లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | Nifty opens above 9200, Sensex firm on short covering | Sakshi
Sakshi News home page

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Published Mon, Apr 10 2017 9:37 AM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మద్దతులో నిఫ్టీ 9200కి పైననే ఎంట్రీ ఇచ్చింది. 81 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం కొంత కిందకి పడిపోయి,  30 పాయింట్ల లాభంలో 29737 వద్ద ట్రేడవుతోంది. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా బలహీనపడి 64.30 వద్ద ప్రారంభమైంది
 
కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, బీహెచ్ఈఎల్, సిప్లా, టీసీఎస్, బీపీసీఎల్, ఐఓసీ, భారతీ  ఇన్ ఫ్రాటెల్ లాభాలు ఆర్జిస్తుండగా..హెచ్డీఎఫ్సీ, గెయిల్, లుపిన్, ఏసియన్ పేయింట్స్, ఐషర్ మోటార్స్ నష్టాలు గడిస్తున్నాయి. భౌగోళిక రాజకీయాల్లో ఆందోళనకరమైన  పరిస్థితులు నెలకొనడంతో అటు ఆసియన్ మార్కెట్లు మిక్స్ డ్ గా ట్రేడవుతున్నాయి. మరోవైపు ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా 49 రూపాయలు పడిపోయి 28,672గా నమోదవుతోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement