శర్భనాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం
సాక్షి, ఆలేరు : గ్రామపంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం నూతనంగా మరో 30 విధులను అప్పగించింది. గతంలో వీరు 64బాధ్యతలను నిర్వహించేవారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 401 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 2018–పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కార్యదర్శి గ్రామంలో పాలన బాధ్యతలను చూసుకోవటంతో పాటు సర్పంచ్‌కు సబార్డినేట్‌గా వ్యవహరించాలని సూచించింది. పంచాయతీలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, నిర్వహణ, త్రాగునీరు, వీధిదీపాలు, రోడ్లు, డ్రైనేజీ, మొక్కలు నాటడం, పారిశుద్య కార్యక్రమాలు అమలు చేయాలని కోరింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 42, సెక్షన్ 286 ప్రకారం, సెక్షన్ 43 ప్రకారం అప్పగించిన అన్ని బాధ్యతలు వి«ధులు నిర్వర్తించాలని తెలిపింది. సెక్షన్ – 6 (8)లో ప్రకారం పంచాయతీ ఎజెండా రూపకల్పన బాధ్యత కార్యదర్శిదేనని పేర్కొంది. గ్రామ పాలకవర్గం ఆమోదంతో వీటిని అమలు చేయాలని సూచించింది.
24గంటల్లో అనుమతి
భవన నిర్మాణాలకు 24గంటల్లోనే అనుమతినివ్వాలని సూచించింది. అంతే కాకుండా లేఔట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 7రోజుల్లో అనుమతినివ్వాలని ఆదేశించింది. అలాగే లేఔట్ల అనుమతిలో పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రతీ లేఔట్లో 15శాతం భూభాగాన్ని తనఖా చేయాలని కోరింది. అలాగే గ్రామంలో తీసుకునే నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు పై ఎప్పటికప్పుడు గ్రామ ప్రజలకు సమాచారం అందించాలని సూచించింది. జనన, మరణాలతో పాటు వివాహ రిజిస్టేషన్ల నిర్వహణ చేయాల్సి ఉంటుంది.
మార్గదర్శకాలు ఇవే..
- పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వానికి సబార్డినేట్‌గా వ్యవహరించాలి.
- గ్రామ సభకు ఎజెండా తయారు చేసి అందులోని అంశాలు సభ్యులందరికి తెలిసేలా ప్రచారం చేయాలి.
- ప్రతీ 3నెలలకు ఒకసారి ఖర్చు లెక్కలను పంచాయతీ ఆమోదానికి సమర్పించాలి.
- వరదలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు, రోడ్లు, రైలు ప్రమాదాలు సం¿¶ వించినప్పుడు సహాయ చర్యల్లో పాల్గొనాలి.
- గ్రామంలో వ్యాధులు ప్రబలినప్పుడు అధికారులకు తెలియపరచాలి.
- గ్రామాల్లోని అవసరాలను గుర్తించి గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారిలో పాలుపంచుకోవాలి. అలాగే ఎంపీపీ, ఎంపీడీఓ, ఈఓ (పీఆర్ ఆర్‌డీ) నిర్వహించే నెలవారీ సమావేశాలకు హాజరు కావాలి.
- గ్రామసభలో లబ్ధిదారుల గుర్తింపు, వారికి రుణ పంపిణీ, రుణాలు వసూలుకు సహకరించాలి.
- అంశాల వారీగా ఎజాండాలను సిద్ధం చేసి, గ్రామపంచాయతీ ఆమోదం పొందడం.
- ఎజెండాను ప్రదర్శించడం, దండోర వేయించడం, గ్రామాల్లోని పలు ప్రాంతాల్లో నోటీసులను అంటించి ప్రజలకు సమాచారం చేరేలా చూడడం.
- బలహీన వర్గాలు, ఎస్టీ, ఎస్సీ వాడల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలు, పంచాయతీ తీసుకుంటున్న ఫలాలు అందేలా చూడడం.
- వార్షిక పరిపాలన నివేధికను రూపొందించి గ్రామపంచాయతీ ఆమోదం తీసుకోవడం.
- నెలవారీ సమీక్షలు, ప్రగతి నివేదికల రూపకల్పన, ఉన్నతాధికారులకు నివేదికను అందించడం, సర్పంచ్‌తో కలిసి అభివృద్ధి పనులకు పర్యవేక్షణ
- ప్రతీ త్రైమాసికంలో ఒకసారి పంచాయతీ ఆర్థిక వ్యవహారాలను ఆధాయ, వ్యయ వివరాలను పంచాయతీ ఆమోదించడంతో పాటు ఈవీపీఆర్‌డీలకు సమాచారం ఇవ్వడం.
Comments
Please login to add a commentAdd a comment