exibition grounds
-
ఎగ్జిబిషన్లో అగ్నిప్రమాదం.. టీడీపీ మాజీ మంత్రి హస్తం?
సాక్షి, గుంటూరు: జిల్లాలోని గుంట గ్రౌండ్లో నడుస్తున్న ఎగ్జిబిషన్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగ్జిబిషన్లో మంటలు చెలరేగడంతో.. ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. ఈ తరుణంలో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. అయితే తెలుగుదేశం నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఎగ్జిబిషన్ తగులబెట్టించారని ఆరోపిస్తున్నారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు. ఆర్నెళ్ల నుంచి నక్కా ఆనంద్ బాబు అతని అనుచరులు తమను వేధిస్తున్నారని నిర్వాహకులు చెప్తున్నారు. నక్కా ఆనంద్ బాబు అనుచరులు మధ్యాహ్నం వచ్చి నిప్పంటించి తగులబెట్టారని నిర్వాహకులు అంటున్నారు. ఈ మేరకు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం
హైదరాబాద్: మృగశిరకార్తె సందర్భంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ప్రతియేడు అందచేసే చేప మందు ప్రసాదం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సోమవారం (జూన్ 8) రాత్రి 11 గంటలకు ప్రారంభమైంది. మంగళవారం (జూన్ 9) రాత్రి వరకు ప్రసాదం పంపిణీ చేస్తామని నిర్వాహకుల్లో ఒకరైన బత్తిన హరినాథ్ గౌడ్ తెలిపారు. కాగా, ఉబ్బసం వ్యాధిగ్రస్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. గతేడాది సుమారు 4.5 లక్షల మంది చేప మందు ప్రసాదం తీసుకున్నారు. న్నట్లు వెల్లడించారు. చేప మందు తీసుకునేవారు 3 గంటల ముందు, వేసుకున్న తర్వాత గంటన్నర వరకు ఏలాంటి ఆహారం తీసుకోరాదని, గతేడాది సుమారు 4.5 లక్షల మంది ఈ ప్రసాదాన్ని తీసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రసాదం తీసుకోలేక పోయినవారు దూద్బౌలిలోని తమ నివాసంలో తీసుకోవచ్చని సూచించారు.