కొత్త ఏడాదిలో పసిడి కళకళ | Gold starts 2017 on positive note | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదిలో పసిడి కళకళ

Published Tue, Jan 3 2017 10:29 AM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

కొత్త ఏడాదిలో పసిడి కళకళ

కొత్త ఏడాదిలో పసిడి కళకళ

నూతన సంవత్సరం2017 లో బంగారం ధరలు శుభారంభాన్ని నిచ్చాయి.

బెంగళూరు:  నూతన సంవత్సరం2017  లో బంగారం ధరలు శుభారంభాన్ని నిచ్చాయి.  అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు బలపడ్డాయి.   2016లో  8 శాతం లాభపడిన బంగారం ధరలు  కొత్త  ఏడాది ఆరంభంలో కళకళలాడుతున్నాయి.  బలపడుతున్న డాలర్ ఒత్తిడి కొనసాగుతున్నప్పటికీ తొలిరోజు (మంగళవారం)  పసిడికి   టెక్నికల్ బైయింగ్ సపోర్ట్ లభిస్తోంది.  

ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) బంగారం 0.46 శాతం పెరిగి 1157 డాలర్లను తాకింది.  వెండి కూడా ఔన్స్‌ 0.6 శాతం  లాభపడి 16.09 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  అయితే కామెక్స్ ధరలు  2015తో  పోలిస్తే  2016 లో 7.1 శాతం ఎగిసింది.   దేశీయంగా మాత్రం సోమవారం స్పాట్‌ మార్కెట్లో 10 గ్రాముల బంగారం స్వల్పంగా క్షీణించి రూ. 27,990 వద్ద, వెండి కేజీ రూ. 570 తగ్గి రూ. 39,360 వద్ద ముగిసాయి. 

మరోవైపు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి పసిడి ఫ్యూచర్స్‌ 10 గ్రాముల ధర రూ. 125 లాభపడి రూ. 27,570ను తాకగా, వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్‌ రూ. 87 పెరిగి రూ. 39,136కు చేరింది. అమెరికా నాన్ ఫాం పే రోల్స్ డేటా కోసం  మార్కెట్ వేచి చూస్తోంది..  ఊహించిన డేటా ఉంటే తక్కువ నమోదైతే అది బంగారానికి సానుకూలసంకేతమని ,బలమైన రీబౌండ్  అయ్యే అవకాశం ఉందని షాన్ డాంగ్  గోల్డ్ గ్రూపు ఎనలిస్ట్ షు చెప్పారు.  ఈ డేటా శుక్రవారం విడుదల కానుంది.  అయితే ఫెడ్  వడ్డీ రేట్ల పెంచితే  భవిష్యత్తులో బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement