- తాగునీటి సరఫరాపై శ్రద్ధ చూపండి
- పనిచేయని పంచాయతీ కార్యదర్శులపై నివేదికలు ఇవ్వండి
- మీ కోసంలో కలెక్టర్ బాబు.ఎ
చిలకలపూడి : ఆదేశాలు ఇస్తే సరిపోదు.. పనులు జరిగేలా చూడాలని కలెక్టర్ బాబు.ఏ అన్నారు. కలెక్టరేట్ సమావేశ హాలులో సోమవారం మీ కోసం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ చంద్రుడు, డీఆర్వో ప్రభావతిలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. పీహెచ్‌సీల్లో రూ.లక్షలు ఖర్చు పెట్టి ఇటీవలే కొత్త పరికరాలు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. కొన్ని పీహెచ్‌సీల్లో పరికరాలు వాడటం లేదని తన దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై డీఎంహెచ్‌వో ఆర్ నాగమల్లేశ్వరీని ఆయన ప్రశ్నించారు. ఆమె ఆదేశాలు ఇచ్చామని కలెక్టర్‌కు వివరించారు.
పీహెచ్‌సీల్లో ఫిజియోథెరపీ పరికరాలు ఉపయోగించటం లేదని వైద్యాధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించి పనిచేసేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. పెంటావలెంట్ వ్యాక్సిన్‌పై మండల ప్రత్యేకాధికారులు తనిఖీలు చేయాలన్నారు. గత వారం వీడియో కాన్ఫరెన్స్‌లో ఐసీడీఎస్, వైద్యాధికారులకు ఇంద్రధనుష్, ప్రసూతిలపై నివేదికలు ఇవ్వాలని చెప్పినా ఇంతవరకు ఎవ్వరూ తనకు పంపలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో 30 వేల మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోందని, ఇంకా 1.20 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. దశలవారీగా లబ్దిదారులకు ఆన్‌లైన్‌లోనే సొమ్ము చెల్లించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ అమృతహస్తం లో కొన్నిమార్పులు చేశారని వాటిని సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మార్పులు ఆయా మండలాల ప్రత్యేకాధికారులకు తెలియజేయాలని ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారికి కలెక్టర్ సూచించారు. జిల్లాలో మీ-సేవా కేంద్రాలు ఏర్పాటుకు కొందరు దరఖాస్తు చేసుకున్నారని ప్రత్యేకాధికారులు నివేదికలు ఇవ్వాలన్నారు. ఈ-ఆఫీస్ ఇప్పటివరకు 568 సిబ్బందికి మూడు విడతలుగా శిక్షణ ఇచ్చారని తెలిపారు. ్వటం జరిగిందన్నారు. మిగిలిన శాఖల సిబ్బందికి కూడా ఈ వారంలో శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు.
డ్వామా సిబ్బందికి కలెక్టర్ ఆగ్రహం..
డ్వామా కార్యాలయ సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం ఈ-ఆఫీస్‌లో భాగంగా డ్వామా సిబ్బందికి శిక్షణ ఇచ్చారని తెలిపారు. నేటి వరకు ఈ-ఆఫీస్‌లో ఒక్క ఫైల్ లాగిన్ అవ్వలేదని ఇన్‌చార్జి డ్వామా పీడీ సుమలతను కలెక్టర్ ప్రశ్నించారు. తమ సిబ్బందికి డిజిటల్ సిగ్నేచర్స్ రాలేదని తెలిపారు. 25 మందికి గాను ఇప్పటివరకు 17 మందికి డిజిటల్ సిగ్నేచర్స్ వచ్చాయని, అబద్దాలు చెప్పటం మీ శాఖలో సిబ్బందికి అలవాటైపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో ఈ-ఆఫీస్‌లోనే పరిపాలన సాగించాలని అలా సాగించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నా..
ఏసీబీ దాడిలో పట్టుబడ్డ డీపీవో నాగరాజువర్మ వార్త విన్నవెంటనే తాను ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నానని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఇటువంటి అధికారులు ఎవరైనా ఉంటే వారి ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు. ఆయా మండలాల ప్రత్యేకాధికారులు పంచాయతీ కార్యదర్శులపై ప్రత్యేక నిఘా పెట్టాలని, పనిచేయని వారిపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖరరాజు, డీఎస్‌వో వి.రవికిరణ్, సీపీవో వైబీఎన్ శర్మ, సాంఘిక సంక్షేమశాఖ డీడీ మధుసూదనరావు, హౌసింగ్ ఇన్‌చార్జి పీడీ శరత్‌బాబు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ ఎన్‌వీవీ సత్యనారాయణ, సర్వేశాఖ ఏడీ విజయకుమార్, బందరు ఆర్డీవో సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఆదేశాలు ఇస్తే సరిపోదు.. పనులు చేయించాలి
Published Tue, May 12 2015 2:07 AM | Last Updated on Thu, Mar 21 2019 8:23 PM
Advertisement