పంచాయతీ కార్యదర్శుల యూనియన్ల గోల
మరో సంఘం ఆవిర్భావం ఏర్పాటుకు సిద్ధం
అయోయయంలో కార్యదర్శులు
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ : పంచాయతీ కార్యదర్శుల్లో రోజుకో యూనియన్ పేరుతో కొత్త సంఘాలు పుట్టుకొస్తుండడంతో ఆయా పంచాయతీల కార్యదర్శులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కార్యదర్శుల సమస్యలకు సంబంధించి సంఘాలు ఏర్పడుతున్న తరుణంలో వారిలో పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి కాంట్రాక్టు కార్యదర్శులు రెగ్యులరైజ్ కార్యదర్శుల పేరుతో రెండు సంఘాల ఆవిర్భావమయ్యాయి. ఈ నేపథ్యంలో కొందరు కార్యదర్శులు రెగ్యులర్ కావడంతో మరికొంతమంది అలాగే మిగిలిపోయారు. దీంతో ఇటీవల ఒక సంఘం ఏర్పాటైంది.
గతంలోనే ఒక సంఘం ఉండగా, ఇటీవల ఏర్పడ్డ సంఘంతో రెండో సంఘం ఆవిర్భావమైంది. ఈ నేపథ్యంలో తమకు సమాచారం లేకుండానే రెండో సంఘం ఆవిర్భావమైందంటూ మరికొందరు కార్యదర్శులు వారిపై తిరుగుబావుటా ఎగురవేసి ముచ్చటగా మూడో సంఘానికి తెరలేపారు. జిల్లాలో 1331 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పటికే 600, 700మంది కార్యదర్శులు ఉన్నారు. ఇంతమందికి సంబంధించి కేవలం ఒక్క సంఘం అయితే సరిపోయేది. ఈ నేపథ్యంలో సంఘాల ఏర్పాటుపై ఆయా కార్యదర్శులు తీవ్ర ఆందోళన మొదలైంది. ఎవరు ఏ సంఘంలో ఉంటే ఏమవుతుందో అన్న ఆందోళన నెలకొంది.
మీది మీదే.. మాది మాదే!
Published Fri, Jun 20 2014 2:58 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM
Advertisement
Advertisement