Tehelka Editor Tarun Tejpal
-
ఫిబ్రవరిలో తేజ్‌పాల్ రేప్ కేసు విచారణ
పనాజి: తెహెల్కా మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ రేప్ కేసు సంవత్సరాల ఆలస్యం తర్వాత వచ్చే నెల నుంచి విచారణకు రానుంది. ఫిబ్రవరిలో విచారణ ప్రారంభమవుతుందని గోవా కోర్టు తెలిపింది. తన సహచర ఉద్యోగినిపై ఆయన అత్యాచారం జరిపారనేది అభియోగం. ఫిబ్రవరి 26నుంచి విచారణ ప్రారంభమై నాలుగు రోజులపాటు జరుగుతుందని, ఇన్‌కెమెరా విచారణ చేస్తామని అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి విజయపాల్ రూలింగ్ ఇచ్చారు. 2013లో తేజ్‌పాల్ తెహెల్కా మ్యాగజిన్కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా ఉన్నపుడు గోవాలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో తెహెల్కా నిర్వహించిన అంతర్జాతీయ సమావేశం సందర్భంగా తనపై అత్యాచారం జరిపారని సంస్థలోని మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరిపి ఆయన్ను అరెస్టు చేయగా ఏడాదిపాటు ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉండి ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యారు. దాంతో ఆయన మ్యాగజిన్లో తన పదవికి రాజీనామా చేశారు. -
లైంగిక దాడి కేసులో షోమా చౌదరి స్టేట్మెంట్ రికార్డు
తెహల్కా మాజీ మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి స్టేట్మెంట్ను గోవా కోర్టు శనివారం రికార్డు చేసింది. సహోద్యోగినిపై తెహెల్కా పత్రిక వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ లైంగిక దాడి కేసులో షోమా చౌదరితో పాటు మరో ముగ్గురు ఉద్యోగుల వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేసేందుకు గోవా పోలీసులు బుధవారం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టుకు హాజరయ్యేందుకు షోమా చౌదరి శుక్రవారం రాత్రే ఢిల్లీ నుంచి గోవా చేరుకున్నారు. లైంగిక దాడి సంఘటన తెలిసిన మొదటి వ్యక్తి షోమా కావడంతో ఆమె వాంగ్మూలం చాలా కీలకంగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు కస్టడీ ముగియటంతో తరుణ్ తేజ్పాల్ను పోలీసులు ఈరోజు కోర్టులో హాజరు పరచనున్నారు. కాగా మరో వారం పాటు తేజ్‌పాల్ కస్టడీ పొడిగించేందుకు పోలీసులు న్యాయస్థానం అనుమతి కోరనున్నారు. సంస్థలోని మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై గోవా పోలీసులు తేజ్పాల్ను అరెస్టు చేయడం తెలిసిందే. -
మహిళా జర్నలిస్టు ఉద్యోగానికి రాజీనామా
న్యూఢిల్లీ : లైంగిక వేధింపులకు గురైన మహిళా జర్నలిస్టు తన ఉద్యోగానికి సోమవారం రాజీనామా చేసింది. గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్లో పది రోజుల కిందట తెహెల్కా మేగజైన్ వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణ్ తేజ్ పాల్ సోమవారం ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్ట్‌ను తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ కోసం ఆయన ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. తేజ్ పాల్ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ జీఎస్ సిస్తానీ ముందు ఆయన తరపు న్యాయవాదులు గీతా లుథ్రా, ప్రమోదు దూబేలు ఉంచారు. తేజ్ పాల్ ముందస్తు పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టనున్నారు.