ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సోమవారం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా 2,677 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొనగా...ఏజిల్లాలో ఎన్ని పోస్టులు అనే అంశం లేకపోవడంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన మొదలైంది. జనవరి 4 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ, 20 వ తేదీ వరకు రాత పరీక్ష ఫీజు చెల్లించాలని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఫిబ్రవరి 23 న రాత పరీక్ష నిర్వహించనున్నారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ మినహా ఇతర అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100గా నిర్ణయించారు. అభ్యర్థులు 18 నుంచి 36 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలని, జీతం 7,520 నుంచి 22,430 వరకు ఉంటుందని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా 758 పంచాయతీలను 587 కస్టర్లుగా విభజించారు. వీటిలో గ్రేడ్ 4 కార్యదర్శుల పోస్టులు 91కి గానూ 34 మంది పనిచేస్తున్నారు. అలాగే జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిపై ఇప్పటికే 26 మంది అభ్యర్థులు పనిచేస్తున్నారు. గత నవంబర్ 30 న జిల్లాలో 26 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి 4,448 దరఖాస్తులు వచ్చాయి. ఈ 26 పోస్టులలో 23 పోస్టులు కాంట్రాక్టు ఉద్యోగులకు దక్కనున్నా యి. మిగిలిన 3 పోస్టులు మెరిట్ ప్రకారం అభ్యర్థులకు దక్కనున్నాయి. తాజా నోటిఫికేషన్‌తో 31 పోస్టులు నింపే అవకాశం ఉంది. ఈ ఎంపికకు మొత్తం 100 మార్కులు కేటాయించనున్నారు. రాత,మౌఖిక పరీక్షలు లేకుండా డిగ్రీలో మెరిట్,రోస్టర్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఈ పోస్టులను ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచనలో కొందరు అభ్యర్థు లు ఇప్పటికే మధ్యవర్తులను ఆశ్రయించారు. మరికొందరు అధికార పార్టీ నేతలను కూడా కలిసి పోస్టులు దక్కించుకోవాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు.
దళారులొస్తున్నారు....
ఇటీవలనే వీఆర్‌ఓ, వీఆర్‌ఏ నోటిఫికేషన్ వెలువడడం, తాజాగా పంచాయతీ కార్యదర్శుల పోస్టులను కూడా భర్తీ చేస్తుండడంతో దళారులు రంగంలోకి దిగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది మం ది నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పడుతుండడంతో దళారులు తమకు ఫలానా జిల్లా అధికారి తెలుసు అని డబ్బులు దండుకునే యత్నాల్లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దరఖాస్తులు , పరీక్ష , ఫలితా ల పక్రియ అంతా రెండు నెలలోనే ముగుస్తుండడంతో దళారులు అధికారుల పేరు చెప్పుకొని నిరుద్యోగులను ఆకర్షించే పనిలో పడ్డా రు. ఖమ్మం,కొత్తగూడెం లో వసూళ్ల పర్వం మొదలైనట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం దళారులను నమ్మవద్దని, అంతా పారదర్శకంగా నిర్వహిస్తామని చెబుతున్నారు.
మరో శుభవార్త
Published Tue, Dec 31 2013 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement
Advertisement