హైదరాబాద్: శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి రేపటి నుంచి రెండు రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప మందు పంపిణీ చేయనున్నట్టు డీసీపీ కమలాసన్ రెడ్డి వెల్లడించారు. రేపు (బుధవారం) ఉదయం 8 గంటల నుంచి ఎల్లుండి( గురువారం) ఉదయం వరకు చేప మందు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో జనం తరలివస్తుండటంతో తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.
చేప మందు కోసం వచ్చే స్థానిక ప్రజలు మధ్యాహ్నం తర్వాత రావాలని పోలీసులు సూచిస్తున్నారు. రద్దీ దృష్ట్యా 1500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఈసారి చేప మందు కోసం 50 నుంచి 60 వేల మంది వచ్చే అవకాశం ఉన్నట్లు డీసీపీ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు.
రేపు, ఎల్లుండి చేప మందు పంపిణీ
Published Tue, Jun 7 2016 4:11 PM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM
Advertisement
Advertisement