నేడు, రేపు నగరంలో చేప ప్రసాదం పంపిణీ | fish medicine distribution on 8th and 9th june | Sakshi
Sakshi News home page

నేడు, రేపు నగరంలో చేప ప్రసాదం పంపిణీ

Published Sun, Jun 8 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM

fish medicine distribution on 8th and 9th june

సాక్షి, హైదరాబాద్: బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 8, 9 తేదీల్లో ప్రసాదం పంపిణీకి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6.30 వరకు ఆస్తమా బాధితులకు ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. దాదాపు లక్ష చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులు అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది మూడు లక్షల మంది వస్తారన్న అంచనాతో ప్రసాదాన్ని సిద్ధం చేసినట్టు నిర్వాహకుల్లో ఒకరైన బత్తిని హరినాథ్‌గౌడ్ తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement