గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా చేసుకోవాలి
Published Sat, Sep 10 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
ఏలూరు అర్బన్ : గణేశ్ నిమజ్జనోత్సవాలను జిల్లా వాసులు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ భాస్కర్‌భూషణ్ సూచించారు. ఆయన శుక్రవారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వాసులు చట్టాలను గౌరవిస్తారనే మంచిపేరు ఉందని చవితి వేడుకలు ఆనందంగా ప్రశాం తంగా ముగించడం ద్వారా దానిని మరోమారు నిరూపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా పలువురు ఫోన్ చేసి ఇబ్బందులను ఎస్పీకి వివరించారు. ఏలూరు నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి నగరంలో పేకాటలు యథేచ్ఛగా సాగుతున్నాయని వివరించారు. పెనుమంట్ర నుంచి ఓ మహిళ ఫోన్ చేసి ఓ కానిస్టేబుల్ ప్రేమ పేరుతో మోసం చేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. పెరవలి నుంచి మరో వ్యక్తి ఫోన్ చేసి రోడ్లపై ఆటోలను అడ్డదిడ్డంగా నిలుపుతున్నారని, లౌడ్‌స్పీకర్లు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ద్వార కాతిరుమల నుంచి కొంతమంది ఫోన్ చేసి గ్రామంలో కోడిపందేలు యథేచ్ఛగా సాగుతున్నాయని వివరించారు. ఇంకా పలువురు ఆటోవాలాల ఆగడాలపై ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎస్పీ ఆటోవాలాల ఆగడాలపై తరుచూ ఫిర్యాదు వస్తున్నాయని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Advertisement