Rolling
-
ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం
బండిఆత్మకూరు: ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం చెందాడు. కృష్ణనంది క్షేత్రం కాంక్రీట్ పనులు జరుగుతుండటంతో సుమారు 20 మందిని కూలీలను వెంగళరెడ్డి పేట గ్రామం నుంచి ట్రాక్టర్లో పల్లె యుగంధర్‌రెడ్డి (26) తీసుకెళ్లాడు. వారిని అక్కడ దించి ఒంటరిగా తిరిగి ప్రయాణమయ్యాడు. కడమల కాల్వ సమీపంలోని మలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన తవ్విన కోపు గుంతల్లో ఉన్న నీటిలో ట్రాక్టర్ బోల్తా పడింది. యుగంధర్‌రెడ్డిపై ట్రాక్టర్ పడటంతో పొలాల్లో పని చేసుకుంటున్న కూలీలు అక్కడికి చేరుకుని ట్రాక్టర్‌ను పక్కకు తీశారు. అప్పటికే డ్రైవర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమన్నీరుగా రోదించారు. మృతుడి భార్య పుష్పలత రోదన పలువురిని కలిచి వేసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విష్ణు నారాయణ తెలిపారు. -
రోబో 2.0 రిపోర్టింగ్ మొదలైంది
చెన్నై: సంచలన దర్శకుడు శంకర్, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సెన్సేషనల్ మూవీ రోబోకి సీక్వెల్ రోబో 2 షూటింగ్ కార్యక్రమాలు చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఫస్ట్ పార్టులో సెన్సేషన్ క్రియేట్ చేసిన రోబో చిట్టి.. ఈసారి ఆడ చిట్టీగా రాబోతోంది. ఈ పాత్రను వెరైటీగా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఫీమేల్ చిట్టి ఎవరితో పరిచయం పెంచుకుంది.. ఏం చేసిందనేదే రెండోభాగం కథాంశం. ఐ సినిమాతో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ అమీ జాక్సన్ ఈ ఆడచిట్టి ప్రాతను పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె రూపానికి తగ్గట్టు, ప్రత్యేక దుస్తులు, ఒక స్పెషల్ రోబో రెడీ అవుతున్నాయి. మరోవైపు ఇన్నాళ్లు ఆసక్తి రేపిన సినిమాలోని విలన్ ప్రాత చివరికి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌ను వరించింది. ముందు హాలీవుడ్ మెగా హీరో అర్నాల్డ్ ష్వాజ్‌నెగర్‌ను అనుకున్నారు. తర్వాత ఆమిర్‌ను కూడా సంప్రదించారు. చివరికి బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ ను ఫిక్స్ చేసేశారు. ఆ విషయాన్ని స్వయంగా అక్షయ్ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నారు. రజనీకాంత్ గారితో సినిమా ప్రారంభంతో ఈ సంవత్సరం ముగియడం చాలా సంతోషంగా ఉందంటూ ఒక ఫొటోను షేర్ చేశారు. లికా ప్రొడక్షన్స్ పై వస్తున్న ఈ రోబో 2 కి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా బాహుబలి ఫేం శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్ సమకూరుస్తున్నారు. హాలీవుడ్ సంస్థ మేరీ ఈ వోగ్ట్ కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేయనుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాలనేది దర్శక నిర్మాతల ప్లాన్. రజనీకాంత్, ఐశ్వర్య రాయ్‌ల కాంబినేషన్లో 2010లో వచ్చిన రోబో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో రజనీ, శంకర్ అమీ జాక్సన్‌ల క్రేజీ కాంబినేషన్ పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ టాక్ వినిపిస్తోంది. Ending the year on a high note! Super excited to be a part of Robot 2 with the one & only @superstarrajini sir! pic.twitter.com/mC7AINo3JR — Akshay Kumar (@akshaykumar) December 16, 2015 -
రోబో 2.0 రిపోర్టింగ్ మొదలైంది
చెన్నై: అసక్తిగా ఎదురు చూస్తున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో సీక్వెల్ రోబో 2 ' చిత్రం షూటింగ్ కార్యక్రమాలు బుధవారం చెన్నైలో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. సంచలన దర్శకుడు శంకర్ సారధ్యంలో రూపుదిద్దుకున్న ఈ సీక్వెల్ కి టైటిల్ 'రోబో-2' అనే ప్రచారం జరుగుతోందని, అది కాదని..2.0 అని దర్శకుడు శంకర్ మంగళవారం ట్వీట్ చేశాడు. అటు 3డి ఫార్మాట్లో తీయనున్న ఈసినిమాని ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్‌గా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేయటానికి ప్లాన్చేశారు. సౌత్ నుంచి ఇంటర్నేషనల్ వరకూ ఒకే టైటిల్‌తో ప్రమోట్ చేయటానికి శంకర్ ఈ సినిమా టైటిల్‌ని మార్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే తెలుగుకు మాత్రం రోబో 2.0 అనే టైటిల్ ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం రోబోలో సెన్సేషన్ క్రియేట్ చేసిన రోబో చిట్టీని.. ఈ ఆడ చిట్టీగా రాబోతోంది. ఈ పాత్రను వెరైటీగా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఫీమేల్ ఆసారి చిట్టీతో ఎవరితో పరిచయం పెంచుకుంది.. ఎవరితో ప్రేమలో పడింది... ఏం చేసింది అనేది రెండవ భాగం కథాంశం. ఐ సినిమాతో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ యామీ జాక్సన్ ఈ ఆడచిట్టి ప్రాతను పోషించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోఆమె రూపానికి తగ్గట్టు , ప్రత్యేక దుస్తులు, ఒక స్పెషల్ రోబోను రడీ చేస్తున్నారని తెలుస్తోంది. లికా ప్రొడక్షన్స్ పై వస్తున్న ఈ రోబో 2 కి ఆస్కార్ అవార్డు విజేత ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా బాహుబలి ఫేం శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్ సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాలనేది దర్శక నిర్మాతల ప్లాన్. అటు రజినీకాంత్, ఐశ్వర్య రాయ్‌ల కాంబినేషన్లో 2010లో వచ్చిన రోబో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో రజినీ , శంకర్ –యామీ జాక్సన్ ల క్రేజీ కాంబినేషన్ పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ క్రేజ్ నెలకొంది. -
లావూ... సన్నం!
అందం-ఆరోగ్యం ‘‘అమె అందంగా ఉంది’’ ... గొణిగాడు విన్స్టన్. ‘‘నడుము చూశావా! చుట్టుకొలత ఈజీగా మీటరు ఉంటుంది’’... ఈర్ష్యగా పుల్ల విరిచింది జూలియా. ‘‘అదే ఆమె అందం’’ అన్నాడు విన్స్టన్. జార్జి ఆర్వెల్ రాసిన ఓ నవల్లోని పాత్రలు విన్స్టన్, జూలియా. మధ్యలో ఆ పెద్ద నడుము స్త్రీ ఎవరు? ఆమె కూడా ఒక పాత్రే. ‘లావు’ అని జూలియా ఆమెను తేలికచేసి పడేస్తే, ‘లావే అందం’ అని విన్స్టన్ మెస్మరైజ్ అయ్యాడు. ఆ సాయంత్రం... బ్రిటిస్ బుక్ అవార్డ్స్ ఫంక్షన్‌కి వెళ్లొస్తున్నారు జేకే రోలింగ్. సడెన్‌గా పాత ఫ్రెండ్ ఎదురైంది. ‘‘హే, రోల్! ఏంటి ఇంతలా చిక్కిపోయావ్?’’. ఫ్రెండ్ చూపుల్లో ఆశ్చర్యం. రోలింగ్, ఆ పాత ఫ్రెండ్ కలుసుకుని మూడేళ్లయింది.‘హ్యారీ పోట్టర్’ వంటి గొప్ప ఫిక్షన్ సీరీస్‌ను రాసిన రోలింగ్‌కి ఏం చెప్పాలో తెలీలేదు. ‘‘అప్పుడు పిల్ల తల్లిని కదా’’ అంది. తర్వాత అనుకుంది... ‘‘ఈ మూడేళ్లలోనూ నేనో బిడ్డకు జన్మనిచ్చాను. నా ఆరో నవల రాశాను’’ అని చెప్పి ఉండాల్సిందని. ‘‘సైజు తప్ప మనిషిలో మనిషికి ఆసక్తిరమైనవి ఏవీ ఉండవా!’’.. ఇంటికొచ్చాక నిలువుటద్దంలో చూసుకుంటూ అనుకుంది రోలింగ్. తన ఫ్రెండ్ అన్నమాట నిజమే. నడుము బాగా చిక్కిపోయింది. అంటే సన్నబడింది. రోలింగ్ తన మూడో బిడ్డను, ఆరో పుస్తకాన్ని పక్కనపెట్టి సన్నబడడాన్ని తన మనసు సెలబ్రేట్ చేసుకోడాన్ని ఆమె గమనించింది. మార్లిన్ మన్రో. ఆమెరికన్ యాక్ట్రెస్, మోడల్, సింగర్... అన్నిటినీ మించి తన కాలపు సెక్స్ సింబల్. ఆమె ఎలా నవ్వితే అది అందం. ఎలా నడిస్తే అది ట్రెండ్. ఏం వేసుకున్నా, వేసుకోకపోయినా అది ఫ్యాషన్. ఆడామగా అన్న తేడా లేకుండా అందరి ఆరాధ్య దేవత. ఆమె ఏం మాట్లాడితే అది వేదం. ‘‘లావుగా ఉండడంలో ఒక్క సంతోషకరమైన సంగతి కూడా లేదు. అయినా సమాజం మనల్ని సన్నగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు అలా కాకుండా వేరేలా ఎలా ఉండగలం? సన్నగా ఉంటే అందంగా ఉంటాం. అందంగా ఉంటే జీవితం హ్యాపీగా ఉంటుంది. నా జీవితంలో నేను ఒక్కరోజు కూడా ఫ్యాటీగా లేను. ఫ్యూచర్లో కూడా ఫ్యాటీగా ఉండబోను’’... ఈ మాటలు మన్రోవి. ఇంతకీ లావా? సన్నమా? ఏది అందం? బరువు పెరగడమా? బక్కచిక్కడమా? ఏది అందం? ఫ్యాటీగా లేకపోవడమే అందమా? లావూ, సన్నం రెండూ అందమే అంటున్నారు యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ వైద్య పరిశోధకులు. అయితే లావుగా ఉండేవారు ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలట!