Administrative Tribunal
-
కలెక్టరేట్‌ను కుదిపేస్తున్న అక్రమ బదిలీలు!
సాక్షి, సిటీబ్యూరో: తహశీల్దార్ల అక్రమ బదిలీల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. సాధారణ ఎన్నికల అనంతరం జరిగిన ఈ బదిలీల వ్యవహారం కొద్ది రోజులుగా హైదరాబాద్ కలెక్టరేట్‌ను కుదిపేస్తోంది. ఈ వ్యవహారంపై అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో ఇప్పటికే ఓ కేసు నడుస్తోండగా తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. అమాత్యుల ఒత్తిళ్ల మేరకు గతనెలలో అక్రమ బదిలీలకు తలూపిన జిల్లా ఉన్నతాధికారులకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి అక్షింతలు తప్పడం లేదు. జిల్లా యంత్రాగం పనితీరును కిందిస్థాయి అధికారులు కొందరు న్యాయస్థానాల్లో సవాల్ చేస్తున్న నేపథ్యంలో.. పాలనావ్యవస్థపై ఉన్నతాధికారులు పట్టుకోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజా కేసులో మూడు వారాల్లోగా కౌంటరు దాఖలు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అక్రమంగా బదిలీ చేశారంటూ... బండ్లగూడలో పనిచేస్తున్న తనను నిబంధనలకు విరుద్ధంగా చార్మినార్‌కు బదిలీ చేశార ంటూ తహశీల్దార్ అనిల్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ కేసులో హైదరాబాద్ కలెక్టర్‌ను, భూపరిపాలన విభాగం ముఖ్య కమిషనర్‌ను, ప్రస్తుత బండ్లగూడ తహశీల్దార్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఎన్నికలకు ముందు నుంచి బండ్లగూడ తహశీల్దార్‌గా ఉన్న అనిల్‌కుమార్‌ను ఎన్నికల అనంతరం (వేరొకరికి పోస్టింగ్ ఇచ్చేందుకు) అక్కడి నుంచి కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. తనను పక్కకు నెట్టి పైరవీతో వచ్చిన అధికారికి స్థానం కల్పించడాన్ని అనిల్‌కుమార్ అవమానంగా భావించిన ఆయన ట్రిబ్యునల్ ఆశ్రయించినట్టు సమాచారం. అక్రమార్కులపై చర్యలేవీ? ఎన్నికల మాటున జరిగిన అక్రమ బదిలీల విషయమై జిల్లా యంత్రాంగాన్ని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ త లంటినా, ఉన్నతాధికారులు మాత్రం అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల విధులు ముగించుకొని వచ్చేలోగా తమ స్థానాలను వేరొకరికి అప్పగించడంపై హైదరాబాద్ జిల్లాకు చెందిన ఐదుగురు తహశీల్దార్లు గత జూన్‌లో ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఇతర జిల్లాల నుంచి అక్రమంగా వచ్చిన తహశీల్దార్ల ఉత్తర్వులను సస్పెండ్ చేసిన ట్రిబ్యునల్, జిల్లాకు చెందిన తహశీల్దార్లకు వారి పాత స్థానాల్లోనే పోస్టింగ్‌లు ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆ ఉత్తర్వులను పట్టించుకోని అధికారులు.. పదవీ విరమణ పొందిన అధికారుల స్థానాల్లో వారిని సర్దుబాటు చేశారు. ఈ వ్యవహారంపై ట్రిబ్యునల్‌లో ఉన్న కేసు ఇంకా కొలిక్కి రాకముందే, తాజాగా చార్మినార్ తహశీల్దార్ పిటిషన్ వేయడం రెవెన్యూ వర్గాల్లో కలకలం సృష్టించింది. -
మళ్లీ తెరపైకి జెడ్పీ డెప్యూటీ సీఈవో పోస్టు
ఎవరికి వారే ముమ్మర యత్నాలు ఊపందుకోనున్న రాజకీయ పైరవీలు కలెక్టర్‌కు కత్తిమీద సామే! కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి పోస్టుకు పైరవీలు ప్రారంభమయ్యాయి. వరుస ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా కొంతమంది అధికారులను మూడు సంవత్సరాల పైబడి ఒకే ప్రాంతంలో ఉన్న వారిని బదిలీ చేశారు. దీనిలో భాగంగా డెప్యూటీ సీఈవోగా పనిచేసిన జీవీ సూర్యనారాయణ ఎంపీడీవోల బదిలీల్లో భాగంగా ఫిబ్రవరిలో బదిలీ అయ్యారు. దీంతో అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. అయితే తిరిగి బందరు మండల ఎంపీడీవోగా బదిలీ అయ్యి జెడ్పీ డెప్యూటీ సీఈవో పోస్టును దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇన్చార్జ్ జెడ్పీ సీఈవోగా పనిచేస్తున్న చింతా కళావతి ఎన్నికల ముందు ఎంపీడీవోల బదిలీల్లో ఇతర జిల్లాకు బదిలీ అయ్యారు. అయితే ప్రస్తుతం బందరు ఎమ్మెల్యే కొల్లు రవీంద్రకు ఈమె బంధువు కావటంతో ఆమె కూడా ఈ పోస్టుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. వీరు ఇరువురి ప్రయత్నాలు ఇలా ఉంటే... మరో పక్క రాజీవ్ విద్యామిషన్ ఎఫ్ఏవోగా పనిచేస్తున్న వి.జ్యోతిబసు న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. గతంలో చింతా కళావతి ఇన్చార్జ్ జెడ్పీ సీఈవోగా, డెప్యూటీ సీఈవోగా జీవీ సూర్యనారాయణ విధులు నిర్వర్తించిన సమయంలో 2013 అక్టోబరు 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం చింతా కళావతి, జీవీ సూర్యనారాయణ కంటే ఎక్కువ సీనియార్టీ ఉన్న వి జ్యోతిబసును ఇన్చార్జ్ జెడ్పీ సీఈవోగా అప్పట్లో ఉయ్యూరు మండలం ఎంపీడీవోగా పనిచేస్తున్న ఎం.కృష్ణమోహన్‌ను ఇన్చార్జ్ డెప్యూటీ సీఈవోగా నియమించాలని తీర్పు వెల్లడైంది. ఈ తీర్పు ఆధారంగా అప్పటి నుంచి వీరు ఇరువురు న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. అయితే ఎన్నికల ముందు జెడ్పీ సీఈవోగా నియమితులైన దాసరి సుదర్శనం జిల్లాపరిషత్ డెప్యూటీ సీఈవో, ఏవో పోస్టులను భర్తీ చేసేందుకు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు వద్దకు ఇన్చార్జ్ డెప్యూటీ సీఈవోగా బందరు మండలం ఎంపీడీవోగా పనిచేస్తున్న సుబ్బారావును, రాజీవ్ విద్యామిషన్ కార్యాలయంలో ఎఫ్ఏవో పనిచేస్తున్న జ్యోతిబసును ఏవోగా నియమించాలని ప్రతిపాదనలు తీసుకువెళ్లారు. అయితే కలెక్టర్ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం సుబ్బారావు కంటే జ్యోతిబసు సీనియర్ కదా ఆయనను ఎలా నియమిస్తారని సీఈవోను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే జెడ్పీ సీఈవో వి జ్యోతిబసు జిల్లా వాసి అయినందున ఆయన నియామకం ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా నియామకం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పడంతో కలెక్టర్‌కు ఈ ఫైల్‌ను పక్కన పెట్టి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత చూద్దామని సీఈవోకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తికావటంతో జెడ్పీ డెప్యూటీ సీఈవో పోస్టును దక్కించుకునేందుకు ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బందరు ఎంపీడీవోగా పనిచేసిన జీవీ సూర్యనారాయణ రాష్ట్ర నాయకత్వాన్ని నమ్ముకోగా, చింతా కళావతి రాజకీయపరంగా తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. జ్యోతిబసు మాత్రం న్యాయపరంగా తనకు ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకుండా డెప్యూటీ సీఈవోగా పోస్టు తనకే దక్కుతుందని ఆశగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం. అయితే జెడ్పీ డెప్యూటీ సీఈవో పోస్టు ఎవరికి దక్కుతుందో, ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో త్వరలోనే తేలనుంది. -
పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీపై సందిగ్ధం
పంచాయతీ కార్యదర్శుల ఎంపిక ప్రక్రియకు న్యాయపరమైన చిక్కు లు ఎదురవుతున్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు పలువురు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టేటస్కో ఉత్తర్వులు తెచ్చుకున్నా రు. ఈ క్రమంలో నియామక ప్రక్రియకు అంతరాయం కలిగే సూచన లు కనిపిస్తున్నాయి. పోస్టుల భర్తీపై అధికారులు డైలమాలో పడ్డారు. సాక్షి, చిత్తూరు: జిల్లాలో 265 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సుమారు నెల క్రితం నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం 15,462 దరఖాస్తులు వచ్చాయి. అయితే నియామక ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇప్పటి వరకు దరఖాస్తుల కంప్యూటరీకరణ మాత్రమే పూర్తయింది. ఈ వివరాలను ఎంపిక కమిటీ(డీఎస్సీ) ముందు ఉంచి, ఈ నెల 5వ తేదీకే నియామక ప్రక్రియను ప్రారంభించాల్సి ఉం ది. అయితే న్యాయపరమైన, సాంకేతిక కారణాలతో పోస్టుల భర్తీకి సంబంధించి ఒక్క అడుగూ ముందుకు సాగలేదు. అత్యున్నత విద్యార్హతలు పంచాయతీ కార్యదర్శుల పోస్టులపై నిరుద్యోగులు భారీగానే ఆశలు పెంచుకున్నారు. అభ్యర్థుల నుంచి 15,462 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల్లో ఎంఏ, ఎంఫిల్, బీటెక్, ఎంటెక్ చదివిన వారూ ఉన్నారు. ప్రాథమికంగా గ్రాడ్యుయేషన్ మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్టేటస్ కో ఉత్తర్వుల జారీ పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. తొలుత 22 మంది ఇన్‌సర్వీసు పంచాయతీ కాంట్రాక్టు కార్యదర్శులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. తాము పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి పోస్టుకు నియామక ప్రక్రియ చేపట్టరాదని, యధాతథస్థితి కొనసాగించాలని ఆదేశాలు తెచ్చుకున్నారు. వీరి పిటిషన్ల ఆధారంగా మరో 158 మంది తమ పోస్టులు భర్తీ చేయకుండా స్టేటస్కో ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీంతో జిల్లాలో ఖాళీగా ఉన్న 265 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్లో 170 పోస్టులకు స్టేటస్ కో ఉత్తర్వులు వచ్చినట్లు అయింది. పోస్టుల భర్తీకి సంబంధించి కలెక్టర్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ క్రమంలో మొత్తం ఎంపిక ప్రక్రియనే ఆపేయాలా లేదా 170 పోస్టులకు మాత్రమే నియామక ప్రక్రియ నిలిపివేయాలా అనే అంశాన్ని జిల్లా పంచాయతీ అధికారులు తేల్చుకోలేక పోతున్నారు.