
సోహైల్ హుస్సేన్
మల్కాజిగిరి: ఫేస్‌బుక్ ద్వారా యువతిగా పరిచయం చేసుకుని మరో యువతిని వేధిస్తున్న యువకుడిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్పెక్టర్ కొమరయ్య కథనం ప్రకారం...మల్కాజిగిరి ఎస్పీనగర్‌కు చెందిన మహ్మద్ సొహైల్ హుస్సేన్ సికింద్రాబాద్‌లోని వెస్లీ కాలేజిలో డిగ్రీ చదువుతున్నాడు. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్ధిని ఫేస్‌బుక్ ద్వారా మహిళగా పరిచయం చేసుకున్నాడు. ఆమె ఫోటోలు తీసుకోవడమే కాకుండా చాటింగ్ చేసిన మెసేజ్‌లను ఆసరా చేసుకొని ఆమెను ప్రేమించమని వేధించడమే కాకుండా లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై గత ఏడాది బాధితురాలి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోర్టు ద్వారా రాజీ చేసుకున్నాడు. ఇటీవల ఆమె పేరుతో నకిలీ ఇన్‌స్ట్రాగామ్ ఖాతాను తెరిచి ఫోటోలు ఉంచడమే కాకుండా అసభ్యకరమైన కామెం ట్లు చేస్తుండటంతో బాధితురాలి గత నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం సోహైల్ హుస్సేన్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment