♦ ఐటీ శాఖ ఉద్యోగులను ఆదేశించిన ఆ శాఖ ఇన్‌చార్జి
♦ ఒక్కరోజే గడువు ఇవ్వడంపై భగ్గుమంటున్న ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో ఐటీ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులంద రూ ఈ నెల 2వ తేదీ (సోమవారం) విజయవాడలో అద్దెకు తీసుకున్న కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఐటీ శాఖ ఇన్‌చార్జి ప్రద్యుమ్న గత నెల 30వ తేదీన ఒఒ.ఆర్.టి.47 జారీ చేశారు. దీంతో ఐటీ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక పక్క సచివాలయ ఉద్యోగులు జూన్‌లో కొత్త రాజధానిలోని తాత్కాలిక సచివాలయానికి తరలివెళ్లాలని నిర్ణయించగా.. ఇప్పుడు ఒక్క ఐటీ శాఖ ఉద్యోగులను మాత్రమే విజయవాడకు వెళ్లాలని ఉత్తర్వులివ్వడం ఎంత వరకు సమంజసమని వారు తీవ్రంగా మండిపడుతున్నారు.
గత నెల 29వ తేదీన విజయవాడలో చిన్న గదిని అద్దెకు తీసుకుని.. అక్కడికి తరలివెళ్లాలని 30న (శనివారం) ఆదేశించి.. ఒక్కరోజు తరువాత (సోమవారం) రిపోర్ట్ చేయాలనడంపై ఆ శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం రిపోర్ట్ చేయండి
Published Mon, May 2 2016 2:33 AM | Last Updated on Thu, Sep 27 2018 4:02 PM
Advertisement