సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. తమను రెగ్యులర్ చేయాలంటూ జేపీఎస్‌లు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జీపీఎస్‌లు ఇప్పటికైనా విధుల్లో చేరాలని ప్రభుత్వం పేర్కొంది.
అయితే, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం మరోసారి ఆఫర్ ఇచ్చింది. వారి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపింది. ఈ క్రమంలో వారిని వెంటనే విధుల్లో చేరాలని సూచించింది. జీపీఎస్‌ల పట్ల ప్రభుత్వం సానుకూలతతో ఉన్నట్టు స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీలకు అవార్డులు రావటంలో కార్యదర్శుల కృషి ఉంది. కొంత మంది తమ స్వలాభం కోసం వారిని రెచ్చగొట్టడం వల్ల జీపీఎస్‌లు సమ్మె చేస్తున్నారు.
సమ్మె అనేది చివరి అస్త్రం. కానీ.. ముందు దశలోనే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు వెళ్ళారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులైనప్పటికీ రాష్ట్రపతి దగ్గర అవార్డులు తీసుకునే అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఏర్పాటు చేసిన పోస్టు.. పంచాయతీ కార్యదర్శులు. అలాంటిది ప్రభుత్వం పై ఉద్యోగులు నమ్మకంతో ఉండాలి అని సూచించింది. ఇక, అంతకుముందు కూడా జీపీఎస్‌లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా తెలిపారు.
ఇది కూడా చదవండి: నా ప్రాణానికి ముప్పు.. మోదీ, అమిత్‌షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖలు
Comments
Please login to add a commentAdd a comment