కలెక్టరేట్, న్యూస్‌లైన్ : నిరుద్యోగులకు శుభవార్త.. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి మూడు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందుకు శాఖా పరమైన కసరత్తును అధికారులు పూర్తిచేశారు. మొత్తం 135 పోస్టుల భర్తీకి కలెక్టర్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం విడుదల చేసే నోటిఫికేషన్‌లో ఇంతకాలం కాంట్రాక్ట్ పద్ధతిలో కార్యదర్శులుగా పనిచేసిన వారికి వెయిటేజీ ఇవ్వనున్నట్లు సమాచారం.
కాంట్రాక్ట్ కార్యదర్శులను నేరుగా రెగ్యులర్ చేసేందుకు నిబంధనలు అంగీకరించనందున.. నూతన నియామకాల పేరుతో వారిని రెగ్యులర్ చేసే యోచనతో ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిసింది. వీరితోపాటు ప్రతిభ ఆధారంగా కొత్తవారికి కూడా అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతం జిల్లాలోని 962 పంచాయతీలకు 350 మంది కార్యదర్శులు ఉన్నారు. వీరిలో 124 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. మిగతావారు రెగ్యులర్ ఉద్యోగులుగా ఉన్నారు. ప్రకటన వెలువడితే.. ప్రస్తుత కాం ట్రాక్ట్ ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవాలి. వారికి సీనియారిటీ ప్రకారం వెయిటేజీ ఇస్తారు. మిగిలిన పోస్టులకు మెరిట్ ఆధారంగా.. దరఖాస్తు చేసుకున్న వారిని ఎంపిక చేయనున్నారు.
డీఎస్సీ ద్వారా ఎంపిక ప్రక్రియ
జిల్లాలో అధికారులు ఖాళీగా ఉన్నట్లు చూపుతున్న 135 పోస్టులకు డీఎస్సీ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. కలెక్టర్ చైర్మన్‌గా, జెడ్పీ సీఈఓ, డీపీఓలు కన్వీనర్, మెంబర్‌గా ఉంటారు. డిగ్రీ విద్యార్హతగా నిర్ణయించి దరఖాస్తులు తీసుకుంటారు. డిగ్రీ మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. అయితే వెయిటేజీ ఇచ్చినా... ఎంపిక కాని కాంట్రాక్ట్ కార్యదర్శుల పోస్టులు కూడా కొత్త వారితో భర్తీచేసే అవకాశం ఉంది. మొత్తంగా సోమవారం నాటికి ఈ నోటిఫికేషన్ వెలువడనున్నటు ్లవిశ్వసనీయ సమాచారం.
పంచాయతీ కార్యదర్శుల భర్తీకి రంగం సిద్ధం
Published Fri, Nov 15 2013 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
Advertisement
Advertisement