నీటి పథకాల్లో ప్రగతి లోపిస్తే ఇంక్రిమెంట్‌లో కోత
కర్నూలు(అగ్రికల్చర్): తాగునీటి పథకాల నిర్మాణంలో నిర్లక్ష్యం జరుగుతోంది. ఇలా అయితే వేసవిలో నీటి సమస్యను ఎదుర్కోవడం కష్టం. మరో 15 రోజుల్లో ప్రగతి చూపకపోతే చర్యలు తీసుకుంటాం.. ఇంక్రిమెంట్లు కట్ చేస్తాం.. అభియోగాలు నమోదు(చార్జెస్ ఫ్రేమ్) చేస్తామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో నీటి పథకాల నిర్మాణంలో ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. నిధులు ఉన్నా పథకాల నిర్మాణాలను చేపట్టడంలో జరుగుతున్న నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఎస్‌డీపీ, గ్రామీణ నీటి సరఫరా పథకం కింద చేపట్టిన పనులను సమీక్షించారు. బహిరంగ మల విసర్జన లేని గ్రామాలను తీర్చిదిద్దడంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణంలో పురోగతి చూపకపోతే చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఘీ, ఇఇ, డీఇలు పాల్గొన్నారు.