mumbai student
-
35 మార్కులతో పాసై ఫేమస్ అయిపోయాడు
ముంబాయి : పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల రోజు అందరి దృష్టి మొదటి ర్యాంకు ఎవరికి వచ్చింది.. స్టేట్ టాపర్ ఏ స్కూల్ విద్యార్థి.. ఎంతమంది పాస్ అయ్యారు లాంటి విషయాలపై ఉంటుంది. మీడియా కూడా టాపర్ల గురించే చెబుతుంది. కానీ మహారాష్ట్రలో మాత్రం ఇవన్నీ కాదని బార్డర్ మార్కులతో పాసైన ఓ విద్యార్థి గురించి మీడియా తెగ ప్రచారం చేసింది. టాపర్ల కంటే ఎక్కువగా ఈ విద్యార్థి గురించి చర్చ జరిగింది. కేవలం బార్డర్ మార్కులతో పాసైన వ్యక్తి గురించి ఇంత ప్రచారం ఎందుకు అనుకుంటున్నారా.. మరి అక్కడే ఉంది ట్విస్టు. అతడికి అన్ని సబ్జెక్టుల్లోనూ సమానంగా 35 మార్కులు వచ్చాయి. అంటే.. అన్ని సబ్జెక్టుల్లో అతడు బార్డర్ మార్కులతో పాసయ్యాడన్నమాట. దీంతో అతడు ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ముంబైకి చెందిన అక్షిత్ జాదవ్ స్థానికంగా ఉన్న అందరిలాగే టెన్త్ ఎగ్జామ్స్ రాశాడు. గత శనివారం మహారాష్ట్ర టెన్త్ బోర్డు ఫలితాలను రిలీజ్ చేసింది. కానీ రిజల్ట్ చూసే సరికి షాకైపోయాడు. ప్రతి సబ్జెక్ట్‌లో 35 మార్కులు వచ్చాయి. ఇలా బార్డర్ మార్కులతో బయటపడటంతో ఊరంతా అతని గురించే చర్చ జరిగింది. లోకల్ మీడియాకు ఈ విషయం తెలియడంతో రోజు మొత్తం అక్షిత్ గురించే ప్రచారం చేసింది. ఈ సందర్భంగా అక్షిత్ తండ్రి గణేశ్ మాట్లాడూతూ..."మా కుమారుడి ఫలితాలు చూసి ఆశ్చర్యపోయాం. అతడు 55శాతం మార్కులతో పాస్ అవుతాడని అనుకున్నాం. కానీ విచిత్రంగా అన్ని సబ్జెక్టుల్లోనూ 35 మార్కులే వచ్చాయి. అయితే అతడు అన్ని సబ్జెక్టుల్లో పాస్ అవడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. అక్షిత్ తొమ్మిదో తరగతిలో ఫెయిల్ అయ్యాడు. తరువాత ఇక స్కూల్‌కు వెళ్లలేదు. టెన్త్ పరీక్షలు ప్రైవేటుగా రాసి పాసయ్యాడు. ఫుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టమనే అక్షిత్...క్రీడలనే కెరీర్‌గా ఎంచుకుంటానని చెప్పాడు. ఇక సోషల్ మీడియాలో ఈ మార్కులపై జోకులు ఓ రేంజ్లో పేలాయి. ఇదో "నేషనల్ రికార్డు" అంటూ కొందరు కామెంట్ చేశారు. -
ఇంకా ప్రెషర్ కుక్కర్లోనే ఉన్నాం.. వైరల్!
సాక్షి, ముంబై: కొన్నేళ్ల కిందట వచ్చిన '3 ఇడియట్స్' మూవీ చూసి కాలేజీలు, స్కూళ్లల్లో ఎంతో మార్పు వచ్చిందని భావిస్తున్నారు కదా. కానీ అలాంటివేం జరడగం లేదని ముంబైకి చెందిన ఓ విద్యార్థిని తన ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఓ సందేశం ఫేస్బుక్లో వైరల్ అవుతోంది. తల్లిదండ్రులు, టీచర్లు, లెక్చరర్లు ఆ విద్యార్థి పోస్ట్ చేసిన పోస్టును ఒక్కసారైన చదవాలంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన '3 ఇడియట్స్' మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. ఆపై దక్షిణాదిలో దర్శకుడు శంకర్ స్నేహితుడు పేరుతో తీయగా విద్యార్థులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కొన్ని సినిమాల ప్రభావం అనంతరం విద్యావ్యవస్థలో ఎంతో మార్పు వచ్చిందని భావిస్తున్నారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. చదివే చదువు వేరు, చేయాలనుకున్న ఉద్యోగం, స్థిరపడాలనుకున్న రంగం వేరుగా ఉంటున్నాయని హ్యుమన్స్ ఆఫ్ బాంబే ఫేస్బుక్ పేజీలో ఓ విద్యార్థి పోస్ట్ చేశాడు. ఒకవేళ నేను సింగర్, నటుడు, డ్యాన్సర్, లేక డైరెక్టర్ అవ్వాలనుకుంటే చదువుకున్న పైథాగారస్ సిద్ధాంతం ఏ విధంగా ఉపయోగపడతాయని ప్రశ్నించాడు. ప్రస్తుతం ముంబై నెటిజన్లకు అది ఓ హాట్ టాపిక్‌గా మారింది. నవ్వుకునేందుకు కామిక్ పుస్తకాలు చదువుతుంటాం. అయితే కామిక్ పుస్తకాలు చదివిన వారికి పరీక్షలు పెడతామని చెప్పండి. ఒక్కరూ కూడా కామిక్ బుక్స్ వైపు కన్నెతి చూడరు. బాగా వేడిగా ఉన్న ప్రెషర్ కుక్కర్ లో పడ్డట్లు విద్యార్థుల పరిస్థితి తయారవుతుంది. అమ్మానాన్నలు మమ్మల్ని స్వేచ్ఛగా వదిలేయండి. మీరు అనుకున్న దాని కంటే గొప్పగా ఎదిగి మీరు గర్వపడేలా చేస్తామంటూ సందేశం ఇచ్చాడు. మరో గంటలో నాకు ఫైనల్ ఎగ్జామ్ ఉందని, వెళ్తున్నానంటూ విద్యార్థి తన పోస్ట్‌ను ముగించాడు. -
దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది!
ముంబై: మార్కులు పేరు చెప్పి మాయచేసిన ప్రైవేటు కోచింగ్ సెంటర్ కు ముంబై విద్యార్థిని దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. ర్యాంకుల పేరు చెప్పి వేలకు వేలు వసూలు చేస్తున్న కోచింగ్ సెంటర్లకు వార్నింగ్ ఇచ్చేలా న్యాయపోరాటం చేసి విజయం సాధించింది. చెప్పిన మాట నిలబెట్టుకోనందుకు విద్యార్థిని రూ.3.64 లక్షలు పరిహారం చెల్లించాలని కోచింగ్ సెంటర్ నిర్వాహకులను వినియోగదారుల ఫోరం ఆదేశించింది. అభివ్యక్తి వర్మ అనే విద్యార్థిని హెచ్ ఎస్సీ ఎగ్జామ్స్ కు ప్రిపేరవుతూ మ్యాథ్స్, కెమిస్ట్రీ ట్యూషన్ కోసం 2013లో ఆందేరిలోని ఆక్స్ ఫర్డ్ ట్యూటర్స్ అకాడమి కోచింగ్ సెంటర్ కు వెళ్లింది. తమ దగ్గర అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉన్నారని చెప్పడంతో ఆమె హోమ్ ట్యూషన్ పెట్టించుకుంది. ఫీజు చెల్లించి నెల గడిచినా కెమిస్టీ టీచర్ ను పంపలేదు. మ్యాథ్స్ టీచర్ కు హిందీ తప్పా ఇంగ్లీషులో చెప్పడం రాదు. విద్యార్థిని తల్లి నీనా పలుమార్లు అడగ్గా కెమిస్ట్రీ టూటర్ ను పంపారు. అయితే టీచర్ సరిగా పాఠాలు చెప్పలేదు. దీంతో ఒత్తిడి, గందరగోళానికి గురైన విద్యార్థిని టెన్త్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించలేపోయిందని నీనా తెలిపారు. తన కుమార్తెకు కాలేజీ సీటు రావడం కష్టమైందని వాపోయారు. దీంతో ఆమె గతేడాది ఆక్స్ ఫర్డ్ ట్యూటర్స్ అకాడమిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఫోరం గత నెలలో తీర్పు వెలువరించింది. విద్యార్థినికి జరిగిన నష్టానికి రూ.3.64 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఆమె కట్టిన ఫీజు రూ.54,000 తిరిగి ఇచ్చేయాలని, మానసికంగా వేధించినందుకు రూ. 3 లక్షలు, కోర్టు ఫీజుల కింద రూ.10 వేలు కలిపి మొత్తం రూ.3.64 లక్షలు ఇవ్వాలంది. తాము బాగానే పాఠాలు చెప్పామని, మార్కులు తక్కువ రావడానికి విద్యార్థిని సరిగా చదవకపోవడమే కారణమని కోచింగ్ సెంటర్ తరపు న్యాయవాది వాదించారు.