పంచాయతీ కార్యదర్శుల ఎంపిక ప్రక్రియకు న్యాయపరమైన చిక్కు లు ఎదురవుతున్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు పలువురు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టేటస్‌కో ఉత్తర్వులు తెచ్చుకున్నా రు. ఈ క్రమంలో నియామక ప్రక్రియకు అంతరాయం కలిగే సూచన లు కనిపిస్తున్నాయి. పోస్టుల భర్తీపై అధికారులు డైలమాలో పడ్డారు.
సాక్షి, చిత్తూరు:
జిల్లాలో 265 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సుమారు నెల క్రితం నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం 15,462 దరఖాస్తులు వచ్చాయి. అయితే నియామక ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇప్పటి వరకు దరఖాస్తుల కంప్యూటరీకరణ మాత్రమే పూర్తయింది. ఈ వివరాలను ఎంపిక కమిటీ(డీఎస్సీ) ముందు ఉంచి, ఈ నెల 5వ తేదీకే నియామక ప్రక్రియను ప్రారంభించాల్సి ఉం ది. అయితే న్యాయపరమైన, సాంకేతిక కారణాలతో పోస్టుల భర్తీకి సంబంధించి ఒక్క అడుగూ ముందుకు సాగలేదు.
అత్యున్నత విద్యార్హతలు
పంచాయతీ కార్యదర్శుల పోస్టులపై నిరుద్యోగులు భారీగానే ఆశలు పెంచుకున్నారు. అభ్యర్థుల నుంచి 15,462 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల్లో ఎంఏ, ఎంఫిల్, బీటెక్, ఎంటెక్ చదివిన వారూ ఉన్నారు. ప్రాథమికంగా గ్రాడ్యుయేషన్ మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
స్టేటస్ కో ఉత్తర్వుల జారీ
పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. తొలుత 22 మంది ఇన్‌సర్వీసు పంచాయతీ కాంట్రాక్టు కార్యదర్శులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. తాము పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి పోస్టుకు నియామక ప్రక్రియ చేపట్టరాదని, యధాతథస్థితి కొనసాగించాలని ఆదేశాలు తెచ్చుకున్నారు. వీరి పిటిషన్ల ఆధారంగా మరో 158 మంది తమ పోస్టులు భర్తీ చేయకుండా స్టేటస్‌కో ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీంతో జిల్లాలో ఖాళీగా ఉన్న 265 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్లో 170 పోస్టులకు స్టేటస్ కో ఉత్తర్వులు వచ్చినట్లు అయింది. పోస్టుల భర్తీకి సంబంధించి కలెక్టర్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ క్రమంలో మొత్తం ఎంపిక ప్రక్రియనే ఆపేయాలా లేదా 170 పోస్టులకు మాత్రమే నియామక ప్రక్రియ నిలిపివేయాలా అనే అంశాన్ని జిల్లా పంచాయతీ అధికారులు తేల్చుకోలేక పోతున్నారు.
పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీపై సందిగ్ధం
Published Fri, Dec 13 2013 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement