సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పంచాయతీ కార్యదర్శుల (గ్రేడ్-4) ఉద్యోగాల దరఖాస్తుల గడువు శనివారం ముగిసింది. జిల్లావ్యాప్తంగా 122 కార్యదర్శుల పోస్టుల భర్తీకి జిల్లా యంత్రాంగం ఈ నెల ఐదో తేదీన నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో అభ్యర్థులు కార్యదర్శి పోస్టుల కోసం ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు సమర్పించారు.
వారం రోజులుగా నాంపల్లిలోని డీపీఓ కార్యాలయం దరఖాస్తుదారులతో సందడి సందడిగా మారింది. మొత్తం 6,500 దరఖాస్తులు అమ్ముడుపోగా.. వీటిలో గడువు ముగిసే సమయానికి 5,800 దరఖాస్తులను అభ్యర్థులు సమర్పించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈనెల 26న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం.. డిసెంబర్ 2న కలెక్టర్ నేతృత్వంలోని అభ్యర్థుల జాబితాను ఎంపిక చేస్తుంది. మరుసటి రోజు జాబితాను ప్రకటిస్తారు. నాలుగో తేదీన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీచేయనున్నారు.
పోస్టులు..122 దరఖాస్తులు..5,800
Published Sat, Nov 16 2013 11:55 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement