదు చేసుకోవాలి. దీంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథక ఫలాలను త్వరిత గతిన పొందే అవకాశం ఉంది. – శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, ఖమ్మం -
కార్యదర్శుల పోస్టుల భర్తీపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్) పోస్టుల భర్తీ విషయంలో హైకోర్టు సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల కటాఫ్ మార్కులను రాష్ట్ర స్థాయి, రిజర్వేషన్ కేటగిరీ, స్థానిక కేటగిరీల వారీగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హాల్‌టికెట్ వారీగా అభ్యర్థులు సాధించిన మార్కులను వెబ్సైట్లో ఉంచాలంది. ఈ ఆదేశాల మేరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని తెలిపింది. చట్ట విరుద్ధంగా రిజర్వేషన్లు కల్పించారన్న ఆరోపణలపై స్పష్టతివ్వాలని ఆదేశించింది. క్రీడల కోటాలో భర్తీ చేసే పోస్టుల విషయంలో అభ్యర్థుల మెరిట్ జాబి తాను తయారు చేశారో లేదో చెప్పాలంటూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్.రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. జేపీఎస్ పోస్టుల భర్తీ, నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అధికారులు చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఈ మొత్తం వ్యవహారంలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేయాలని కోరుతూ ఖమ్మం జిల్లాకు చెందిన బి.హరీశ్‌కుమార్, మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు జేపీఎస్‌లకు ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సోమవా రం ఈ వ్యాజ్యంపై మరోసారి విచారణ జరి గింది. రాష్ట్ర స్థాయి, రిజర్వు కేటగిరీ, స్థానిక కేటగిరీల వారీగా మెరిట్ జాబితాను ప్రచురించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. చట్ట నిబంధనలకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా రిజర్వేషన్లు 50% మించాయని, జనరల్ అభ్యర్థులకు 45%, రిజ ర్వుడు అభ్యర్థులకు 55% రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి దీనిపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు. అభ్యర్థుల కటాఫ్ మార్కులను రాష్ట్ర స్థాయి, రిజర్వ్ కేటగిరీ, స్థానిక కేటగిరిల వారీగా ప్రకటించాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలంటే మార్కులనూ వెబ్సైట్లో ప్రచురించాలని తేల్చి చెప్పారు. ఇదిలాఉంటే జేపీఎస్ పోస్టుల భర్తీలో క్రీడల కోటాను పరిగణనలోకి తీసుకోలేదంటూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు విచారణ జరిపారు. క్రీడల కోటా కింద మెరిట్ ప్రకారం అభ్యర్థుల జాబితాను తయారు చేశారో లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. -
పంచాయతీ కార్యదర్శులకు కొత్త బాధ్యతలు
సాక్షి, ఆలేరు : గ్రామపంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం నూతనంగా మరో 30 విధులను అప్పగించింది. గతంలో వీరు 64బాధ్యతలను నిర్వహించేవారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 401 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 2018–పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కార్యదర్శి గ్రామంలో పాలన బాధ్యతలను చూసుకోవటంతో పాటు సర్పంచ్‌కు సబార్డినేట్‌గా వ్యవహరించాలని సూచించింది. పంచాయతీలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, నిర్వహణ, త్రాగునీరు, వీధిదీపాలు, రోడ్లు, డ్రైనేజీ, మొక్కలు నాటడం, పారిశుద్య కార్యక్రమాలు అమలు చేయాలని కోరింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 42, సెక్షన్ 286 ప్రకారం, సెక్షన్ 43 ప్రకారం అప్పగించిన అన్ని బాధ్యతలు వి«ధులు నిర్వర్తించాలని తెలిపింది. సెక్షన్ – 6 (8)లో ప్రకారం పంచాయతీ ఎజెండా రూపకల్పన బాధ్యత కార్యదర్శిదేనని పేర్కొంది. గ్రామ పాలకవర్గం ఆమోదంతో వీటిని అమలు చేయాలని సూచించింది. 24గంటల్లో అనుమతి భవన నిర్మాణాలకు 24గంటల్లోనే అనుమతినివ్వాలని సూచించింది. అంతే కాకుండా లేఔట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 7రోజుల్లో అనుమతినివ్వాలని ఆదేశించింది. అలాగే లేఔట్ల అనుమతిలో పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రతీ లేఔట్లో 15శాతం భూభాగాన్ని తనఖా చేయాలని కోరింది. అలాగే గ్రామంలో తీసుకునే నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు పై ఎప్పటికప్పుడు గ్రామ ప్రజలకు సమాచారం అందించాలని సూచించింది. జనన, మరణాలతో పాటు వివాహ రిజిస్టేషన్ల నిర్వహణ చేయాల్సి ఉంటుంది. మార్గదర్శకాలు ఇవే.. పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వానికి సబార్డినేట్‌గా వ్యవహరించాలి. గ్రామ సభకు ఎజెండా తయారు చేసి అందులోని అంశాలు సభ్యులందరికి తెలిసేలా ప్రచారం చేయాలి. ప్రతీ 3నెలలకు ఒకసారి ఖర్చు లెక్కలను పంచాయతీ ఆమోదానికి సమర్పించాలి. వరదలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు, రోడ్లు, రైలు ప్రమాదాలు సం¿¶ వించినప్పుడు సహాయ చర్యల్లో పాల్గొనాలి. గ్రామంలో వ్యాధులు ప్రబలినప్పుడు అధికారులకు తెలియపరచాలి. గ్రామాల్లోని అవసరాలను గుర్తించి గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారిలో పాలుపంచుకోవాలి. అలాగే ఎంపీపీ, ఎంపీడీఓ, ఈఓ (పీఆర్ ఆర్డీ) నిర్వహించే నెలవారీ సమావేశాలకు హాజరు కావాలి. గ్రామసభలో లబ్ధిదారుల గుర్తింపు, వారికి రుణ పంపిణీ, రుణాలు వసూలుకు సహకరించాలి. అంశాల వారీగా ఎజాండాలను సిద్ధం చేసి, గ్రామపంచాయతీ ఆమోదం పొందడం. ఎజెండాను ప్రదర్శించడం, దండోర వేయించడం, గ్రామాల్లోని పలు ప్రాంతాల్లో నోటీసులను అంటించి ప్రజలకు సమాచారం చేరేలా చూడడం. బలహీన వర్గాలు, ఎస్టీ, ఎస్సీ వాడల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలు, పంచాయతీ తీసుకుంటున్న ఫలాలు అందేలా చూడడం. వార్షిక పరిపాలన నివేధికను రూపొందించి గ్రామపంచాయతీ ఆమోదం తీసుకోవడం. నెలవారీ సమీక్షలు, ప్రగతి నివేదికల రూపకల్పన, ఉన్నతాధికారులకు నివేదికను అందించడం, సర్పంచ్‌తో కలిసి అభివృద్ధి పనులకు పర్యవేక్షణ ప్రతీ త్రైమాసికంలో ఒకసారి పంచాయతీ ఆర్థిక వ్యవహారాలను ఆధాయ, వ్యయ వివరాలను పంచాయతీ ఆమోదించడంతో పాటు ఈవీపీఆర్డీలకు సమాచారం ఇవ్వడం. -
వేధింపులు ఇక ఆపండి
గుంటూరు వెస్ట్: ఎంత పనిచేసినా తమను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఏపీ పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.డి.ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా పంచాయతీ కార్యాలయానికి దాదాపు 300 మంది పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులు పాల్గొని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ పన్నుల వసూళ్లు గంటల్లోనూ, రోజుల్లోనూ వసూలు చేయాలని లేకపోతే సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. హక్కులు మాత్రం అధికారులకు, బాధ్యతలు మాత్రం తమకు అనే పద్ధతిలో వ్యవస్థ నడుస్తుందని వాపోయారు. 6 నుంచి 18 ఏళ్లకు చెందిన ఇంక్రిమెంట్ల ఫైళ్లు అధికారులు తొక్కి పెడుతున్నారన్నారు. మెడికల్ బిల్స్ పెండింగ్‌ను క్లియర్ చేయడంలేదన్నారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీ కార్యదర్శిని రెండు మూడు గ్రామాలకు ఇంచార్జ్‌లుగా నియమించడంవల్ల పనిభారం అధికమైపోతుందన్నారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్ జె.అ రుణతో సమస్యలపై చర్చించారు. ఆమె స్పందిస్తూ వీలైనంత వరకు మార్చి 15 నాటికి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఏపీ పంచాయతీ కార్యదర్శులు సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జాన్‌పీరా, ప్రధాన కార్యదర్శి జి.ఎస్.సి.బోస్, కోశాధికారి కె.సాంబ శివరావు ఎ.పి.గ్రామ పంచాయితీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మందపాటి వెంకటరెడ్డి, ప్రధాన కార్యద ర్శి పి.నాగరా జు, కోశాధికారి వెంకటాద్రి పాల్గొన్నారు. -
ఇలాగేనా.. అక్రమాలను అరికట్టలేరా..
అక్రమ లేఅవుట్లపై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కన్నెర్ర జేసింది. అక్రమార్కులకు ముకుతాడు వేయడంలో పంచాయతీ కార్యదర్శులు నిర్లిప్త వైఖరి అవలంభిస్తున్నారని ఆక్షేపించింది. అనధికార లేఅవుట్లలో అనుమతులు మంజూరు చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తప్పుబట్టింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారికి లేఖ రాసింది. దీంతో తేరుకున్న జిల్లా యంత్రాంగం.. అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని కార్యదర్శులను హెచ్చరించింది. అక్రమ లేఅవుట్ల ఏర్పాటును ప్రోత్సాహించినా.. అనధికార బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చినా ఊరుకునేదిలేదని స్పష్టం చేసింది. ఎక్కడైనా ఇలాంటి లేఅవుట్లు వెలుస్తున్నట్లు తెలిస్తే తక్షణమే హెచ్ఎండీఏ దృష్టికి తేవాలని సూచించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్, ఘట్కేసర్ గ్రామ పంచాయతీల్లో జరిగిన అవకతవకలను ఎత్తిచూపిన హెచ్ఎండీఏ.. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సహించేదిలేదని తేల్చిచెప్పింది. మాజీ సర్పంచ్‌లు పాత తేదీలతో అనుమతులు ఇస్తున్నారని.. కొందరు కార్యదర్శులు బిల్డింగ్ పర్మిషన్ల దరఖాస్తులను వేర్వేరు రిజిష్టర్లలో నమోదు చేస్తూ తెరచాటు వ్యవహారాలు నెరుపుతున్నట్టు నిగ్గు తేల్చింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారని హెచ్ఎండీఏ గుర్తించింది. లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా చోద్యం చూస్తున్న కార్యదర్శులు.. వెంచర్లు వెలవకముందే నిర్మాణ అనుమతులు ఇచ్చినట్లు రికార్డులు సృష్టించినట్లు విచారణలో తేలింది. చట్టవిరుద్ధ లేఅవుట్లు, అనధికార నిర్మాణాలను నివారించడానికి సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కోరింది. బిల్డర్/డెవలపర్ చేసే అక్రమ కట్టడాలను గుర్తించి తక్షణమే సదరు సంస్థలు/వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని సూచించింది. అంతేగాకుండా అనధికార నిర్మాణాలను కూల్చివేసే సమయంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా మొత్తం తంతును రికార్డింగ్ చేయాలని జిల్లా యంత్రాంగానికి రాసిన లేఖలో కోరింది. కాగా, తమ పరిధిలోని కార్యదర్శుల వ్యవహారశైలిపై పెదవివిరిచిన హెచ్ఎండీఏ.. అక్రమాలపై మేల్కొనకపోతే ప్రభుత్వం రాబడి కోల్పోవడమేగాకుండా కనీస సౌకర్యాల కల్పన కష్టమని స్పష్టం చేసింది. ఇదేం కిరికిరి.. అక్రమ లేఅవుట్లపై జిల్లా యంత్రాంగం ద్వంద్వ విధానాన్ని అవలంభిస్తోంది. చట్ట విరుద్ధంగా వెలిసిన లేఅవుట్లపై కొరడా ఝళిపించమని ఒకవైపు చెబుతూ.. మరోవైపు వాటిలో పది శాతం స్థలాన్ని గిఫ్ట్‌డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకోమనడం విడ్డూరంగా ఉంది. ఇది పంచాయతీ కార్యదర్శులకు తలనొప్పిగా తయారైంది. స్థల స్వాధీనంతో లేఅవుట్‌కు ఒక విధంగా మనమే చట్టబద్ధత కల్పించి.. మరోవైపు ఆ లేఅవుట్లో బిల్డింగ్ అనుమతులు నిరాకరించడం ఎంతవరకు సబబనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అంశంపై డెవలపర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే లేనిపోని సమస్యలు కొనితెచ్చుకోవాల్సిందేనని కొందరు కార్యదర్శులు అంటున్నారు. -
గ్రామాల్లో నివాసం లేకుంటే జీతం కట్
ఏలూరు సిటీ : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు అదే గ్రామాల్లో నివాసం లేకుంటే జీతాలు నిలుపుదల చేస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శి పనిచేసే వివరాల సమాచార బోర్డుల ఏర్పాటుపై శుక్రవారం సమీక్షించారు. నల్లజర్ల మండలంలో పలువురు కార్యదర్శులు పనిచేసే గ్రామంలో కాకుండా ఏలూరులో కాపురం ఉంటున్నారని ఈవోఆర్డీ చిన్నారావు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ కార్యదర్శులు రోజువారీ డ్యూటీ వివరాలు, ఫోన్ నంబర్, నివాసం ఎక్కడ ఉంటున్నారో వివరాలను తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని గతంలో ఆదేశించానని, మెజారిటీ పంచాయతీల్లో అమలు కావడం లేదని కార్యదర్శులపై మండిపడ్డారు. ఏలూరు డీఎల్పీవో వ్యవహార శైలి మార్చుకోవాలని కలెక్టర్ హెచ్చరించారు. పంచాయతీల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీకి చర్యలు తీసుకోవాలని ఈవోపీఆర్డీలను కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. ప్రజాసాధికార సర్వేలో అగ్రస్థానం ప్రజాసాధికార సర్వే కార్యక్రమం అమల్లో పశ్చిమ 90 శాతం సర్వే పూర్తి చేయగలిగిందని, ఏజెన్సీ ఏరియాలో టవర్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల మిగిలిన 10 శాతం జాప్యం జరుగుతోందని, త్వరలోనే నూరు శాతం సర్వే పూర్తి చేసిన జిల్లాగా అగ్రస్థానంలో నిలుస్తుందని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో డీపీవో కె.సుధాకర్, డివిజనల్ పంచాయతీ అధికారి పాల్గొన్నారు. నెలాఖరుకు పనులు పూర్తికావాలి ఏలూరు (ఆర్ఆర్ పేట) : ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా పురోగతిలో ఉన్న పనులన్నీ కూడా ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఎంపీ లాడ్స్ ద్వారా ఖర్చు పెట్టే నిధులుపై పనుల ప్రగతిని ఆయన సమీక్షించారు. పనులు ఈ నెలాఖరుకు పూర్తికాకపోతే సంబంధిత ఏఈ, ఎంపీడీవోలపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దత్తత గ్రామాలు తూర్పుతాళ్లు, పెదమైనివానిలంక, మహాదేవపట్నం, సంజీవపురం, పెదకాపవరం, పేరుపాలెం సౌత్, కె.రామవరంలలో కొత్తగా 433 పింఛన్లు మంజూరు చేశామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ అమరేశ్వరరావు, హౌసింగ్ పీడీ ఈ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా చేసుకోవాలి
ఏలూరు అర్బన్ : గణేశ్ నిమజ్జనోత్సవాలను జిల్లా వాసులు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ భాస్కర్‌భూషణ్ సూచించారు. ఆయన శుక్రవారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వాసులు చట్టాలను గౌరవిస్తారనే మంచిపేరు ఉందని చవితి వేడుకలు ఆనందంగా ప్రశాం తంగా ముగించడం ద్వారా దానిని మరోమారు నిరూపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా పలువురు ఫోన్ చేసి ఇబ్బందులను ఎస్పీకి వివరించారు. ఏలూరు నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి నగరంలో పేకాటలు యథేచ్ఛగా సాగుతున్నాయని వివరించారు. పెనుమంట్ర నుంచి ఓ మహిళ ఫోన్ చేసి ఓ కానిస్టేబుల్ ప్రేమ పేరుతో మోసం చేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. పెరవలి నుంచి మరో వ్యక్తి ఫోన్ చేసి రోడ్లపై ఆటోలను అడ్డదిడ్డంగా నిలుపుతున్నారని, లౌడ్స్పీకర్లు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ద్వార కాతిరుమల నుంచి కొంతమంది ఫోన్ చేసి గ్రామంలో కోడిపందేలు యథేచ్ఛగా సాగుతున్నాయని వివరించారు. ఇంకా పలువురు ఆటోవాలాల ఆగడాలపై ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎస్పీ ఆటోవాలాల ఆగడాలపై తరుచూ ఫిర్యాదు వస్తున్నాయని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా చేసుకోవాలి
ఏలూరు అర్బన్ : గణేశ్ నిమజ్జనోత్సవాలను జిల్లా వాసులు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ భాస్కర్‌భూషణ్ సూచించారు. ఆయన శుక్రవారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వాసులు చట్టాలను గౌరవిస్తారనే మంచిపేరు ఉందని చవితి వేడుకలు ఆనందంగా ప్రశాం తంగా ముగించడం ద్వారా దానిని మరోమారు నిరూపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా పలువురు ఫోన్ చేసి ఇబ్బందులను ఎస్పీకి వివరించారు. ఏలూరు నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి నగరంలో పేకాటలు యథేచ్ఛగా సాగుతున్నాయని వివరించారు. పెనుమంట్ర నుంచి ఓ మహిళ ఫోన్ చేసి ఓ కానిస్టేబుల్ ప్రేమ పేరుతో మోసం చేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. పెరవలి నుంచి మరో వ్యక్తి ఫోన్ చేసి రోడ్లపై ఆటోలను అడ్డదిడ్డంగా నిలుపుతున్నారని, లౌడ్స్పీకర్లు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ద్వార కాతిరుమల నుంచి కొంతమంది ఫోన్ చేసి గ్రామంలో కోడిపందేలు యథేచ్ఛగా సాగుతున్నాయని వివరించారు. ఇంకా పలువురు ఆటోవాలాల ఆగడాలపై ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎస్పీ ఆటోవాలాల ఆగడాలపై తరుచూ ఫిర్యాదు వస్తున్నాయని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్
ఐదుగురికి మెమోలు హన్మకొండ అర్బన్ : విధుల్లో నిర్లక్ష్యం వహించిన పలువురు పంచాయతీ ఉద్యోగులపై డీపీఓ పద్మజారాణి కొరడా ఝళిపించారు. ఒకే రోజు ఏకంగా ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయడంతో పాటు ఐదుగురిపై చార్జెస్ ఫ్రేం చేశారు. దీంతో ఒక్కసారిగా పంచాయతీ శాఖ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వేటుపడిన వారిలో మంగపేట మండలం కమలాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సీహెచ్.పుల్లయ్య, హరితహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా పరకాల మండలం కౌకొండ కార్యదర్శి జగదీష్‌ను సస్పెండ్ చేస్తూ డీపీఓ పద్మజారాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదేవిధంగా పెద్దమొత్తంలో నిధులు నగదు నిల్వ ఉంచుకున్నందుకు చిట్యాల మండలం రామకృష్ణాపూర్(టి) కార్యదర్శి శంకర్, ములుగు మండలం సర్వాపూర్ కార్యదర్శి నర్సింహారెడ్డి, ములుగు మండలం కాశిందేవిపేట కార్యదర్శి ఎండీ మహమూద్, గణపురం కార్యదర్శి సత్యనారాయణ, ఇదే మండలం పర్కపల్లి కార్యదర్శి కొండయ్య, నగరంపల్లి కార్యదర్శి విజేందర్‌లపై చార్జెస్ ఫ్రేం చేసినట్లు డీపీఓ తెలిపారు. వీరు ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి విచారణ, చర్యలు ఉంటాయని అన్నారు. హరితహారంలో నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగానికి పాల్పడితే సహించేదిలేదని ఈ సందర్భంగా డీపీఓ హెచ్చరించారు. -
కుంటుపడుతున్న పాలన
18 జీపీలకు ఆరుగురే కార్యదర్శులు పట్టించుకోని అధికారులు నియమించాలని ప్రజల వేడుకోలు శాయంపేట: గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల పోస్టులు కొన్నేళ్లుగా ఖాళీలతో వెక్కిరిస్తున్నాయి. పోస్టుల భర్తీపై అధికారులు దృష్టి సారించకపోవడంతో ఉన్న కార్యదర్శులే మిగిలిన గ్రామాల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మండలంలో 18 గ్రామపంచాయతీల్లో ఆరుగురే కార్యదర్శులు ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మండలంలో ఏర్పాటుచేసే సమావేశాలకు రెవెన్యూ, పంచాయతీ రాజ్ సిబ్బందే పనిచేయాల్సి ఉంటుంది. దీంతో ఇతర మండలాలతో పోలిస్తే ఇక్కడ పనిచేసే వారికి వారి విధులతో పాటు ఇతరాత్రా పనులు సైతం చేయాల్సి ఉంటుంది. దీంతో వారి విధులకు సరైన న్యాయం చేయలేకపోతున్నారు. అభివృద్ధికి ఆటంకం... గ్రామాల్లో అభివృద్ధి చేపట్టాలన్నా.. సమస్యలను పరిష్కరించాలన్నా గ్రామ పంచాయతీకి పన్నుల వసూలు తప్పనిసరి. కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్న సమయంలోనే పన్నులు వసూలు అంతంత మాత్రంగానే ఉంటుంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు సైతం నిలిచేపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో కార్యదర్శులు కొరత లేకుండా చేసి సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. న్యాయం చేయలేకపోతున్నాం నేను పనిచేసేది తహరాపూర్. అదనంగా సూరంపేట, గోవిందాపూర్, గట్లకానిపర్తి గ్రామాలకు ఇన్చార్జ బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఏ గ్రామానికి సరైన న్యాయం చేయలేకపోతున్నా. మాకు రావల్సిన ఎఫ్‌టీఏ ఇన్చార్జ అలవెన్స్ సైతం అందడం లేదు. - బైరబోయిన సుధాకర్, తహరాపూర్ పంచాయతీ కార్యదర్శి పనిభారం పెరిగింది నాకు పోస్టింగ్ ఇచ్చింది నేరేడుపల్లి. కార్యదర్శుల కొరతతో నాకు జోగంపల్లి, కొప్పుల గ్రామాలకు ఇన్చార్జ బాధ్యతలు ఇవ్వడంతో పనిభారం పెరిగి ఏ గ్రామానికి కూడా పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించలేకపోతున్నా. - రాయకంటి రాజు, నేరేడుపల్లి, పంచాయతీ కార్యదర్శి -
చచ్చినా వదలరు!
- మృతుల పేర్లపై పింఛన్లు స్వాహా - మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించని వైనం - వారి ఫొటోల పక్కన నమోదవుతున్న వేలిముద్రలు - పుష్ఠిగా ఆరగిస్తున్న పంచాయతీ కార్యదర్శులు - చోద్యం చూస్తున్న మైలవరం ఎంపీడీఓ - ఫిర్యాదు చేసినా కదలని యంత్రాంగం సాక్షి ప్రతినిధి, కడప : ఆ పండుటాకులు ఎప్పుడో కాలమైపోయినా, వారి పేరుతో నెల నెలా పింఛన్ మాత్రం వస్తోంది. వారి ఫొటోలు, పేర్ల పక్కన వేలి ముద్రలు వేసి పింఛన్ ఇప్పటికీ తీసుకుంటున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మృతి చెందిన వారు వచ్చి పింఛన్ తీసుకోవడం ఎలా సాధ్యమనే అనుమానం రావడం ఎవరికైనా సహజం. అయితే మైలవరం మండలంలో అధికారుల మాయాజాలం వల్ల ఈ అక్రమాల పరంపర కొనసాగుతోంది. మైలవరం మండలంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇచ్చే పింఛన్ జాబితాను పరిశీలిస్తే పదుల సంఖ్యలో మృతుల పేర్లు దర్శనమిస్తున్నాయి. ఐదారు నెలల క్రితం మరణించిన వారు సైతం నేటికీ పింఛన్ తీసుకుంటున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క వద్దిరాల పంచాయతీలోని దాదాపు 10 మంది చనిపోయిన వారి పేర్లతో ప్రతినెల పింఛన్లు డ్రా అవుతున్నాయి. బెస్తవేముల పంచాయతీలో కూడా ఇదే తంతు జరుగుతోంది. దన్నవాడ, గొల్లపల్లె, చిన్న వెంతుర్ల, చిన్న కొమెర్ల తదితర గ్రామాల్లో అధిక సంఖ్యలో చనిపోయిన వారి పేర్లు కనిపిస్తున్నాయి. ఇలా మండల వ్యాప్తంగా 50 మందికి పైగా మరణించిన వారి పేర్లతో ఆయా పంచాయతీ కార్యదర్శులు పింఛన్లను స్వాహా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. వేలిముద్రల సాక్షిగా.... మైలవరం మండలం వద్దిరాల గ్రామానికి చెందిన పాణ్యం నారాయణమ్మ (పింఛన్ ఐడీ నెంబరు 486293) ఈ ఏడాది ఫిబ్రవరిలో మరణించింది. అప్పట్లో పోస్టల్ శాఖ వారు పింఛన్లు పంపిణీ చేస్తుండడంతో మార్చి, ఏప్రిల్ నెలల్లో ఆమె పింఛన్‌ను నిలిపివేశారు. అయితే, మే నెలలో పింఛన్ పంపిణీ పగ్గాలు చేతబట్టిన ఆ పంచాయతీ కార్యదర్శి.. ఒకేసారి మూడు నెలల పింఛన్ తీసుకున్నట్లుగా నారాయణమ్మ ఫొటో పక్కన వేలిముద్ర వేసి రూ.3 వేలు డ్రా చేసేశాడు. జూన్, జూలై మాసాల్లో కూడా బోగస్ వేలిముద్రలు వేసి ఠంచన్‌గా పింఛన్ డ్రా చేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన వికలాంగుడైన షట్కారి ఓబులేశు (ఐడీ నెంబరు 420693), షట్కారి నాగమ్మ (ఐడీ నెంబరు 420628)లు ఫిబ్రవరిలోనే మరణించారు. వీరి పింఛన్లు సైతం నేటికీ డ్రా అవుతూనే ఉన్నాయి. ఆరు నెలల క్రితం మరణించిన మేకలదొడ్డి లక్షుమ్మ (ఐడీ నెంబరు 33052), కొండమ్మ (ఐడీ నెంబరు 280576)ల పేర్లు కూడా తాజా జాబితాలో దర్శనమిస్తూనే ఉన్నాయి. బెస్తవేముల పంచాయతీకి చెందిన తంబళ్ల ఈశ్వరమ్మ (ఐడీ నెంబరు 370199), బొందల నరసింహులు (ఐడీ నెంబరు 282149), పొమెర నిలకమ్మ (ఐడీ నెంబరు 279492)ల పింఛన్లు నేటికీ డ్రా అవుతూనే ఉన్నాయి. వీరందరి మరణ ధ్రువీకరణ పత్రాలు ఆనాడే అందజేసిన ఆ పంచాయతీ కార్యదర్శికి పింఛన్ల జాబితాల నుంచి వారి పేర్లు తీసి వేయడానికి ఎందుకో మనసొప్పడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్హులకు మొండిచేయి ఎందరో వృద్ధులు, వికలాంగులు సంవత్సర కాలంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మైలవరం మండలం చిన్నవెంతుర్లకు చెందిన గిత్తల లక్ష్మన్నకు రెండు కళ్లు పూర్తిగా కనబడవు. వంద శాతం అంధ్వత్వం ఉన్నట్లు రిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు కూడా. అన్ని ధ్రువపత్రాలతో పింఛన్ కోసం లక్ష్మన్న ఇప్పటికి మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నాడు. మైలవరం ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఈయన గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఒక్క లక్ష్మన్నే కాదు...మండల వ్యాప్తంగా వందల సంఖ్యలో అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్ రాక అల్లాడిపోతున్నారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా 15,500 మంది వృద్ధులు, 10 వేలకు పైగా వితంతువులు, ఐదు వేల మంది వికలాంగులు, 1200 మంది చేనేతలు ఫించన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అర్హులకు ఇవ్వకపోగా దొడ్డిదారిన సొమ్ము చేసుకుంటున్నా చూస్తు మిన్నకుండిపోతోంది. పర్యవేక్షణ లోకపోవడంతోనే.. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం రాగానే పింఛన్ల జాబితా నుంచి సుమారు 44 వేల మంది పేర్లను తొలగించేశారు. విచారణ పేరుతో కొన్ని నెలలు కాలాయాపన చేసి వారిలో కొందరి పేర్లను తిరిగి జాబితాలో చేర్చారు. ఇలా తొలగిపోయి మళ్లీ చేరిన వారికి తొలిసారి రెండు నెలల పింఛన్ వచ్చింది. చాలా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు రూ.1000 మింగేసి, రూ. వెయ్యి మాత్రమే అందజేశారు. ఇక కొత్తగా మంజూరైన పింఛన్‌దారుల నుంచి మొదటి నెలలో రూ.500 వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతినెల వేల రూపాయల్లో ఆదాయం కళ్ల చూస్తున్నా అవినీతి కార్యదర్శుల ఆశ చావలేదు. ఏకంగా మృతి చెందిన వారి పేరు పక్కన వేలి ముద్రలు వేసుకుంటూ ఆ పాపం కూడా మూటగట్టుకున్నారు. ఇదంతా మైలవరం ఎంపీడీఓకు తెలిసినా ఆయన పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నాడన్న విమర్శలున్నాయి. చర్యలు తీసుకుంటాం చనిపోయిన వారి స్థానంలో డైడ్ అని విధిగా కార్యదర్శులు నమోదు చేయాలి. ఎంపీడీఓల పరిధిలో ఇలాంటి తనిఖీ జరగాల్సి ఉంది. ఎవ్వరు కూడ ఫించన్ల పంపిణీ సందర్భంగా కార్యదర్శులకు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. చనిపోయిన వారి పేర్లతో పెన్షన్లు పొందడంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. - అనిల్‌కుమార్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ -
ఆదేశాలు ఇస్తే సరిపోదు.. పనులు చేయించాలి
- తాగునీటి సరఫరాపై శ్రద్ధ చూపండి - పనిచేయని పంచాయతీ కార్యదర్శులపై నివేదికలు ఇవ్వండి - మీ కోసంలో కలెక్టర్ బాబు.ఎ చిలకలపూడి : ఆదేశాలు ఇస్తే సరిపోదు.. పనులు జరిగేలా చూడాలని కలెక్టర్ బాబు.ఏ అన్నారు. కలెక్టరేట్ సమావేశ హాలులో సోమవారం మీ కోసం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ చంద్రుడు, డీఆర్వో ప్రభావతిలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. పీహెచ్‌సీల్లో రూ.లక్షలు ఖర్చు పెట్టి ఇటీవలే కొత్త పరికరాలు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. కొన్ని పీహెచ్‌సీల్లో పరికరాలు వాడటం లేదని తన దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై డీఎంహెచ్‌వో ఆర్ నాగమల్లేశ్వరీని ఆయన ప్రశ్నించారు. ఆమె ఆదేశాలు ఇచ్చామని కలెక్టర్‌కు వివరించారు. పీహెచ్‌సీల్లో ఫిజియోథెరపీ పరికరాలు ఉపయోగించటం లేదని వైద్యాధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించి పనిచేసేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. పెంటావలెంట్ వ్యాక్సిన్‌పై మండల ప్రత్యేకాధికారులు తనిఖీలు చేయాలన్నారు. గత వారం వీడియో కాన్ఫరెన్స్‌లో ఐసీడీఎస్, వైద్యాధికారులకు ఇంద్రధనుష్, ప్రసూతిలపై నివేదికలు ఇవ్వాలని చెప్పినా ఇంతవరకు ఎవ్వరూ తనకు పంపలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో 30 వేల మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోందని, ఇంకా 1.20 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. దశలవారీగా లబ్దిదారులకు ఆన్లైన్లోనే సొమ్ము చెల్లించాలని ఆదేశించారు. అంగన్వాడీ అమృతహస్తం లో కొన్నిమార్పులు చేశారని వాటిని సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మార్పులు ఆయా మండలాల ప్రత్యేకాధికారులకు తెలియజేయాలని ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారికి కలెక్టర్ సూచించారు. జిల్లాలో మీ-సేవా కేంద్రాలు ఏర్పాటుకు కొందరు దరఖాస్తు చేసుకున్నారని ప్రత్యేకాధికారులు నివేదికలు ఇవ్వాలన్నారు. ఈ-ఆఫీస్ ఇప్పటివరకు 568 సిబ్బందికి మూడు విడతలుగా శిక్షణ ఇచ్చారని తెలిపారు. ్వటం జరిగిందన్నారు. మిగిలిన శాఖల సిబ్బందికి కూడా ఈ వారంలో శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. డ్వామా సిబ్బందికి కలెక్టర్ ఆగ్రహం.. డ్వామా కార్యాలయ సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం ఈ-ఆఫీస్‌లో భాగంగా డ్వామా సిబ్బందికి శిక్షణ ఇచ్చారని తెలిపారు. నేటి వరకు ఈ-ఆఫీస్‌లో ఒక్క ఫైల్ లాగిన్ అవ్వలేదని ఇన్చార్జి డ్వామా పీడీ సుమలతను కలెక్టర్ ప్రశ్నించారు. తమ సిబ్బందికి డిజిటల్ సిగ్నేచర్స్ రాలేదని తెలిపారు. 25 మందికి గాను ఇప్పటివరకు 17 మందికి డిజిటల్ సిగ్నేచర్స్ వచ్చాయని, అబద్దాలు చెప్పటం మీ శాఖలో సిబ్బందికి అలవాటైపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో ఈ-ఆఫీస్‌లోనే పరిపాలన సాగించాలని అలా సాగించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నా.. ఏసీబీ దాడిలో పట్టుబడ్డ డీపీవో నాగరాజువర్మ వార్త విన్నవెంటనే తాను ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నానని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఇటువంటి అధికారులు ఎవరైనా ఉంటే వారి ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు. ఆయా మండలాల ప్రత్యేకాధికారులు పంచాయతీ కార్యదర్శులపై ప్రత్యేక నిఘా పెట్టాలని, పనిచేయని వారిపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖరరాజు, డీఎస్వో వి.రవికిరణ్, సీపీవో వైబీఎన్ శర్మ, సాంఘిక సంక్షేమశాఖ డీడీ మధుసూదనరావు, హౌసింగ్ ఇన్చార్జి పీడీ శరత్‌బాబు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ ఎన్వీవీ సత్యనారాయణ, సర్వేశాఖ ఏడీ విజయకుమార్, బందరు ఆర్డీవో సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. -
అరెస్టు చేయకుంటే పింఛన్లు పంచం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : నవాబ్‌పేట్ మండలం కారూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులుపై దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయకపోతే ఈనెల 10వ తేదీ నుంచి ప్రభుత్వం తలపెట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సహకరించబోమని పంచాయతీ కార్యదర్శులు హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శిపై దాడికి నిరసనగా సంఘం ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌరస్తాలో చేపట్టిన ధర్నా సోమవారం నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కార్యదర్శులు పెద్దసంఖ్యలో పోలీసు రక్షణ కల్పిస్తేనే పింఛన్ల పంపిణీ చేపడతామన్నారు. కార్యదర్శిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయూలన్నారు. శ్రీనివాస్‌పై బనాయించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసును ఉపసంహరించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాల్సిన భాద్యత అధికారులపై ఉందన్నారు. లేని పక్షంలో ఉద్యమన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దాడులను అరికట్టాలి... ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే విధులు నిర్వహించడం కష్టమని ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, పంచాయతీ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, రెవెన్యు సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అద్యక్షుడు ప్రభాకర్, ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్‌నాయక్ అన్నారు. సోమవారం వారు ధర్నాకు సంఘీభావం తెలిపారు. పంచాయతీ కార్యదర్శిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. అనంతరం జిల్లా ఎస్పీ విశ్వ్రపసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఆందోళన విరమణ కారూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిపై దాడికి నిరసనగా చేపట్టిన ఆందోళనను విరమిస్తూ మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు సిటి కేబుల్ శ్రీనివాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దాడి కేసులో నిందితులను అరెస్ చేయడంతో తాము ఆందోళన విరమిస్తున్నట్లు తెలిపారు. -
జాయింట్ జగడం
- కార్యదర్శికి చెక్ పవర్‌పై సర్పంచుల గుర్రు - నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడేనా? - కార్యదర్శుల కొరతతో తీవ్ర ఇబ్బందులు - 29 అంశాలు బదలాయింపు అయ్యేనా..? సుల్తానాబాద్: గ్రామపంచాయతీలకు 29 అంశాలను బదలాయించడంతో పాటు నిధులు, విధుల్లో సర్వాధికారాలు కట్టబెడుతామన్న సర్కారు దానికి విరుద్ధంగా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ కల్పిస్తూ జీవో జారీ చేయడంపై సర్పంచులు గుర్రుగా ఉన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం పేరిట గ్రామ ప్రజాప్రతినిధులను అగౌరవ పరచడమేనని, తమ హక్కులను హరించే ప్రయత్నంలో భాగమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈజీవోపై సర్కారు పునరాలోచన చేయాల్సిన అవసరముందని సర్పంచులు కోరుతున్నారు. నిధుల దుర్వినియోగమే కారణమా..? సర్పంచులకు నేరుగా చెక్ పవర్ ఉండడంతో పంచాయతీ పాలకవర్గం తీర్మానాలు లేకుం డానే డబ్బులు డ్రా చేసి వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల సర్పంచులపై ప్రభుత్వానికి, ఉన్నతాధికారుల కు ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం జాయింట్ చెక్ పవర్‌ను అమలు చేస్తే కొంతవరకు అవినీతికి చెక్ పెట్టవచ్చనే ఆలోచనతోనే ఈ జీవో జారీ చేసినట్టు భావిస్తున్నారు. సర్పంచులు బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర అవుతున్నప్పటికీ మెజారిటీ గ్రామ పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లు అవుతున్నప్పటికీ పలు రకాల పనులకు నిధులు విడుదల చేయలేదు. పని చేసిన వాటికి నిధులు నేటికీ ఇవ్వకపోవడంతో అప్పులు తెచ్చి పనులు చేసిన సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల బీఆర్జీఎఫ్, 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధులను గ్రామాభివృద్ధికి నిధులు వెచ్చించనున్నారు. గతంలోనూ జాయింట్ చెక్ పవర్ కల్పించిన సందర్భాల్లో సర్పంచుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. పలు చోట్ల కార్యదర్శులు, సర్పంచులు కుమ్మక్కై నిధులు దుర్వినియోగం చేసిన సంఘటనలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో జాయింట్ చెక్ పవర్ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందనే విషయమై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కార్యదర్శులేరి..? జిల్లాలో 1207 గ్రామపంచాయతీలు ఉండగా, 528 మంది మాత్రమే కార్యదర్శులు ఉన్నారు. క్లస్టర్ల వారీగా చూసినా జిల్లాలో 621 క్లస్టర్లు ఉండగా.. 93 కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పెద్ద పంచాయతీలను మినహాయిస్తే మిగిలిన వాటిలో నాలుగు నుంచి ఆరు గ్రామపంచాయతీలకు ఒక కార్యదర్శి మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అదనపు భారంతో వీరు అన్ని పనులు నిర్వహించడం ఇబ్బందికరంగా ఉంది. అంతేగాకుండా నిధుల విషయమై సర్పంచులకు, కార్యదర్శులకు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేస్తేనే లక్ష్యం నెరవేరుతుంది. -
పంచాయతీ కార్యదర్శుల నియామకానికి కౌన్సెలింగ్
జిల్లాలో 48 మందికి పోస్టింగ్‌లు ఖమ్మం జెడ్పీసెంటర్: పంచాయతీ కార్యదర్శులు 48 మందికి జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బాబురావు పోస్టింగ్ ఉత్తర్వులు అందజేశారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ ఏడాది మార్చి 23న ఏపీపీఎస్సీ నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్షల్లో అర్హత సాధించి అపాయింట్మెంట్ పొందిన వారికి ఇప్పుడు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 83 పోస్టులకు గాను 83 మంది అర్హత సాధించారు. వీరిలో ఒక అభ్యర్థి ఎంపికైన తర్వాత ఉద్యోగం వద్దని చెప్పడంతో 82 మంది మిగిలారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరగడంతో పోస్టింగ్‌లు నిలిపివేశారు. జిల్లాలో 7 మండలాలు ఆంధ్రలో వీలినం కావడంతో అక్కడ 35 పోస్టులను భర్తీ చేయడానికి వీలు లేకపోవడంతో చివరకు అధికారులు ప్రభుత్వనికి లేఖ రాశారు. దీంతో మిగిలిన మండలాల్లో 48 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో 82 మంది అభ్యర్థుల్లో మెరిట్ ఆధారంగా 48 మందికి కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్‌లు ఇచ్చారు. -
‘తాండవ’ గుండెకు తూట్లు
వేలాది ఎకరాలకు నీరందించే తాండవ గుండెకు ‘పచ్చదళం’ కోత పెడుతోంది. అర్థబలం, అంగబలం ఉందనే తెగింపుతో పగలు, రాత్రి తేడా లేకుండా నది నడుమ ఇసుకను తవ్వి లక్షలు గడిస్తున్నారు. ఆయకట్టు రైతులను నట్టేట ముంచేస్తున్నారు. ఒడ్డునున్న శ్మశానవాటిక నదిలో కలిసిపోతుందని తెలిసినా వారికి ఖాతరే లేదు. పంచాయతీల నుంచి ఒక రశీదు తీసుకుని, దాని మాటునే పది, పదిహేను ట్రాక్టర్ల ఇసుక తవ్వుకుపోతున్నారని తెలిసినా అధికారులు చేతులు ముడుచుకు కూర్చుంటున్నారు. * యథేచ్ఛగా ఇసుక తవ్వుతున్న అక్రమార్కులు * ఒక రశీదు మాటున పదుల ట్రాక్టర్ల తరలింపు * అండగా నిలుస్తున్న అధికార పార్టీ నాయకులు * రోజూ లక్షలు దండుకుంటున్న తెలుగు తమ్ముళ్లు సాక్షి ప్రతినిధి, కాకినాడ : యాభై వేల ఎకరాలకు సాగునీరందించే తాండవ నది విశాఖ జిల్లానాతవరం నుంచి మొదలై తుని మీదుగా పెంటకోట వరకూ ప్రవహిస్తోంది. ఆ నది పరీవాహక ప్రాంతం ఇప్పుడు తెలుగుతమ్ముళ్లకు, వారి అనుచరులకు లక్షలు కురిపిస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా తాండవలో ఇసుక తవ్వేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుక తవ్వుకునేందుకు పంచాయతీ కార్యదర్శులు అనుమతి ఇవ్వాలి. అదీ ఒక లబ్ధిదారుడికి ఒక ట్రాక్టర్ ఇసుక మాత్రమే. ఇంటి నిర్మాణం జరుగుతున్నట్టు గృహనిర్మాణశాఖ నుంచి అనుమతి పత్రం చూపి, రూ.120 జమచేస్తే పంచాయతీ నుంచి రశీదు ఇస్తారు. ఆ అనుమతి కూడా రెండు రోజులకు ఒకటి వంతున ఇంటి నిర్మాణానికి అవసరమైన మేరకు మాత్రమే విడుదల చేయాలి. కేవలం నిరుపేదలు, మధ్యతరగతి వర్గాల కోసం ఈ వెసులుబాటు ఇచ్చారు. అది కూడా తాండవ నదీ గర్భంలో 3 నుంచి 4 మీటర్లు ఉండాలి. అంతకన్నా తక్కువ పరిమాణంలో ఉంటే ఇసుక తీయకూడదనేది నిబంధన. కానీ ఆ నిబంధనలను తోసిరాజంటూ యథేచ్ఛగాా తవ్వకాలు జరిపించేస్తున్నారు. తెలుగుతమ్ముళ్ల బినామీలే.. తుని, కోటనందూరు మండల్లో తెలుగుతమ్ముళ్లు, వారి పేరుతో బినామీల కనుసన్నల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. పైసా పెట్టుబడి లేకుండా ఇసుక అడ్డగోలు రవాణాతో లక్షలు వెనకేసుకుంటున్నారు. విశాఖ జిల్లా నాతవరం నుంచి పాయకరావుపేట మండలం పెంటకోట వరకు తాండవ సుమారు 36 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. జిల్లా పరిధిలోకి వచ్చే అల్లిపూడి, కోటనందూరు, కేఓ అగ్రహారం, డి.పోలవరం, బొద్దవరం, కొలిమేరు, నందివంపు, మరువాడ, రేఖవానిపాలెం, కుమ్మరిలోవ, ఉప్పరగూడెం, రామభద్రపురం తదితర ప్రాంతాల్లో అనధికారికంగా ఇసుక రీచ్‌లు నిర్వహిస్తున్నారు. విచ్చలవిడిగా ఇసుక తవ్వడం వల్ల నది ప్రవాహ గమనం మారి విలువైన పంటభూములు కోతకు గురవుతున్నాయి. వాల్టా చట్టం ప్రకారం గోదావరి, కృష్ణావంటి జీవనదుల్లోనే ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చారు. కానీ ఇక్కడ ఏ విధమైన అనుమతులు లేకుండానే యంత్రాలతో ఇసుక దర్జాగా తవ్వుకుపోతున్నారు. కాగా ఇసుకలపేటకు సమీపాన రోటరీ రూ.అరకోటి వెచ్చించి నిర్మించిన హిందూ శ్మశాన వాటిక ఇసుక తవ్వేస్తుండటంతో కిందకు దిగిపోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. రోజుకు 1500 ట్రాక్టర్లకు పైమాటే.. ఇంటి నిర్మాణం పేరుతో ఒక ట్రాక్టర్ ఇసుక కోసం రూ.133, ఎడ్లబండికి రూ.46 చెల్లించి పంచాయతీల నుంచి రశీదు తీసుకుంటున్నారు. అధికారికంగా ఒకటి, రెండు రశీదులు తీసుకుంటున్న అక్రమార్కులు వాటిపైనే 10 నుంచి 25 లోడులను తరలించుకుపోయి దండిగా సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టరు ఇసుకకు రూ.133 చెల్లిస్తున్న అక్రమార్కులు మార్కెట్లో రూ.1000కు విక్రయిస్తున్నారు. తాండవ పరీవాహక ప్రాంతంలో రోజూ 1500 ట్రాక్టర్ల పైబడే ఇసుకను తరలించుకుపోతున్నట్టు అంచనా. ఎడ్లబళ్లకు అయితే లెక్కేలేదంటున్నారు. మొత్తం మీద రోజుకు రూ.15 లక్షల చొప్పున అంటే నెలకు నాలుగున్నర కోట్లు తెలుగుతమ్ముళ్లు నొక్కేస్తున్నారు. తునిమండలంలో అధికారపక్షానికి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి, కోటనందూరు మండలంలో ఒక ప్రజాప్రతినిధి ఇసుక అక్రమ తవ్వకంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. మండల రెవెన్యూ, పోలీసు అధికారులకు కూడా కొంత వాటా ముట్టచెప్పడం, ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండడంతో ఇసుక అక్రమ వ్యాపారానికి అడ్డూఅదుపూ లేదు. అడపాదడపా గనులశాఖ అధికారులు దాడులు నిర్వహించినా మొక్కుబడి కేసుల నమోదుకే పరిమితమవుతున్నారు. ఈ విషయమై తుని ఇన్చార్జి ఎంపీడీఓ శేషారత్నంను వివరణ కోరగా ట్రాక్టర్‌కు రూ.133 వంతున, ఎడ్లబండికి రూ.46 వంతున జమ చేసుకుని వే బిల్లు ఇచ్చిన తరువాతే ఇసుక తరలించేందుకు అనుమతిస్తున్నామని చెప్పారు. అనధికారికంగా ఇసుక తరలించే విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. -
ఊరు.. హుషారు
ఇందూరు: కొత్త విధానంలో భాగంగా ముందుగా గ్రామాలవారీగా, ఆ తరువాత మండల, జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించి పంపించాలని జిల్లా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా పరిషత్ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు ఎవరికి వారు పనులలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీల సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు, మండల అభివృద్ధి అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు కూడా ఈ కార్యక్రమం గురించి అవే ఉత్తర్వులను పంపించారు. ఈ నెల 13నుంచి 18 వరకు గ్రామాలవారీగా, 19 నుంచి 23 వరకు మండలాలవారీగా, 24నుంచి 28 వరకు జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించేందుకు జిల్లా అధికారులు సమాయత్తమవుతున్నారు. ఏం చేస్తారు! గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలను తయారు చేసి ఇవ్వాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించిన ప్రభుత్వం, పలు అంశాలను సూచించింది. వీటి ఆధారంగా ప్రణాళికలను తయారు చేసుకోవాలని వివరించింది. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగం, ఉపాధి, రోడ్లు, మురుగుకాలువలు తదితర అంశాలపై సమగ్రంగా ప్రణాళికలను రూపొందించుకోవాలని తెలిపింది. వీటి కోసం గ్రామాలలో ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహించాలని, అక్కడి తీర్మానాలను ప్రణాళికలో చేర్చాలని పేర్కొంది. గ్రామసభలను మొక్కుబడిగా కాకుండా, అందరూ హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులకు ఆదేశాలిచ్చింది. పక్కా గా అభివృద్ధి ప్రణాళికలను తయారు చేసే బాధ్యతలను గ్రామ సర్పంచ్, కార్యదర్శులతో పాటు ఎంపీడీఓలకు అప్పగించారు. వీటి ఆధారంగానే గ్రామలవారీగా అభివృద్ధి నిధులను ప్రభుత్వం కేటాయించనుంది. రిసోర్సు పర్సన్లతో అవగాహన గ్రామాలవారీగా అభివృద్ధి ప్రణాళికలను ఎలా తయారు చేయాలనే విషయంపై సర్పంచులకు, కార్యదర్శులకు అవగాహన కల్పించేందుకు రిసోర్సు పర్సన్లను నియమించుకోవాలని ప్రభుత్వం సూచించింది. గ్రామానికి ఒకరు, మండలానికి ఇద్ద రు చొప్పున రిసోర్సు పర్సన్లను అధికారులు నియమించనున్నారు. ఈ రిసోర్సు పర్సన్ లకు కూడా శిక్షణనిచ్చేందుకు జిల్లా స్థాయిలో 18 మంది మాస్టర్ ట్రైనర్స్‌ను నియమించారు. వీరు రిసోర్సు పర్సన్లకు శిక్షనిచ్చి గ్రామాలు, మండలాలకు పంపుతారు. గ్రామస్థాయివారు 12న, మండలస్థాయివారు 11న మాస్టర్ ట్రైనర్స్ ఆద్వర్యంలో శిక్షణ పొందుతారు. ఇందుకోసం డివిజన్లవారీగా అవగాహన సదస్సులు పెట్టడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. గ్రామాలలో రిసోర్సు పర్సన్లుగా పని చేసేందుకు విద్యావంతులు అయిన యువకులను ఎంపిక చేసే బాధ్యతలను ఎంపీడీఓలకు అప్పగించారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా..
పత్తికొండ అర్బన్: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. అంతరిక్షంలోకి వెళ్లొస్తున్నా.. ఇప్పటికీ పలువురు పతుల చాటునే మిగిలిపోతున్నారు. ప్రజాతీర్పును గౌరవించాల్సిన భర్తలు.. వారిని వంటింటికే పరిమితం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనప్పటికీ పలువురు మహిళా నేతల స్థానంలో భర్తలు పెత్తనం చెలాయిస్తుండటంతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పరిపాలనపై పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లకు అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశానికి అధిక శాతం మహిళా సర్పంచ్ల స్థానంలో భర్తలు, కుటుంబ సభ్యులు హాజరు కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. కోతిరాళ్ల శిరీష, హోసూరు వాకిట శారద, మండగిరి రసూల్‌బీ, పులికొండ రంగమ్మ, చిన్నహుల్తి హుల్తెమ్మ స్థానంలో వారి సంబంధీకులు హాజరయ్యారు. మహిళలు వంటింటి పరిమితమనే భావన ఎప్పటికి తొలగిపోతుందో.. వారిలో చైతన్యం ఎప్పుడొస్తుందో.. వేచి చూడాల్సిందే. -
మీది మీదే.. మాది మాదే!
పంచాయతీ కార్యదర్శుల యూనియన్ల గోల మరో సంఘం ఆవిర్భావం ఏర్పాటుకు సిద్ధం అయోయయంలో కార్యదర్శులు మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ : పంచాయతీ కార్యదర్శుల్లో రోజుకో యూనియన్ పేరుతో కొత్త సంఘాలు పుట్టుకొస్తుండడంతో ఆయా పంచాయతీల కార్యదర్శులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కార్యదర్శుల సమస్యలకు సంబంధించి సంఘాలు ఏర్పడుతున్న తరుణంలో వారిలో పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి కాంట్రాక్టు కార్యదర్శులు రెగ్యులరైజ్ కార్యదర్శుల పేరుతో రెండు సంఘాల ఆవిర్భావమయ్యాయి. ఈ నేపథ్యంలో కొందరు కార్యదర్శులు రెగ్యులర్ కావడంతో మరికొంతమంది అలాగే మిగిలిపోయారు. దీంతో ఇటీవల ఒక సంఘం ఏర్పాటైంది. గతంలోనే ఒక సంఘం ఉండగా, ఇటీవల ఏర్పడ్డ సంఘంతో రెండో సంఘం ఆవిర్భావమైంది. ఈ నేపథ్యంలో తమకు సమాచారం లేకుండానే రెండో సంఘం ఆవిర్భావమైందంటూ మరికొందరు కార్యదర్శులు వారిపై తిరుగుబావుటా ఎగురవేసి ముచ్చటగా మూడో సంఘానికి తెరలేపారు. జిల్లాలో 1331 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పటికే 600, 700మంది కార్యదర్శులు ఉన్నారు. ఇంతమందికి సంబంధించి కేవలం ఒక్క సంఘం అయితే సరిపోయేది. ఈ నేపథ్యంలో సంఘాల ఏర్పాటుపై ఆయా కార్యదర్శులు తీవ్ర ఆందోళన మొదలైంది. ఎవరు ఏ సంఘంలో ఉంటే ఏమవుతుందో అన్న ఆందోళన నెలకొంది. -
రూ.1.31 కోట్లు స్వాహా
కర్నూలు(కలెక్టరేట్): సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో స్వాహాపర్వం కొనసాగుతోంది. కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్లు(సీఎస్పీ) చేతివాటం మితిమిరుతోంది. వితంతువులు.. వికలాంగులు.. వృద్ధుల కడుపుకొట్టి అక్రమార్కులు తమ పబ్బం గడుపుకుంటున్నారు. సీఎస్పీ పోస్టులకు ఉన్నత స్థాయిలో పైరవీలు జరుగుతుండటం వీటి డిమాండ్‌కు అద్దం పడుతోంది. జిల్లాలోని 53 మండలాల్లో పింఛన్ల పంపిణీ అక్రమాలపై మూడో విడత సామాజిక తనిఖీ(సోషల్ ఆడిట్) జరుగుతోంది. మొదటి విడతలో రూ.38,97,370.. రెండో విడతలో రూ.72,33,145 దుర్వినియోగమైనట్లు స్పష్టమైంది. మూడో విడతలో 21 మండలాల్లో సామాజిక తనిఖీ పూర్తి కాగా.. రూ.19,74,095 దుర్వినియోగమైనట్లు తేల్చారు. స్మార్ట్ కార్డులు ఉన్న వారికి యాక్సిస్ బ్యాంకు ద్వారా.. స్మార్ట్ కార్డులు లేని వారికి ఎంపీడీఓల ద్వారా పింఛన్ల పంపిణీ జరుగుతోంది. ఎంపీడీఓల ద్వారా పంచాయతీ సెక్రటరీలు పంపిణీ చేస్తుండగా, యాక్సిస్ బ్యాంకు ద్వారా పినో కంపెనీ నియమించిన సీఎస్పీలు పంపిణీ చేపడుతున్నారు. ఎంపీడీఓల ద్వారా జరిగిన పింఛన్ల పంపిణీలో రూ.45,13,955, యాక్సిస్ బ్యాంకు ద్వారా చేపట్టిన పంపిణీలో రూ.85,90,655 బొక్కేశారు. మొత్తం రూ.1.31 కోట్లకు పైగా స్వాహా జరిగితే.. రికవరీ మాత్రం రూ.16.35 లక్షలే కావడం గమనార్హం. ఎంపీడీఓల ఆధ్వర్యంలో పింఛన్లు పంపిణీ చేసిన పంచాయతీ సెక్రటరీలు అడ్డగోలుగా పేదల సొమ్ము తినేసినా చర్యలు కరువయ్యాయి. దాదాపు వంద మంది పంచాయతీ సెక్రటరీలు, ఇతరులు సొమ్ము స్వాహా చేసినా తుగ్గలి మండలంలో మాత్రమే ఒకరిద్దరిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. తక్కిన వారిపై చర్యలు లేకపోగా.. రికవరీ కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇక పింఛన్లు, ఎన్ఆర్ఈజీఎస్ పేమెంట్లను పంచాయతీ స్థాయిలోని కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్లు పంపిణీ చేస్తుండగా.. 90 శాతం మంది దోపిడీకి పాల్పడుతున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కూలీల నుంచి వారికి వచ్చే వేతనంలో రోజుకు రూ.10 కమిషన్ కింద తీసుకొని పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. పింఛన్ల పంపిణీలో చనిపోయిన వారు.. గ్రామాలు వదిలి వెళ్లిన వారి సంతకాలు ఫోర్జరీ చేసి స్వాహా చేస్తున్నట్లు సమాచారం. పింఛన్ కార్డుల్లో పేర్ల తప్పులను సైతం సీఎస్పీలు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. కలెక్టర్ ఆదేశాలు బుట్ట దాఖలు పింఛన్లు స్వాహా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, రికవరీ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి దాదాపు 8 నెలల క్రితం డీఆర్డీఏ, యాక్సిస్ బ్యాంకును ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు ఆరుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో సరిపెట్టారు. అరెస్టులు లేవు.. రికవరీ లేకపోవడం గమనార్హం. దాదాపు 1000 మంది సీఎస్పీలు అవినీతికి పాల్పడినా ఆరుగురిపై మాత్రమే కేసులు పెట్టడం అధికారుల పనితీరుకు నిదర్శనం. కనీసం రూ.లక్షకు పైబడి పింఛన్లు కాజేసిన వారిపై కేసులు పెట్టాలని కలెక్టర్ ఆదేశించినా ఫలితం లేకపోతోంది. యాక్సిస్ బ్యాంకు ఇచ్చే కమీషన్లో కట్ చేస్తాం సామాజిక భద్రతా పథకం కింద పంపిణీ చేసే పింఛన్లలో అక్రమాలు వాస్తవమే. బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలువురిపై క్రిమినల్ కేసులు పెట్టాం. పలువురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశాం. రూ.1.31 కోట్లు దుర్వినియోగం కాగా.. రూ.16.35 లక్షలు రికవరీ చేశాం. పింఛన్ల పంపిణీలో యాక్సిస్ బ్యాంకుకు రెండు శాతం కమీషన్ ఇస్తున్నాం. అందులో దుర్వినియోగం అయిన మొత్తాన్ని కట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. సీఎస్పీలు స్వాహా చేసిన మొత్తాన్ని కమీషన్లో పట్టుకుంటాం. - నజీర్ సాహెబ్, డీఆర్డీఏ పీడీ -
ముదురుతున్న ‘పంచాయితీ’
చేవెళ్ల, న్యూస్‌లైన్: చేవెళ్ల మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, ఈఓపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శుల మధ్య ముదిరిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. వివాదం ముదిరి పెద్దదయినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ‘రచ్చ’ బజారున పడింది. దీంతో ఎమ్మెల్యే కాలె యాదయ్య వద్దకు పంచాయితీ చేరింది. ఈ విషయం మరీ పెద్దదవుతుందన్న ఉద్దేశంతో విలేకరులను బయటకు పంపి సోమవారం స్థానిక అతిథిగృహంలో అధికారులు, ఈఓపీఆర్డీ మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. పంచాయతీ ఎటూ తేలకపోవడంతో ఎమ్మెల్యే యాదయ్య సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు నచ్చజెప్పి పంపించారు. వివరాల్లోకి వెళితే... ఎన్నికల సమయంలో చేవెళ్ల ఎంపీడీఓగా హిమబిందు బదిలీపై వచ్చారు. అంతకుముందు ఎంపీడీఓగా పనిచేసిన రత్నమ్మకు ఇప్పుడున్న సూపరిండెంట్ విజయలక్ష్మికి మధ్య సయోధ్య ఉండేదికాదు. కొత్తగా వచ్చిన ఎంపీడీఓ హిమబిందు కలిసి ఈఓపీఆర్డీ లక్ష్మణ్‌ను, పంచాయతీ కార్యదర్శులపట్ల అసభ్యకరంగా మాట్లాడారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈఓపీఆర్డీ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శులు ఏదైనా పనిపై వారి వద్దకు వెళితే అవమానపరిచే రీతిలో మాట్లాడేవారని పేర్కొన్నారు. ఈ క్రమంలో డీపీఓ కార్యాలయం నుంచి ఆరు కంప్యూటర్లు పంపిణీ అయ్యాయి. ఒకటి ఈఓపీఆర్డీకి, ఐదు పలు గ్రామపంచాయతీలకు పంపిణీ చేయాలి. కాగా పంచాయతీలకు పంపిణీ చేయగా, ఈఓపీఆర్డీకి వచ్చిన కంప్యూటర్ను ఎంపీడీఓ చాంబర్లో బిగించాలని సూచించడంతో ఈఓపీఆర్డీ లక్ష్మణ్ అభ్యంతరం చెప్పారు. దీంతో వివాదం మరింత ముదిరింది. ఈఓపీఆర్డీ ఆఫీసుకు తాళం.. తనకు కేటాయించిన కంప్యూటర్ను ఎంపీడీఓ చాంబర్లో బిగించాలని ఎంపీడీఓ హిమబిందు ఆదేశించడంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. దీంతో మెమో జారీ చేయగా, తన తప్పేమీ లేదని, మెమో ఎందుకు తీసుకోవాలంటూ ఈఓపీఆర్డీ లక్ష్మణ్ నిరాకరించారు. ఎమ్మెల్యే ముందుకు పంచాయితీ.. ఎమ్మెల్యే కాలె యాదయ్యకు అభినందనలు తెలపడానికి వచ్చిన ఈఓపీఆర్డీ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓ, సూపరిండెంట్ తీరుపై ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఆయన ఫోన్‌చేసి అతిథిగృహానికి రావాలని ఆదేశించడంతో ఎంపీడీఓ హిమబిందు, సూపరిండెంట్ విజయలక్ష్మి వచ్చారు. అందరూ కలిసిమెలిసి పనిచేయాలని, తగవులు పెట్టుకుంటే ప్రజా సంక్షేమం కుంటుపడుతుందని ఆయన హెచ్చరించి పంపించేశారు. విలేకరులను బయటకు పంపి.. మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి విలేకరులను బయటకు పంపి, అధికారుల మధ్య పంచాయితీ చెప్పారు. ఓ విలేకరి ఫోటోలు తీయడానికి ప్రయత్నించగా, ముడిమ్యాల మాజీ సర్పంచ్ ప్రభాకర్ చేతిని అడ్డంపెట్టి గన్‌మెన్‌తో తలుపులు వేయించారు. విలేకరులను బయటకు వెళ్లాలని చెప్పినప్పుడు ఎమ్మెల్యే యాదయ్య అక్కడే ఉండి వంత పాడడం విశేషం. -
హాజరు పలచన
ఏలూరు రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఆదివారం జరిగిన పంచాయతీ కార్యదర్శుల పరీక్షకు అతి స్వల్పంగా 66.04 శాతం హాజరు నమోదైంది. జిల్లాలో 25 పోస్టులకుగాను 24 వేల 562 మంది దరఖాస్తు చేసుకున్నారు. 16 వేల 222 మంది మాత్రమే హాజరయ్యారని జడ్పీ సీఈవో డి వెంకటరెడ్డి తెలిపారు. 8వేల 341 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాలేదు. ఉదయం జరిగిన మొదట పరీక్షకు హాజరైన అభ్యర్దుల్లో సుమారు 5 శాతం మంది మధ్యాహ్నం జరిగిన రెండో పరీక్షకు గైర్హాజరయ్యారు. ఈ ఉద్యోగాల భర్తీకి జిల్లా స్థాయిలో పోటీ పరీక్ష నిర్వహించటం ఇదే ప్రథమం. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జెడ్పీ సీఈవో చెప్పారు. ఓఎంఆర్ షీట్లు అందజేతలో కొన్నిచోట్ల ఇన్విజిలేటర్లు తికమక పడ్డారని అభ్యర్థులు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు కలెక్టర్ ఆధ్వర్యంలో 21 మంది జిల్లాస్థాయి అధికారులు లయజన్ ఆఫీసర్లుగా, 10 మందితో కూడిన రెండు స్క్వాడ్ బృందాలు పనిచేశాయి. జిల్లాలో ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకులోని 85 కేంద్రాలో పరీక్షలు నిర్వహించారు. పట్టణాల వారీగా హాజరు శాతం ఇలా ఉంది. పరీక్ష కేంద్రం దరఖాస్తు చేసుకున్న వారు హాజరైన వారు ఏలూరు 14 వేల 941 9వేల 786 తాడేపల్లిగూడెం 4 వేల 352 2వేల 914 తణుకు 5 వేల 269 3వేల 521 -
ప్రశాంతంగా పంచాయతీ కార్యదర్శుల పరీక్షలు
సాక్షి, కాకినాడ :పంచాయతీ కార్యదర్శుల నియామక పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. 70 కార్యదర్శుల పోస్టుల కోసం 44,535 మంది దరఖాస్తు చేయగా 30,427 మంది పరీక్షలకు హాజరయ్యారు. 14,108 మంది గైర్హాజరయ్యారు. 120 కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగిన జనరల్‌స్టడీస్ పేపర్-1 పరీక్షకు కాకినాడ డివిజన్లో 15,168 మంది, అమలాపురం డివిజన్లో 3,854 మంది, పెద్దాపురం డివిజన్లో 5,231 మంది, రాజమండ్రి డివిజన్లో 6,174 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30గంటల వరకు జరిగిన పేపర్-2 పరీక్షకు కాకినాడ డివిజన్ లో 15,002, అమలాపురం డివిజన్లో 4,058, పెద్దాపురం డివిజన్లో 5,227, రాజమండ్రి డివి జన్‌లో 6,131 మంది హాజరయ్యారు. మొత్తమ్మీద రెండు పేపర్లకు సంబంధించి 68.32 శాతం హాజరు నమోదైంది. జిల్లా పరిషత్ సీఈఓ ఎం.సూర్యభగవాన్ కో ఆర్డినేటర్‌గా జిల్లా వ్యాప్తంగా పరీక్షలను పర్యవేక్షించారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్‌కు కాకినాడ, రాజమండ్రి, పెద్దాపురం, అమలాపురం ఆర్డీఓలు ఇన్చార్జిలుగా వ్యవహరించారు. 38 రూట్ లకు జిల్లా స్థాయి అధికారులను ఇన్చార్జిలుగా వ్యవహరించారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షల నిర్వహణ సజావుగా సాగింది. రామచంద్రపురం, రంపచోడవరం డివిజన్లు మినహా మిగిలిన నాలుగు డివిజన్లలో జరిగిన ఈ పరీక్షల కోసం జిల్లా ట్రెజరీ కార్యాలయం నుంచి పరీక్షాకేంద్రాలకు ప్రశ్నాపత్రాలను తరలించారు. పరీక్షల అనంతరం సాయంత్రం కట్టుదిట్టమైన భద్రత మధ్య కలెక్టరేట్లోని రిసెప్షన్ కౌంటర్‌కు సమాధానపత్రాలను చేర వేశారు. -
కష్టే ఫలీ..
పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష రేపే మానసిక ప్రశాంతతతోనే మార్కుల సాధన విశాఖపట్నం, న్యూస్‌లైన్: నిరుద్యోగం రాజ్యమేలుతోంది. ఉపాధి అవకాశాలు లేక యువకులు నిరాశ..నిస్పృహలకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏ చిన్న ఉద్యోగం కోసమైనా నోటిఫికేషన్ వస్తే దాన్ని దక్కించుకోవడానికి తీవ్రమైన పోటీ నెలకొంటుంది. అందులోనూ సర్కార్ కొలువంటే చెప్పలేనంతమంది పోటీపడతారు. ఇలాంటి పరిస్థితిలో కష్టపడితేనే ఫలితం సొంతమంటున్నారు నిపుణలు. ప్రణాళికాబద్ధంగా చదవడంతోనే విజయం ఖాయమంటున్నారు. ఆదివారం జరగనున్న (ఈనెల 23న) పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగం కోసం వేలాది మంది కుస్తీ పడుతున్నారు. విజయ తీరాలకు చేరాలని ఆశిస్తున్నారు. జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల పోస్టులు 155 ఉండగా 42,326 మంది పోటీ పడుతున్నారంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అభ్యర్థుల సంఖ్యను చూసి భయపడవద్దని, పరీక్షకు పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యేవారు 50 శాతం మందే ఉంటారని నిపుణుల అంచనా. పోటీ పరీక్షకు హాజరు శాతం, అర్హత సాధించిన వారి సంఖ్య బట్టి అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఆశావహ దృక్పథంతో సమయాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్ష రాస్తే విజయం మీదే. భయాన్ని వీడి నిర్భయంగా పరీక్ష రాసి పంచాయతీ కార్యదర్శిగా కొలువుతీరాలని ఆశిస్తున్నాం. సమయమే కీలకం పరీక్షలకు మరో రోజు మాత్రమే సమయం ఉంది. ఇదే అత్యంత కీలకమైంది. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రీవియస్ మోడల్ పేపర్లను సరిచూసుకోవాలి. ఇది వరకూ చదువుకున్న అంశాలను రివిజన్ చేయాలి. బృంద చర్చలు చేస్తే బాగుంటుంది. చదివే సమయంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. పరీక్ష రోజు ఉదయం సాధ్యమైనంత వరకూ చదవకుండా ఉంటేనే మంచిది. పరీక్షా కేంద్రంలో ప్రశ్నలకు అనుగుణంగా సమయం కేటాయించుకోవాలి. పరీక్ష చివరి సమయంలో తొందర పడుతూ సమాధానాలు గుర్తించ వద్దు. పరీక్షల నిర్వహణపై సమీక్ష విశాఖ రూరల్: జిల్లాలో ఈ నెల 23న జరిగే పంచాయతీ కార్యదర్శుల పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదేశించారు. శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ప్రశ్న పత్రాలు లీకు కాకుండా జాగ్రత్త వహించాలని, అటువంటి సంఘటనలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లా పరిషత్ సీఈఓ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఓఎంఆర్ షీట్లు నింపేటప్పుడు పొరపాట్లు జరిగితే ఆఫీసర్ తిరస్కరిస్తారని తెలిపారు. అభ్యర్థి ఓఎంఆర్ షీటు సరిగా నింపినది, లేనిది ఇన్విజిలేటర్ సరిచూడాలన్నారు. పేపర్-1లో... జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యతాంశాలుంటాయి. కరెంట్ అఫైర్సు(స్థానిక, జాతీయ, అంతర్జాతీయ), శాస్త్ర సాంకేతిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో ప్రస్తుత అభివృద్ధి, భారత ఆధునిక చరిత్ర (ప్రత్యేకించి జాతీయ ఉద్యమం), స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకూ దేశార్థికాభివృద్ధి, తార్కిక విషయ పరిజ్ఞానం (లాజికల్ రీజనింగ్), విశ్లేషణాత్మక సామర్థ్యం (ఎబిలిటీ), విపత్తుల నిర్వహణ సాధారణ అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశాలున్నాయి. పేపర్-2 గ్రామీణాభివృద్ధిలో ప్రజారోగ్యం, పారిశుధ్యంలో పాత్ర, సంక్రమిత వ్యాధులు, నివారణ, ఆరోగ్యకరమైన జీవన విధానం, సామాజిక సంఘర్శన, అణగారిన వర్గాల సమస్యలు, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ (ప్రజాస్వామిక సంస్థలు, పంచాయతీరాజ్ వ్యవస్థ, సహకార పరపతి సంఘాలు, గ్రామీణ వికాసంలో వీటి పాత్ర, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, గ్రామీణాభివృద్ధిలో శాస్త్ర శాంకేతిక పాత్ర, శ్రమ పొదుపునకు ఉపయుక్తమైన ఆధునిక పరకరాలు, గణాంక శాస్త్రంపై ప్రశ్నలుంటాయి. ఎంపిక విధానం అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష డిగ్రీ స్థాయిలో ఆబ్జెక్టివ్ మల్టీపుల్చోయస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్-1 జనరల్ స్టడీస్, సాధారణ విషయ పరిజ్ఞానం. పేపర్-2 గ్రామీణాభివృద్ధి, గ్రామ సమస్యలు (ఆంధ్రాకు సంబంధించి)పై ఉంటాయి. పేపర్-1, పేపర్-2కు రెండున్నర గంటలు చొప్పున్న సమయం కేటాయించారు. ఒక్కో పేపరుకు 150 ప్రశ్నలకు 150 మార్కులుంటాయి. రెండు పేపర్లు కలిపి మొత్తం 300 మార్కులకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. పాటించాల్సిన సూచనలు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగానే హాల్‌టిక్కెట్ డౌన్లోడ్ చేసుకొని సరిచూసుకోవాలి. ఫొటో సరిగ్గా ఉందో లే దో గమనించాలి. సరిగ్గా కనిపించక పోతే గజిటెడ్ అధికారితో సంతకం చేయించిన మూడు పాస్ ఫొటోలను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. రెండు బాల్ పెన్నులు, పరీక్ష ప్యాడ్ వెంట పట్టుకెళ్లాలి. గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఇప్పటి వరకూ ఓఎంఆర్ పత్రంలో సమాధానం రాయని వారు హాల్‌టిక్కెట్‌తో పాటు వచ్చిన నమూనా పత్రాన్ని పరిశీలించాలి. తెలుగు, ఆంగ్లం అ భ్యర్థులకు ఒకే ప్రశ్న పత్రం ఉంటుంది. ఎవరి మాధ్యమం ప్రకారం వారు ప్రశ్నలు చదవాలి. లేదంటే పరీక్షల్లో కీలకమైన సమయం వృథా అవుతుంది. -
ఇక పర్మినెంట్
192 మంది పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ ఆమోదించిన జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు సిద్ధం చేస్తున్న అధికారులు డిగ్రీ విద్యార్హతే ప్రామాణికం 15 వేల నిరుద్యోగ అభ్యర్థులకు మిగిలేవి 6 పోస్టులే ! సాక్షి, సంగారెడ్డి: కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త. చాలీచాలని వేతనాలతో ఏళ్ల తరబడి ఊడిగం చేస్తున్న ‘కాంట్రాక్టు’ ఉద్యోగులు ఎట్టకేలకు పర్మినెంట్ అయ్యారు. డిగ్రీ విద్యార్హత కలిగిన 192 మంది కాంట్రాక్టు కార్యదర్శులను క్రమబద్దీకరిస్తూ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం అధికారులు ఉద్యోగుల క్రమబద్దీకరణ ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో కాంట్రాక్టు కార్యదర్శుల చేతికి ఈ ఉత్తర్వులు అందనున్నాయి. కాంట్రాక్టు కార్యదర్శుల గత సర్వీసు కాలాన్ని పరిగణలోకి తీసుకోకుండా కొత్తగా ఉద్యోగంలో చేరినట్లు సర్వీసును లెక్కించనున్నారు. క్రమబద్దీకరణ తర్వాత వీరికి రూ.7,520-రూ.22,430 పే స్కేల్ అమలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యూనల్ మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా క్రమబద్దీకరణ తంతు పూర్తి చేసినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 204 మంది కాంట్రాక్టు కార్యదర్శులు పనిచేస్తుండగా వారిలో డిగ్రీ విద్యార్హత కల్గిన వారు 192 మందిని పర్మినెంట్ చేశారు. ఇక ఇంటర్ విద్యార్హత గల మిగిలిన 12 మందిని విధుల తొలగించకుండా కాంట్రాక్టు ప్రాతిపదికన కొనసాగిస్తామని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. భవిష్యత్తులో వారు డిగ్రీ విద్యార్హత సాధిస్తే ఉద్యోగాన్ని క్రమబద్దీకరించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. మిగిలినవి ఆ..రు పదిహేను వేల మందికి పైగా అభ్యర్థులు.. పోస్టులేమో ఆరు !. ప్రస్తుతం ఈ విచిత్ర పోటీ పంచాయతీ కార్యదర్శుల భర్తీలో ఏర్పడింది. 210 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్ 31న జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేయగా, గడువులోగా 15,432 దరఖాస్తులొచ్చిన విషయం తెలిసిందే. ట్రిబ్యూనల్ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం..డిగ్రీ అర్హత గల 192 కాంట్రాక్టు కార్యదర్శుల క్రమబద్దీకరించడంతో పాటు ఇంటర్ అర్హత గల 12 మంది కార్యదర్శుల పోస్టులను ఎవరికీ కేటాయించకుండా తుది ఆదేశాలు విడుదలయ్యే వరకు రిజర్వు చేసి పెట్టనున్నారు. ఎంటెక్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ తదితర ఉన్నత విద్య కోర్సులు చదివిన వేల మంది నిరుద్యోగుల పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-4) పోస్టుల కోసం అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారు. 210 పోస్టుల్లో 204 పోస్టులు కాంట్రాక్టు కార్యదర్శులకు పోగా..ఇక నిరుద్యోగ అభ్యర్థులకు 6 పోస్టులు మాత్రమే మిగిలాయి. మెరిట్ ప్రాతిపదికన ఈ ఆరు పోస్టులను నిరుద్యోగ అభ్యర్థులతో భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు. -
జేబుకు చిల్లు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు సంబంధించి సర్కారు మాట మార్చింది. కేవలం కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే కార్యదర్శులకే అవకాశం కల్పించాలంటూ ఆదేశించింది. ఈ మేరకు సోమవారం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేకంగా ఓ మెమోను జారీ చేశారు. ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలంటూ జిల్లా పంచాయతీ అధికారికి స్పష్టం చేశారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. జిల్లాలో 122 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు గత ఏడాది నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కేవలం డిగ్రీలో ఉత్తీర్ణత మార్కుల శాతం అధారంగా ఎంపిక ప్రక్రియ చేపడుతున్నామని, ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే కార్యదర్శులకు 25శాతం వెయిటేజీ కల్పిస్తున్నామని ఆ నోటిఫికేషన్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో దాదాపు 5,400 మంది నిరుద్యోగులు రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. అర్హతలు పరిశీలించి మెరిట్ జాబితా రూపకల్పనలో తలమునకలైన జిల్లా యంత్రాంగం గత వారం ఉద్యోగానికి ఎంపికైన వారి జాబితా విడుదల చేసింది. ఇందులో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న 100 మంది కార్యదర్శులు ఎంపిక కాగా.. మరో 20 మంది కొత్తవాళ్లు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఎంపికైన అభ్యర్థులు మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంది. అయితే సర్కారు తాజా ఉత్తర్వులతో పరిశీలన ప్రక్రియ తలకిందులైంది. పరిశీలన ప్రక్రియ నిరవధికంగా వాయిదా పడింది. తాజా ఉత్తర్వుల్లో... ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వుల్లో.. కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వారినే ఎంపిక చేయాలని ఆదేశించింది. దీంతో కొత్తగా ఎంపికైన 20 మంది భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. కొత్త నిబంధనలతో వారికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదు. గత వారం విడుదల చేసిన ఎంపిక జాబితాలో వారి పేర్లు ఉండడంతో ఉద్యోగం గ్యారంటీ అని భావించిన వారికి.. తాజా ఉత్తర్వులు మెండిచెయ్యిని చూపినట్లైంది. ఇదిలా ఉండగా.. మెరిట్ ఆధారంగా ఉద్యోగాలనడంతో వేల మంది అభ్యర్థులు స్వతం ఖర్చులతో జిల్లా పంచాయతీ కార్యాలయానికి వచ్చి మరీ దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మాట మార్చడంతో వారి జేబుకు చిల్లు పడడం తప్ప ఒరిగిందేమీ లేదని స్పష్టమవుతోంది. -
కార్యదర్శుల జాబితా విడుదల
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఎట్టకేలకు పంచాయతీ కార్యదర్శి పోస్టుల మెరిట్ జాబితా ఖరారైంది. కలెక్టర్ బి.శ్రీధర్ ఆమోదం తెలపడంతో బుధవారం అర్హుల జాబితాను జిల్లా యంత్రాంగం వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. గతేడాది నవంబర్‌లో జిల్లాలోని 122 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టినప్పటికీ.. ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న కార్యదర్శులకు 25శాతం వెయిటేజీ ఇచ్చారు. దీంతో భారీగా దరఖాస్తులు వచ్చినప్పటికీ.. వెయిటేజీ నేపథ్యంలో కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులే ఎక్కువగా ఎన్నికయ్యారు. కేవలం డిగ్రీ మార్కుల ఆధారంగా 20మంది అర్హత సాధించగా, 100 మంది కాంట్రాక్టు కార్యదర్శులు ఎంపికయ్యారు. మరో రెండు పోస్టులు అభ్యర్థులు లేకపోవడంతో ఖాళీగా ఉన్నాయి. వాస్తవానికి డిసెంబర్ ఆరో తేదీన ఈ జాబితా ప్రకటించాల్సిఉండగా.. పలువురు కాంట్రాక్టు కార్యదర్శులు కోర్టును ఆశ్రయించారు. దీంతో జాబితా విడుదలపై న్యాయ సలహా కోసం ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జాబితా విడుదలలో తాత్సారం జరిగినట్లు తెలిసింది. తాజాగా ఈ అంశంపై స్పష్టత రావడంతో బుధవారం జాబితాను విడుదల చేశారు. మెరిట్ జాబితాలో ఉన్న వారు ఈ నెల 7వ తేదీన ఉదయం 10.30గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి డీపీఓ వరప్రసాద్‌రెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. మెరిట్ జాబితా కోసం: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. రంగారెడ్డి.ఏపీ.జీఓవీ.ఇన్ -
పంచాయతీ పోస్టులు 133
సాక్షి, నల్లగొండ :పల్లెల్లో పంచాయతీ కార్యదర్శుల కొరత త్వరలో తీరనుంది. పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో ఆశ చిగురిస్తోం ది. జిల్లాలో మొత్తం 133 పోస్టులను భర్తీ చేయనున్నారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 20వ తేదీ ఆఖరి గడువు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేయాల్సి ఉం టుంది. రాత పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహిస్తారు. 18 ఏళ్ల వయస్సు నుంచి ఈ ఏడాది జూలై నాటికి 36 ఏళ్లు దాటని అభ్యర్థులు అర్హులని నోటిఫికేషన్లో సర్కారు పేర్కొంది. ఏదేని డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఓపెన్‌లో 59, బీసీలో 36, ఎస్సీ 20, ఎస్టీ 9, వికలాంగులు 5, మాజీ సైనికుల విభాగాల్లో 4 పోస్టులు ఉన్నాయి. అదనంగా.... జిల్లాలో 1169 గ్రామ పంచాయతీలను 573 క్లస్టర్లుగా విభజించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక కార్యదర్శి అవసరం. అయితే జిల్లాలో దాదాపు 410 మంది కార్యదర్శులు మాత్రమే పనిచేస్తున్నారు. ఇప్పటికే కాం ట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న 38 కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయడానికి మూడు నెలల క్రితం నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అందుకు వీరికి 25 మార్కుల వెయిటేజీ కల్పించింది. కాంట్రాక్టు కార్యదర్శులతోపాటు ఇతర అభ్యర్థులు కూడా పెద్ద సం ఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తుదారుల అభ్యంతరాల స్వీకరణ సోమవారంతో ముగిసింది. ఇవిగాక తాజా నోటిఫికేషన్ ద్వారా 133 పోస్టులు భర్తీ కానున్నాయి. దరఖాస్తులు, ఖాళీల వివరాలు, పరీక్ష సమయం తదితర వివరాల కోసం ఠీఠీఠీ. ్చఞటఞటఛి.జౌఠి.జీలో చూడవచ్చు. రిజర్వేషన్ ఇలా... కేటగిరి జనరల్ మహిళ ఓసీ 38 21 బీసీ -ఏ 7 3 బీసీ - బీ 7 5 బీసీ - సీ 2 - బీసీ -డీ 5 3 బీసీ - ఈ 3 1 ఎస్సీ 13 7 ఎస్టీ 6 3 వికలాంగ 3 2 మాజీ సైనికులు 2 2 మొత్తం 86 47 -
మరో శుభవార్త
ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సోమవారం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా 2,677 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొనగా...ఏజిల్లాలో ఎన్ని పోస్టులు అనే అంశం లేకపోవడంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన మొదలైంది. జనవరి 4 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరణ, 20 వ తేదీ వరకు రాత పరీక్ష ఫీజు చెల్లించాలని నోటిఫికేషన్లో వెల్లడించారు. ఫిబ్రవరి 23 న రాత పరీక్ష నిర్వహించనున్నారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ మినహా ఇతర అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100గా నిర్ణయించారు. అభ్యర్థులు 18 నుంచి 36 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలని, జీతం 7,520 నుంచి 22,430 వరకు ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 758 పంచాయతీలను 587 కస్టర్లుగా విభజించారు. వీటిలో గ్రేడ్ 4 కార్యదర్శుల పోస్టులు 91కి గానూ 34 మంది పనిచేస్తున్నారు. అలాగే జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిపై ఇప్పటికే 26 మంది అభ్యర్థులు పనిచేస్తున్నారు. గత నవంబర్ 30 న జిల్లాలో 26 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి 4,448 దరఖాస్తులు వచ్చాయి. ఈ 26 పోస్టులలో 23 పోస్టులు కాంట్రాక్టు ఉద్యోగులకు దక్కనున్నా యి. మిగిలిన 3 పోస్టులు మెరిట్ ప్రకారం అభ్యర్థులకు దక్కనున్నాయి. తాజా నోటిఫికేషన్‌తో 31 పోస్టులు నింపే అవకాశం ఉంది. ఈ ఎంపికకు మొత్తం 100 మార్కులు కేటాయించనున్నారు. రాత,మౌఖిక పరీక్షలు లేకుండా డిగ్రీలో మెరిట్,రోస్టర్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఈ పోస్టులను ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచనలో కొందరు అభ్యర్థు లు ఇప్పటికే మధ్యవర్తులను ఆశ్రయించారు. మరికొందరు అధికార పార్టీ నేతలను కూడా కలిసి పోస్టులు దక్కించుకోవాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. దళారులొస్తున్నారు.... ఇటీవలనే వీఆర్ఓ, వీఆర్ఏ నోటిఫికేషన్ వెలువడడం, తాజాగా పంచాయతీ కార్యదర్శుల పోస్టులను కూడా భర్తీ చేస్తుండడంతో దళారులు రంగంలోకి దిగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది మం ది నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పడుతుండడంతో దళారులు తమకు ఫలానా జిల్లా అధికారి తెలుసు అని డబ్బులు దండుకునే యత్నాల్లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దరఖాస్తులు , పరీక్ష , ఫలితా ల పక్రియ అంతా రెండు నెలలోనే ముగుస్తుండడంతో దళారులు అధికారుల పేరు చెప్పుకొని నిరుద్యోగులను ఆకర్షించే పనిలో పడ్డా రు. ఖమ్మం,కొత్తగూడెం లో వసూళ్ల పర్వం మొదలైనట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం దళారులను నమ్మవద్దని, అంతా పారదర్శకంగా నిర్వహిస్తామని చెబుతున్నారు. -
పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీపై సందిగ్ధం
పంచాయతీ కార్యదర్శుల ఎంపిక ప్రక్రియకు న్యాయపరమైన చిక్కు లు ఎదురవుతున్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు పలువురు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టేటస్కో ఉత్తర్వులు తెచ్చుకున్నా రు. ఈ క్రమంలో నియామక ప్రక్రియకు అంతరాయం కలిగే సూచన లు కనిపిస్తున్నాయి. పోస్టుల భర్తీపై అధికారులు డైలమాలో పడ్డారు. సాక్షి, చిత్తూరు: జిల్లాలో 265 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సుమారు నెల క్రితం నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం 15,462 దరఖాస్తులు వచ్చాయి. అయితే నియామక ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇప్పటి వరకు దరఖాస్తుల కంప్యూటరీకరణ మాత్రమే పూర్తయింది. ఈ వివరాలను ఎంపిక కమిటీ(డీఎస్సీ) ముందు ఉంచి, ఈ నెల 5వ తేదీకే నియామక ప్రక్రియను ప్రారంభించాల్సి ఉం ది. అయితే న్యాయపరమైన, సాంకేతిక కారణాలతో పోస్టుల భర్తీకి సంబంధించి ఒక్క అడుగూ ముందుకు సాగలేదు. అత్యున్నత విద్యార్హతలు పంచాయతీ కార్యదర్శుల పోస్టులపై నిరుద్యోగులు భారీగానే ఆశలు పెంచుకున్నారు. అభ్యర్థుల నుంచి 15,462 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల్లో ఎంఏ, ఎంఫిల్, బీటెక్, ఎంటెక్ చదివిన వారూ ఉన్నారు. ప్రాథమికంగా గ్రాడ్యుయేషన్ మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్టేటస్ కో ఉత్తర్వుల జారీ పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. తొలుత 22 మంది ఇన్‌సర్వీసు పంచాయతీ కాంట్రాక్టు కార్యదర్శులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. తాము పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి పోస్టుకు నియామక ప్రక్రియ చేపట్టరాదని, యధాతథస్థితి కొనసాగించాలని ఆదేశాలు తెచ్చుకున్నారు. వీరి పిటిషన్ల ఆధారంగా మరో 158 మంది తమ పోస్టులు భర్తీ చేయకుండా స్టేటస్కో ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీంతో జిల్లాలో ఖాళీగా ఉన్న 265 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్లో 170 పోస్టులకు స్టేటస్ కో ఉత్తర్వులు వచ్చినట్లు అయింది. పోస్టుల భర్తీకి సంబంధించి కలెక్టర్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ క్రమంలో మొత్తం ఎంపిక ప్రక్రియనే ఆపేయాలా లేదా 170 పోస్టులకు మాత్రమే నియామక ప్రక్రియ నిలిపివేయాలా అనే అంశాన్ని జిల్లా పంచాయతీ అధికారులు తేల్చుకోలేక పోతున్నారు. -
మూడు లకారాలుంటే...పోస్టు మీదే!
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ :జిల్లాలో ఖాళీగా ఉన్న 158 గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సంబంధించి దళారులు రంగంలోకి దిగారు. నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీక రించే ఘట్టం శుక్రవారంతో ముగియడంతో బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఇళ్లను వెతుక్కుంటూ వెళ్లి మరీ బేరాలు కుదుర్చుకునే పనిలో దళారులు పడ్డారు. 158 పోస్టుల భర్తీకి సంబంధించి చివరి తేదీ ఈ నెల 15 సాయంత్రం 5 గంటల వరకు వచ్చిన దరఖాస్తులు తొమ్మిది వేలకు పైగా ఉంటాయని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష కాని.. మౌఖిక పరీక్ష కానీ నిర్వహించకపోవడంతో ప్రతిఒక్కరూ ఆశపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పైరవీలా ద్వారానైనా పోస్టు దక్కించుకునేందుకు పావులుకదుపుతున్నారు. అయితే మొత్తం పోస్టుల్లో 136 వరకు 25 శాతం వెయిటేజీ ఉన్న ఇన్‌సర్వీస్ (కాంట్రాక్ట్) కార్యదర్శులకే దక్కనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే మిగిలిన 22 పోస్టుల కోసం నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పడవలసి ఉంటుంది. ఇందులో డిగ్రీలో అత్యధిక మార్కుల సాధించిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు కులాల వారీగా పోస్టుల కేటాయింపులుంటాయని డీపీఓ చెబుతున్నారు. ఈ తతంగం తెలియని నిరుద్యోగ అభ్యర్థులు మాత్రం ఉద్యోగం వస్తుందనే ఆశతో దళారుల వలలో పడుతున్నారు. జోరుగా పైరవీలు... ఎన్నో ఏళ్లుగా భర్తీకి నోచుకోని పంచాయతీ కార్యదర్శులు పోస్టులను ఎట్టకేలకు ప్రభుత్వం పూర్తి చేస్తుండడంతో నిరుద్యోగ యువ త ఆ పోస్టులు దక్కించుకునేందుకు తాపత్రాయపడుతున్నారు. పోస్టులు తక్కువ, పోటీ ఎక్కువగా ఉండడంతో అభ్యర్థుల్లో ఆత్రుత మరింత పెరిగింది. సొంత జిల్లాలో ఉద్యోగం కావడంతో పోస్టు ఎలాగైనా దక్కించుకోవాలనే ఆశతో ఇప్పటికే రాజకీయ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని బడా నేతలతో పాటు మండల, గ్రామ స్థాయి నేతల ఇళ్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయితే వారి వద్దకే మిగిలిన అభ్యర్థులు కూడా క్యూ కడుతుండడం చూస్తున్న కొందరు కీలకవ్యక్తులు దళారులుగా అవతారమెత్తుతున్నారు. తాము పెద్ద నాయకులతో మాట్లాడి పోస్టులు ఇప్పిస్తామంటూ బేరసారాలు సాగిస్తున్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియ ఈ నెలాఖరుతో పూర్తికానుండడంతో మూడు లకారాల వరకు ఖర్చవుతుందంటూ బేరసారాలు జోరుగా కానిస్తున్నారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. కొందరు దళారులయితే ఎక్కువ మార్కులు కలిగి ఉండి రిజర్వేషన్ ఉన్న వారి ఇళ్లను వెతుక్కుంటూ వెళ్లి మరి వారిని ప్రలోభపెడుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ ప్రక్రియ మాత్రం దళారులకు కాసుల వర్షం కురిపిస్తోందనడంలో సందే హం లేదు. -
పోస్టులు..122 దరఖాస్తులు..5,800
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పంచాయతీ కార్యదర్శుల (గ్రేడ్-4) ఉద్యోగాల దరఖాస్తుల గడువు శనివారం ముగిసింది. జిల్లావ్యాప్తంగా 122 కార్యదర్శుల పోస్టుల భర్తీకి జిల్లా యంత్రాంగం ఈ నెల ఐదో తేదీన నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో అభ్యర్థులు కార్యదర్శి పోస్టుల కోసం ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు సమర్పించారు. వారం రోజులుగా నాంపల్లిలోని డీపీఓ కార్యాలయం దరఖాస్తుదారులతో సందడి సందడిగా మారింది. మొత్తం 6,500 దరఖాస్తులు అమ్ముడుపోగా.. వీటిలో గడువు ముగిసే సమయానికి 5,800 దరఖాస్తులను అభ్యర్థులు సమర్పించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈనెల 26న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం.. డిసెంబర్ 2న కలెక్టర్ నేతృత్వంలోని అభ్యర్థుల జాబితాను ఎంపిక చేస్తుంది. మరుసటి రోజు జాబితాను ప్రకటిస్తారు. నాలుగో తేదీన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీచేయనున్నారు. -
పంచాయతీ కార్యదర్శుల భర్తీకి రంగం సిద్ధం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : నిరుద్యోగులకు శుభవార్త.. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి మూడు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందుకు శాఖా పరమైన కసరత్తును అధికారులు పూర్తిచేశారు. మొత్తం 135 పోస్టుల భర్తీకి కలెక్టర్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం విడుదల చేసే నోటిఫికేషన్లో ఇంతకాలం కాంట్రాక్ట్ పద్ధతిలో కార్యదర్శులుగా పనిచేసిన వారికి వెయిటేజీ ఇవ్వనున్నట్లు సమాచారం. కాంట్రాక్ట్ కార్యదర్శులను నేరుగా రెగ్యులర్ చేసేందుకు నిబంధనలు అంగీకరించనందున.. నూతన నియామకాల పేరుతో వారిని రెగ్యులర్ చేసే యోచనతో ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిసింది. వీరితోపాటు ప్రతిభ ఆధారంగా కొత్తవారికి కూడా అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతం జిల్లాలోని 962 పంచాయతీలకు 350 మంది కార్యదర్శులు ఉన్నారు. వీరిలో 124 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. మిగతావారు రెగ్యులర్ ఉద్యోగులుగా ఉన్నారు. ప్రకటన వెలువడితే.. ప్రస్తుత కాం ట్రాక్ట్ ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవాలి. వారికి సీనియారిటీ ప్రకారం వెయిటేజీ ఇస్తారు. మిగిలిన పోస్టులకు మెరిట్ ఆధారంగా.. దరఖాస్తు చేసుకున్న వారిని ఎంపిక చేయనున్నారు. డీఎస్సీ ద్వారా ఎంపిక ప్రక్రియ జిల్లాలో అధికారులు ఖాళీగా ఉన్నట్లు చూపుతున్న 135 పోస్టులకు డీఎస్సీ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. కలెక్టర్ చైర్మన్‌గా, జెడ్పీ సీఈఓ, డీపీఓలు కన్వీనర్, మెంబర్‌గా ఉంటారు. డిగ్రీ విద్యార్హతగా నిర్ణయించి దరఖాస్తులు తీసుకుంటారు. డిగ్రీ మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. అయితే వెయిటేజీ ఇచ్చినా... ఎంపిక కాని కాంట్రాక్ట్ కార్యదర్శుల పోస్టులు కూడా కొత్త వారితో భర్తీచేసే అవకాశం ఉంది. మొత్తంగా సోమవారం నాటికి ఈ నోటిఫికేషన్ వెలువడనున్నటు ్లవిశ్వసనీయ సమాచారం.