Serious concern
-
సోమవారం రిపోర్ట్ చేయండి
♦ ఐటీ శాఖ ఉద్యోగులను ఆదేశించిన ఆ శాఖ ఇన్చార్జి ♦ ఒక్కరోజే గడువు ఇవ్వడంపై భగ్గుమంటున్న ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో ఐటీ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులంద రూ ఈ నెల 2వ తేదీ (సోమవారం) విజయవాడలో అద్దెకు తీసుకున్న కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఐటీ శాఖ ఇన్చార్జి ప్రద్యుమ్న గత నెల 30వ తేదీన ఒఒ.ఆర్.టి.47 జారీ చేశారు. దీంతో ఐటీ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక పక్క సచివాలయ ఉద్యోగులు జూన్లో కొత్త రాజధానిలోని తాత్కాలిక సచివాలయానికి తరలివెళ్లాలని నిర్ణయించగా.. ఇప్పుడు ఒక్క ఐటీ శాఖ ఉద్యోగులను మాత్రమే విజయవాడకు వెళ్లాలని ఉత్తర్వులివ్వడం ఎంత వరకు సమంజసమని వారు తీవ్రంగా మండిపడుతున్నారు. గత నెల 29వ తేదీన విజయవాడలో చిన్న గదిని అద్దెకు తీసుకుని.. అక్కడికి తరలివెళ్లాలని 30న (శనివారం) ఆదేశించి.. ఒక్కరోజు తరువాత (సోమవారం) రిపోర్ట్ చేయాలనడంపై ఆ శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మహిళలపై ఇన్ని అఘాయిత్యాలా!
పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీల ఆందోళన రేపిస్టులకు శిక్షగా ‘కెమికల్ క్యాస్ట్రేషనే’ సరి హింసకు పాల్పడే జువెనైల్స్కూ కఠిన శిక్షలు ఉండాలి న్యూఢిల్లీ: దేశంలో గత కొంతకాలంగా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు, హింసాత్మక దాడులు పెరిగిపోతుండటంపై గురువారం పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై లోక్సభలో జరిగిన చర్చలో పాల్గొన్న సభ్యులంతా పార్టీలకు అతీతంగా ఈ దారుణాలను ముక్తకంఠంతో ఖండించారు. అత్యాచారాలకు పాల్పడే జువెనైల్స్ను కూడా వయోజనుల మాదిరే పరిగణించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో స్త్రీని విలాస వస్తువుగా భావించే మగవారి ఆలోచనా విధానంలో మార్పు రావాలని బీజేపీ మహిళా ఎంపీ బిజోయా చక్రవర్తి అన్నారు. వరకట్న ఆచారం, భ్రూణ హత్యలు కొనసాగుతున్నంత కాలం మహిళలపై దాడులను నియంత్రించడం సాధ్యం కాదని కాంగ్రెస్ మహిళా ఎంపీ రంజీత్ రంజన్ పేర్కొన్నారు. అక్రమ అబార్షన్లు చేసే వైద్యులను జైళ్లలో పెట్టాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తిదార్ డిమాండ్ చేశారు. ఈ చర్చలో కొత్తపల్లి గీత, బుట్టా రేణుక (వైఎస్సార్సీపీ), మురళీ మోహన్ (టీడీపీ), నగేష్ (టీఆర్ఎస్) తదితరులు పాల్గొన్నారు. మరోవైపు రాజ్యసభలో జరిగిన చర్చలో రేపిస్టులకు కెమికల్ క్యాస్ట్రేన్ (రసాయన పద్ధతుల ద్వారా లైంగిక సామర్థ్యం కోల్పోయేలా చేయడం) వంటి తీవ్రమైన శిక్షలను విధించాలని ఎంపీలు కోరారు. -
మీది మీదే.. మాది మాదే!
పంచాయతీ కార్యదర్శుల యూనియన్ల గోల మరో సంఘం ఆవిర్భావం ఏర్పాటుకు సిద్ధం అయోయయంలో కార్యదర్శులు మహబూబ్నగర్ మెట్టుగడ్డ : పంచాయతీ కార్యదర్శుల్లో రోజుకో యూనియన్ పేరుతో కొత్త సంఘాలు పుట్టుకొస్తుండడంతో ఆయా పంచాయతీల కార్యదర్శులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కార్యదర్శుల సమస్యలకు సంబంధించి సంఘాలు ఏర్పడుతున్న తరుణంలో వారిలో పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి కాంట్రాక్టు కార్యదర్శులు రెగ్యులరైజ్ కార్యదర్శుల పేరుతో రెండు సంఘాల ఆవిర్భావమయ్యాయి. ఈ నేపథ్యంలో కొందరు కార్యదర్శులు రెగ్యులర్ కావడంతో మరికొంతమంది అలాగే మిగిలిపోయారు. దీంతో ఇటీవల ఒక సంఘం ఏర్పాటైంది. గతంలోనే ఒక సంఘం ఉండగా, ఇటీవల ఏర్పడ్డ సంఘంతో రెండో సంఘం ఆవిర్భావమైంది. ఈ నేపథ్యంలో తమకు సమాచారం లేకుండానే రెండో సంఘం ఆవిర్భావమైందంటూ మరికొందరు కార్యదర్శులు వారిపై తిరుగుబావుటా ఎగురవేసి ముచ్చటగా మూడో సంఘానికి తెరలేపారు. జిల్లాలో 1331 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పటికే 600, 700మంది కార్యదర్శులు ఉన్నారు. ఇంతమందికి సంబంధించి కేవలం ఒక్క సంఘం అయితే సరిపోయేది. ఈ నేపథ్యంలో సంఘాల ఏర్పాటుపై ఆయా కార్యదర్శులు తీవ్ర ఆందోళన మొదలైంది. ఎవరు ఏ సంఘంలో ఉంటే ఏమవుతుందో అన్న ఆందోళన నెలకొంది.