
ప్రసంగిస్తున్న జయరామన్
తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్‌లో అంతరిక్ష వారోత్సవాలను మంగళవారం సాయంత్రం ప్రారంభించారు.
యూనివర్సిటీ క్యాంపస్: తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్‌లో అంతరిక్ష వారోత్సవాలను మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎన్‌ఏఆర్‌ఎల్ డైరెక్టర్ జయరామన్ ముఖ్య అతిథిగా హాజరై అంతరిక్ష వారోత్సవాల ఆవశ్యకత వివరించారు. విక్రం సారాబాయి అంతరిక్ష పరిశోధనకు చేసిన కషిని విద్యార్థులకు చెప్పారు. అంతరిక్ష ప్రయోగాల్లో మనదేశం ఎంతో పురోగమించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్వీయూ అధ్యాపకులు విజయభాస్కర్‌రావు పాల్గొన్నారు.