positive note
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మద్దతులో నిఫ్టీ 9200కి పైననే ఎంట్రీ ఇచ్చింది. 81 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం కొంత కిందకి పడిపోయి, 30 పాయింట్ల లాభంలో 29737 వద్ద ట్రేడవుతోంది. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా బలహీనపడి 64.30 వద్ద ప్రారంభమైంది కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, బీహెచ్ఈఎల్, సిప్లా, టీసీఎస్, బీపీసీఎల్, ఐఓసీ, భారతీ ఇన్ ఫ్రాటెల్ లాభాలు ఆర్జిస్తుండగా..హెచ్డీఎఫ్సీ, గెయిల్, లుపిన్, ఏసియన్ పేయింట్స్, ఐషర్ మోటార్స్ నష్టాలు గడిస్తున్నాయి. భౌగోళిక రాజకీయాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొనడంతో అటు ఆసియన్ మార్కెట్లు మిక్స్ డ్ గా ట్రేడవుతున్నాయి. మరోవైపు ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా 49 రూపాయలు పడిపోయి 28,672గా నమోదవుతోంది. -
కొత్త ఏడాదిలో పసిడి కళకళ
బెంగళూరు: నూతన సంవత్సరం2017 లో బంగారం ధరలు శుభారంభాన్ని నిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు బలపడ్డాయి. 2016లో 8 శాతం లాభపడిన బంగారం ధరలు కొత్త ఏడాది ఆరంభంలో కళకళలాడుతున్నాయి. బలపడుతున్న డాలర్ ఒత్తిడి కొనసాగుతున్నప్పటికీ తొలిరోజు (మంగళవారం) పసిడికి టెక్నికల్ బైయింగ్ సపోర్ట్ లభిస్తోంది. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) బంగారం 0.46 శాతం పెరిగి 1157 డాలర్లను తాకింది. వెండి కూడా ఔన్స్ 0.6 శాతం లాభపడి 16.09 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే కామెక్స్ ధరలు 2015తో పోలిస్తే 2016 లో 7.1 శాతం ఎగిసింది. దేశీయంగా మాత్రం సోమవారం స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం స్వల్పంగా క్షీణించి రూ. 27,990 వద్ద, వెండి కేజీ రూ. 570 తగ్గి రూ. 39,360 వద్ద ముగిసాయి. మరోవైపు ఎంసీఎక్స్లో ఫిబ్రవరి పసిడి ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ. 125 లాభపడి రూ. 27,570ను తాకగా, వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 87 పెరిగి రూ. 39,136కు చేరింది. అమెరికా నాన్ ఫాం పే రోల్స్ డేటా కోసం మార్కెట్ వేచి చూస్తోంది.. ఊహించిన డేటా ఉంటే తక్కువ నమోదైతే అది బంగారానికి సానుకూలసంకేతమని ,బలమైన రీబౌండ్ అయ్యే అవకాశం ఉందని షాన్ డాంగ్ గోల్డ్ గ్రూపు ఎనలిస్ట్ షు చెప్పారు. ఈ డేటా శుక్రవారం విడుదల కానుంది. అయితే ఫెడ్ వడ్డీ రేట్ల పెంచితే భవిష్యత్తులో బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతుందన్నారు.