నిడమర్రు : విద్యాశాఖ కొత్తపుంతలు తొక్కుతోంది. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే సర్వశిక్షాభియాన్ ద్వారా వివిధ యాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కొత్త వెబ్‌సైట్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది.
విద్యాశాఖ సరికొత్త వెబ్‌సైట్
Published Thu, Aug 25 2016 10:36 PM | Last Updated on Fri, Nov 9 2018 4:10 PM
నిడమర్రు : విద్యాశాఖ కొత్తపుంతలు తొక్కుతోంది. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే సర్వశిక్షాభియాన్ ద్వారా వివిధ యాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కొత్త వెబ్‌సైట్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది.
అభిప్రాయాల వేదిక ఏపీ సబ్జెక్ట్ ఫోరం
ఆన్‌లైన్‌లో రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, విద్యార్థులతో అభిప్రాయాలు పంచుకునేందుకు ‘ఆంధ్రప్రదేశ్ సబ్జెక్ట్ ఫోరం’ పేరుతో ఓ కొత్త వెబ్ పోర్టల్‌ను విద్యాశాఖ రూపొందించింది. దీనిద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర అధికారులకు అందించవచ్చు. దీనిని గురుపూజోత్సవం సందర్భంగా వచ్చేనెల 5న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి ఆ పోర్టల్లో పేర్కొన్నారు.
పూరై ్తన వర్క్‌షాప్
ఈ వెబ్‌సైట్ పనితీరుపై వివిధ అంశాలు చర్చించేందుకు జిల్లాలో కొంతమందిని కోర్ గ్రూప్ సభ్యులుగా ఎంపిక చేశారు. వీరికి ఈనెల 23, 24 తేదీల్లో విశాఖపట్నంలో వర్క్‌షాప్ నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ వర్క్‌షాప్‌లో పశ్చిమగోదా జిల్లాతోపాటు తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా,విశాఖ జిల్లాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ పోర్టల్లో లాగిన్ ఇలా...
జ్టి్టp://111.93.8.43:8080 అని గూగుల్‌లో టైప్ చేస్తే ‘ఆంధ్రప్రదేశ్ సబ్జెక్ట్ ఫోరం’ అనే పేరుతో ఓ వెబ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది.
– వెబ్‌సైట్ ముఖ చిత్రంలో కనిపించే టీచర్ జోన్ అనే టాబ్ క్లిక్ చేయాలి.
’ అక్కడ కొత్తగా నమోదయ్యేవారు న్యూటీచర్ రిజిస్ట్రేషన్ క్లిక్ వద్ద క్లిక్ చేయాలి.
’ అక్కడ పైకాంలలో రిజిస్ట్రేషన్ టైప్ వద్ద టీచర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
’ కింది కాలంలో సెల్‌నంబర్‌ను నమోదు చేయాలి. (ఇటీవల నమోదు చేసిన టీచర్ డేటా సిస్టంలో ఇచ్చిన ఫోన్‌నంబర్ మాత్రమే తీసుకుంటుంది)
–అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ అంకెలు ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్ నొక్కాలి.
’అనంతరం ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇటీవల టీచర్ డేటాలో నమోదు చేసిన వివరాలతో లాగిన్ అయిన పేజీ కనబడుతుంది.
’ ఆ పేజీలో మీ ఫోటోఅప్‌లోడ్ చేయాలి. మీ తండ్రి పేరు, మీసబ్జెక్ట్ వివరాలు మీరు ఏ అంశంలో నిష్ణాతులో తెలిపి మీ గురించి పరిచయ వాక్యాలు నమోదు చేసి సబ్‌మిట్ బటన్ నొక్కాలి. దీంతో ఈ వెబ్‌సైట్‌లో మీ పేరుమీద రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
––––––––––––––
లక్ష్యాలు ఇవీ.. ఈ వెబ్‌పోర్టల్లో రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరిని భాగస్వాములుగా చేయాలనేది ప్రధాన లక్ష్యం.
– ఉపాధ్యాయులకు అవసరమైన వృత్తి నైపుణ్యం పెంచేందుకు అవసరమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించాలి.
–ఇకపై మీ సబ్జెక్ట్‌లోగానీ, లేదా ఇరత సబ్జెక్ట్‌లోగానీ రాష్ట్ర వ్యాప్తంగా మీ ఉపాధ్యామిత్రులు పోస్ట్ చేసిన విద్యాసంబంధిత అంశాలు తెలుసుకోవచ్చు. అనుభవాలు, తరగతి గదిలోని అనుభూతులు పంచుకునేందుకు వీలుంటుంది.
’అలాగే నమోదైన ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లోని విద్యార్థులను కూడా ఈ వెబ్‌సైట్‌లో చేర్చాలి. దానికి సంబంధించిన నమోదు కాలం వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
’ ఈవెబ్‌సైట్‌లో సభ్యులుగా నమోదైనవారు విద్యా సంబంధిత సమాచారాన్ని వీడియోలు, చిత్రాలు, పాఠ్యప్రణాళికలు, ప్రాజెక్ట్‌లు, అనుభవాలు, విద్యార్థుల ప్రతిస్పందనలు తదితర అంశాలు పంచుకునే అవకాశాన్ని కల్పించారు.
’ విద్యా సంబంధిత నోటిఫికేషన్లు, సెమినార్‌లు, రూపొందించే ఫారాలు, ధ్రువీకరణ పత్రాలు వంటివి ఈ సైట్‌లో అందాబాటులోకి తీసుకువస్తారు.
’ ఈ వెబ్‌సైట్ ద్వారా ఈ– కాంటాక్ట్‌ను తయారు చేసి ఇతర పాఠశాలల ఉపాధ్యాయులకు అందించవచ్చు.
Advertisement
Advertisement