ఎయిర్టెల్ మరో బంపర్ ఆఫర్ | Airtel starts offering 5GB extra broadband data per connection | Sakshi
Sakshi News home page

ఎయిర్టెల్ మరో బంపర్ ఆఫర్

Published Wed, Aug 10 2016 8:49 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

ఎయిర్టెల్ మరో బంపర్ ఆఫర్

ఎయిర్టెల్ మరో బంపర్ ఆఫర్

రిలయన్స్ జియో పోటీని ఎదుర్కొనే  వ్యూహంలో భాగంగా భారతి ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.  బ్రాడ్ బ్యాండ్, డీటీహెచ్ కస్టమర్ల కోసం బుధవారం  మరో కొత్త పథకాన్ని ప్రకటించింది.  రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నుంచి  ఎదురవుతున్న ముప్పు  ను  తట్టుకొనే చర్యల్లో భాగంగా  తాజాగా  భారతీ ఎయిర్టెల్  తన  ప్రతి పోస్ట్ పెయిడ్ బ్రాడ్ బ్యాండ్ లేదా డీటీహెచ్ వినియోగదారులకు 5  జీబీ అదనపు డేటాను  అందించనుంది.

ఎయిర్ టెల్  ల్యాండ్ లైన్ లో అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనం తో పాటు, వినియోగదారులకు ఇప్పుడు ఉచిత అదనపు డేటా ప్రయోజనాలు కల్పిస్తోంది. వారికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు  బ్రాడ్బ్యాండ్ వినియోగదారులను ధన్యవాదాలు చెప్పారు  భారతి ఎయిర్టెల్ (భారతదేశం) సీఈఓ  హేమంత్ కుమార్  గురుస్వామి. 'మై హోం  రివార్డ్స్' పథకం కింద ఈ అఫర్  ను అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement