రోబో 2.0 రిపోర్టింగ్ మొదలైంది
Published Wed, Dec 16 2015 4:20 PM | Last Updated on Sun, Sep 3 2017 2:06 PM
చెన్నై: అసక్తిగా ఎదురు చూస్తున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో సీక్వెల్ రోబో 2 ' చిత్రం షూటింగ్ కార్యక్రమాలు బుధవారం చెన్నైలో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. సంచలన దర్శకుడు శంకర్ సారధ్యంలో రూపుదిద్దుకున్న ఈ సీక్వెల్ కి టైటిల్ 'రోబో-2' అనే ప్రచారం జరుగుతోందని, అది కాదని..2.0 అని దర్శకుడు శంకర్ మంగళవారం ట్వీట్ చేశాడు. అటు 3డి ఫార్మాట్‌లో తీయనున్న ఈసినిమాని ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్‌గా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేయటానికి ప్లాన్‌చేశారు. సౌత్ నుంచి ఇంటర్నేషనల్ వరకూ ఒకే టైటిల్‌తో ప్రమోట్ చేయటానికి శంకర్ ఈ సినిమా టైటిల్‌ని మార్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే తెలుగుకు మాత్రం రోబో 2.0 అనే టైటిల్ ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం
రోబోలో సెన్సేషన్ క్రియేట్ చేసిన రోబో చిట్టీని.. ఈ ఆడ చిట్టీగా రాబోతోంది. ఈ పాత్రను వెరైటీగా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఫీమేల్ ఆసారి చిట్టీతో ఎవరితో పరిచయం పెంచుకుంది.. ఎవరితో ప్రేమలో పడింది... ఏం చేసింది అనేది రెండవ భాగం కథాంశం. ఐ సినిమాతో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ యామీ జాక్సన్ ఈ ఆడచిట్టి ప్రాతను పోషించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోఆమె రూపానికి తగ్గట్టు , ప్రత్యేక దుస్తులు, ఒక స్పెషల్ రోబోను రడీ చేస్తున్నారని తెలుస్తోంది.
లికా ప్రొడక్షన్స్ పై వస్తున్న ఈ రోబో 2 కి ఆస్కార్ అవార్డు విజేత ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా బాహుబలి ఫేం శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్ సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాలనేది దర్శక నిర్మాతల ప్లాన్. అటు రజినీకాంత్, ఐశ్వర్య రాయ్‌ల కాంబినేషన్‌లో 2010లో వచ్చిన రోబో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో రజినీ , శంకర్ –యామీ జాక్సన్ ల క్రేజీ కాంబినేషన్ పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ క్రేజ్ నెలకొంది.
Advertisement
Advertisement