
రోబో 2.0 రిపోర్టింగ్ మొదలైంది
చెన్నై: సంచలన దర్శకుడు శంకర్, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సెన్సేషనల్ మూవీ రోబోకి సీక్వెల్ రోబో 2 షూటింగ్ కార్యక్రమాలు చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఫస్ట్ పార్టులో సెన్సేషన్ క్రియేట్ చేసిన రోబో చిట్టి.. ఈసారి ఆడ చిట్టీగా రాబోతోంది. ఈ పాత్రను వెరైటీగా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఫీమేల్ చిట్టి ఎవరితో పరిచయం పెంచుకుంది.. ఏం చేసిందనేదే రెండోభాగం కథాంశం. ఐ సినిమాతో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ అమీ జాక్సన్ ఈ ఆడచిట్టి ప్రాతను పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె రూపానికి తగ్గట్టు, ప్రత్యేక దుస్తులు, ఒక స్పెషల్ రోబో రెడీ అవుతున్నాయి.
మరోవైపు ఇన్నాళ్లు ఆసక్తి రేపిన సినిమాలోని విలన్ ప్రాత చివరికి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌ను వరించింది. ముందు హాలీవుడ్ మెగా హీరో అర్నాల్డ్ ష్వాజ్‌నెగర్‌ను అనుకున్నారు. తర్వాత ఆమిర్‌ను కూడా సంప్రదించారు. చివరికి బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ ను ఫిక్స్ చేసేశారు. ఆ విషయాన్ని స్వయంగా అక్షయ్ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నారు. రజనీకాంత్ గారితో సినిమా ప్రారంభంతో ఈ సంవత్సరం ముగియడం చాలా సంతోషంగా ఉందంటూ ఒక ఫొటోను షేర్ చేశారు.
లికా ప్రొడక్షన్స్ పై వస్తున్న ఈ రోబో 2 కి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా బాహుబలి ఫేం శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్ సమకూరుస్తున్నారు. హాలీవుడ్ సంస్థ మేరీ ఈ వోగ్ట్ కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేయనుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాలనేది దర్శక నిర్మాతల ప్లాన్. రజనీకాంత్, ఐశ్వర్య రాయ్‌ల కాంబినేషన్‌లో 2010లో వచ్చిన రోబో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో రజనీ, శంకర్ అమీ జాక్సన్‌ల క్రేజీ కాంబినేషన్ పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ టాక్ వినిపిస్తోంది.
Ending the year on a high note! Super excited to be a part of Robot 2 with the one & only @superstarrajini sir! pic.twitter.com/mC7AINo3JR
— Akshay Kumar (@akshaykumar) December 16, 2015