ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం
Published Sun, Dec 25 2016 11:41 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
బండిఆత్మకూరు: ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం చెందాడు. కృష్ణనంది క్షేత్రం కాంక్రీట్ పనులు జరుగుతుండటంతో సుమారు 20 మందిని కూలీలను వెంగళరెడ్డి పేట గ్రామం నుంచి ట్రాక్టర్‌లో పల్లె యుగంధర్‌రెడ్డి (26) తీసుకెళ్లాడు. వారిని అక్కడ దించి ఒంటరిగా తిరిగి ప్రయాణమయ్యాడు. కడమల కాల్వ సమీపంలోని మలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన తవ్విన కోపు గుంతల్లో ఉన్న నీటిలో ట్రాక్టర్ బోల్తా పడింది. యుగంధర్‌రెడ్డిపై ట్రాక్టర్ పడటంతో పొలాల్లో పని చేసుకుంటున్న కూలీలు అక్కడికి చేరుకుని ట్రాక్టర్‌ను పక్కకు తీశారు. అప్పటికే డ్రైవర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమన్నీరుగా రోదించారు. మృతుడి భార్య పుష్పలత రోదన పలువురిని కలిచి వేసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విష్ణు నారాయణ తెలిపారు.
Advertisement
Advertisement