పనాజి: తెహెల్కా మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ రేప్ కేసు సంవత్సరాల ఆలస్యం తర్వాత వచ్చే నెల నుంచి విచారణకు రానుంది. ఫిబ్రవరిలో విచారణ ప్రారంభమవుతుందని గోవా కోర్టు తెలిపింది. తన సహచర ఉద్యోగినిపై ఆయన అత్యాచారం జరిపారనేది అభియోగం. ఫిబ్రవరి 26నుంచి విచారణ ప్రారంభమై నాలుగు రోజులపాటు జరుగుతుందని, ఇన్‌కెమెరా విచారణ చేస్తామని అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి విజయపాల్ రూలింగ్ ఇచ్చారు. 2013లో తేజ్‌పాల్ తెహెల్కా మ్యాగజిన్‌కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా ఉన్నపుడు గోవాలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో తెహెల్కా నిర్వహించిన అంతర్జాతీయ సమావేశం సందర్భంగా తనపై అత్యాచారం జరిపారని సంస్థలోని మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరిపి ఆయన్ను అరెస్టు చేయగా ఏడాదిపాటు ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉండి ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యారు. దాంతో ఆయన మ్యాగజిన్‌లో తన పదవికి రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment