అబుదాబిలో ఇటీవల (ఫిబ్రవరి 14, 204) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ మందిరంలో డ్రెస్‌కోడ్ వార్తల్లో నిలిచింది. మార్చి ఒకటో తేదీనుంచి ఇక్కడ ప్రజల దర్శనాలకు అనుమతినిచ్చిన నేపథ్యంలో నియమ నిబంధనలు, భక్తుల డ్రెస్ కోడ్‌కు సంబంధించిన నియమాలు, మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా క్యాప్స్, టీషర్ట్‌లు, అభ్యంతరకరమైన దుస్తులకు అనుమతి ఉండదు.
డ్రెస్ కోడ్, ఇతర నిబంధనలు
అబుదాబి మందిర్ ట్విటర్‌లో షేర్ చేసిన వివరాల ప్రకారం ప్రతి మంగళవారం - శనివారం, ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఈ మందిర్ తెరిచి ఉంటుంది. సోమవారం మాత్రం ఆలయాన్ని మూసివేస్తారు.
The wait is over!#AbuDhabiMandir is now open for all visitors and worshipers.
— BAPS Hindu Mandir (@AbuDhabiMandir) March 1, 2024
Opening hours:
Tuesday to Sunday: 9am-8pm
Every Monday: Closed for visitors pic.twitter.com/JnYvZoVSPk
ముస్లిం దేశంలో అబుదాబిలో తొలి హిందూ దేవాలయంబాప్స్‌లో డ్రెస్ కోడ్, మార్గదర్శకాల విషయంలో కఠినంగా వహరించనున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం, మెడ, మోచేతులు, మడమల వరకూ కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. టైట్‌గా ఉన్న దుస్తులు, స్లీవ్‌లెస్, షార్ట్స్‌కు అనుమతించరు. శబ్దాలు చేసే ఉపకరణాలనూ ఆలయంలోకి అనుమతించరు. బయటి ఆహారాన్ని ఆలయంలోకి తీసుకు రాకూడదు. పెంపుడు జంతువులకు కూడా ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధం. అంతేకాదు దేవాలయం పరిసరాల్లో డ్రోన్స్ వినియోగంపై కూడా నిషేధం విధించారు.
ఫోటోలకు అనుమతి ఉందా?
వ్యక్తిగత అవసరాల కోసమే ఫోటోలు తీసుకోవచ్చు. ఎవరైనా వాణిజ్య అవసరాల నిమిత్తం వీడియోను రికార్డ్ చేయాలనుకుంటే, వారు తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాలి. ఆలయంలోని ఆధ్యాత్మిక, ప్రశాంత వాతావరణానికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా భక్తులు నియమాలను పాటించి సహకరించాలని ఆలయ అధికారులు కోరారు.
కాగా 700 కోట్ల రూపాయల వ్యయంతో 27 ఎకరాల్లో బాప్స్ సంస్థ ఆధ్వర్యంలో అబూ మారేఖ్ ప్రాంతంలో ఆలయ నిర్మాణం జరిగింది. శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన ఈ ఆలయంలో ఒకేసారి 5 వేల మంది ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment